Wednesday, November 4, 2020

MEEDUSHTAMA SIVATAMA-09

 


  మీడుష్టమ శివతమ-09

 *********************


   న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు ౠద్రుని అర్చించలేడు.


  నచ్చాడు సాధకుడు.మెచ్చివచ్చాడు రుద్రుడు.యధాప్రకారముగా వరము కోరుకో -అనుగ్రహిస్తానన్నాడు.


 సంసయించాడు సాధకుడు.ఈ రుద్రుడు టక్కరివాడు.అనుగ్రహమంటాడు.ఇచ్చానంటాడు.తీరా ఈసుకుందామనుకుంటే దక్కనీయడు.పైగా ఆనందమేనా అంటు వచ్చి పరామర్శిస్తుంటాడు.అర్థం చేసుకో అంటూ పరాచికాలాడతాడు.అడిగితేనే ఇచ్చాగా అంటు గడసరి మాటలాడుతాడు.తిమ్మిని బమ్మిని చేస్తాడు.ఇప్పుడు నేను బాగా ఆలోచించుకుని అదగాలి అని అనుకుంటున్నాడు.


   గమనించిన రుద్రుడు తొందరేమిలేదులే.బాగా ఆలోచించుకుని అడుగు.అనుగ్రహిస్తాను.ఈలోగా నన్ను ఆశ్రయిస్తున్న మరొక అర్థిని కరుణించివస్తాను అంటు కదిలాడు రుద్రుడు.


   స్థిమితబడ్డ మనసుతో అడుగుటకు సిధ్ధమయ్యాడు సాధకుడు తడబడకుండ.



   తలచినంతనే ఎదురుబడతాడు ఆ ఈగుడుదిగుడు కన్నులవాడు ఏమి తెలియనివానిలానటిస్తూ.అది ఒకలీల.


   రుద్రా విను,వర్మాచాఎ-నాకు అందమైన సమర్థవంతమైన శరీరముకావాలి.దీనికి శక్తిని ప్రసాదించు.అంతే కాదు ఇది కాంతివంతమై ఉండాలి కనుక త్విషిశ్చమే అనీడుగుతున్నాను.ఈ కాంతివంతమైన-శక్తివంతమైన శరీరముతో ఏమిచేస్తావు ? అమి అడుగుతావేమో-నేను దీనితో క్రీడిస్తాను.ఆటలెన్నో ఆడతాను.దానివలన ఏమి ప్రయోజనము అనుకుంటావేమో?నాకు సంతోషము కలుగుతుంది.దానిని నీవే ఈయగలవు కనుక క్రీడాశ్చమే-మోదశ్చమే అని అడుగుతున్నాను.నాకు శక్తివంతమైన సుందరమైన శరీరమును-దానికి కాంతిని-ఆటలు ఆడుకునే ఉత్సాహమును-తద్వార సంతోషమును కలుగచేయాలి నీవు అని తెలివిగా అడిగినందుకు ఆనందములో తేలియాడుతున్నాడు.


    ఇవేనా-ఇంకా ఏమైన కావాలా? నేను వెళ్ళగానే గుర్తుచేయలేదని తంటాలయ్యా నాకు అనాడు రుద్రుడు కొంటెగా.


   ఇంతేకాదు.సరేనంటు మరేనంటు సాకుచూసుకొని సాగిపోతావు.


    ఇవి నాకుమాత్రమేకాదు.నాకు వంశాన్నీచ్చి-దానిని అభివృధ్ధిచేయి.వారిని శక్తివంతులుగా దీవించు.ఆటలు ఆడుకోని.ఆనందించనీ అంటూ అడిగేసాడు ఆలస్యము చేయకుండా సాధకుడు.


 "ద్రాఘయశ్చమే" అంటు.


  తథాస్తు అన్నాడు రుద్రుడు .తన్మయత్వములో మునిగాడు సాధకుడు.


 కదిలేవన్నీ కథలు-కదిలించేది కరుణ.


 అణువణువు సివమే-అడుగడుగు శివమే.


  సర్వం శివమయం జగం. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...