Wednesday, November 4, 2020

MEEDUSHTAMA SIVATAMA-10

 


  మీడుష్టమ శివతమ-10


 న రుద్రో రుద్రమర్చయేత్.


  రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.వంసాభివృధ్ధి వరముగా లభించిందిగా.అందమైన భార్య .గర్భాశ్చమే-వత్సాశ్చమే-పిల్లలు ఆతలు-పాటలు-ఆనందాలు.అవధులు లేని ఆనందము.తనను తాను మరిచిన వేళ తారసపడినది రుద్రుని లీల.అంతే,


   తనను తాను విమర్శించుకున్నాడు.తన సాధన ఏది? ఏమైనది? ఈ విషయవాసనలు నన్ను ఇంతగా ఆకర్షిస్తున్నవి.బంధిస్తున్నవి.భగవతత్త్వను బహిష్కరించేస్తున్నవి.అమ్మో రుద్రా.నా చేత సరీరమును-క్రీడలను-వంశమును-మోదమును అడిగేటట్లు చేసి,ఇచ్చినట్లు కనికట్టు చేసి,కట్టివేసావా?కఠినాత్ముడవు నీవు కనికరము లేనివాడవు.నాకు కావలిసినదే ఇస్తున్నట్లు నటించి నా సాధనకు కాలదోషము పట్టించావు.కనపడు.నిన్ని కడిగిపదేస్తా(అభిషేకము) అంటూ కృధ్ధుదై యున్న సాధకుని ఎదుట సాక్షాత్కరించాడు రుద్రుడు.


  సాంబుడిగా నన్ను చూశావు.మాఓదిలో గనపతిని-గుహుని చూసావు.మాకుటుంబము వలె నీకు కుటుంబము కావాలనుకున్నావు.తప్పులేదు. వచ్చిన చిక్కల్లా నీ చర్మహక్షువులతో చూచిన కుటుంబమే మేమని భావించదము.


  అంతే! అర్థము కాలేదు సాధకునికి.


  పరమార్థము చెప్పదలిచాడు రుద్రుడు.


  అతిశయమైన జ్ఞానమే బ్రహ్మము.అది ఒక్కొక్క సారి నిక్షిప్తముగాను-మరొక్కసారి ప్రకటితమవుతు ఉంటుంది.దానికి గుణము-పరిమానము అను రెండు భాగములుంతాయి.అది తాబేలులా తన అవయములన్నిటిని ముడుచుకున్నప్పుడు గుణము మాత్రమే దాని పైచిప్పవలె ద్యోతకమగుతుంటుంది.గుణము పరిమానమును కప్పివేస్తుంది.చిప్పనుండి దాని అవయములను బయటకు తీసినట్లు బ్రహ్మము అప్పుడప్పుడు గుణమును చిన్నదిగ చేసుకొని-పరిమానమును విస్తరింపచేస్తుంది.దానికి మరీ ముచ్చత వేసినదనుకో పరిమిత గునముతో-పరిమానముతో ప్రకాశిస్తుంటుంది.ఆ బ్రహ్మము యొక్క గుణ-పరిమానములే అనేకములై అనేకరూపములను భ్రాంతిని కలిగిస్తాయి.నీలోని బ్రహ్మము-నీ భార్యబిడ్డలలోని బ్రహ్మము ఒక్కటే అను ఎరుకలేక,వారిని నీకు అన్యముగా భావిస్తు,బంధనము నుండి బయటకు రాలేకపోతున్నావు.


   అంతదాక ఎందుకు? నిర్వికారమైన నేను నీ ఎదుటకు వచ్చి నిలబడుటకు నా గుణమును చిన్నది చేసుకొని-పరిమానమును విస్తరింపచేసి వస్తున్నాను కదా.



  ఈ విషయమును స్పురణమునందుంచుకొని సాధన చేయి.అంతా శివమయమవుతుంది అంటున్నాడు రుద్రుడు.తరించిపోతున్నాడు తన్మయత్వములో సాధకుడు.


   కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


అణువణువు శివమే-అడుగడుగు శివమే.


   సర్వం శివమయం జగం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...