ఇరువదవ పాశురము.
******************
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు
కప్పం తవిర్కుం కలియే ! తుయిళెరాయ్
శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కు
వెప్పం కొడుక్కుం విమలా!తుయిళెరాయ్
శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్
నప్పినై నంగాయ్ తిరువే తుయివెళాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై
ఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.
ఓం అనంతకళ్యాణగుణనిధియే నమః
******************************
కిందటి పాశురములో 'పంచశయనిత్తిల్ అని ఐదు విశేషగుణశోభితమైన -అర్థపంచకమును మనకు పరిచయము చేసింది గోదమ్మ.క్షిప్ర ప్రసాదముగా అవి వారికి లభించినట్లున్నాయి,వారు అక్కడనే వారి గడపముందే నిలబడి ఉన్నారు.అవి ఏమిటంటే,
1.స్వస్వరూపమును తెలిసికొనుట-గోపికలు తమను జీవులుగా గుర్తించారు.అదియే స్వస్వరూప జ్ఞానము.
2. పరస్వరూపము-స్వామిని పరమాత్మగాను ప్రశంసిస్తున్నారు.అదియే పరరూప జ్ఞానము.
3.స్వామిని మేలుకొలిపి అద్దము-విసనకర్రతో-పాటుగా స్వామిని తీసుకుని వెళ్ళి జలకములాడతలిచారు.భగవద్గుణగణములలో మునిగితేలుట.అది.అదియే పురుషార్థ జ్ఞానము.
4. ఎంత వేడుకున్నను స్వామి మేల్కొనుటలేదు.అనుగ్రహించుటలేదని గమనించుటయే విరోధికృత జ్ఞానము.
5.దానిని అధిగమించుటకు వారు నీలమ్మను స్వామిని అద్దము-విసనకర్రతో పాటు అనుగ్రహించమని,అదియును "ఇప్పోదు" ఇప్పుడే
ఇంక మేము విరహవేదనను తాళలేమని విన్నవించుకుంటున్నారు.ఇది ఉపాయ జ్ఞానము.
దర్శనమునకై వేచియున్నవి వారి చక్షువులు.సంకీర్తమునుతో సత్కరించుచున్నవి స్వామిని వారి సంకీర్తనము.క్షణమైనను సేవింపక ఉండలేని పరిస్థితి వారిది.
ఓ స్వామి-ఓ,
తిరలుడయాయ్-సర్వాంతర్యామి,
నీవు మాకు దర్శనభాగ్యమును అనుగ్రహించకపోవుటకు కారణం
అది నీకు సాధ్యముకానిదని కాదు.మమ్ములను నీ సంకీర్తన భాగ్యముతో కాసేను పరవశించే భాగ్యమును అనుగ్రహించావా స్వామి,అలాగే కానీ.అవధరించవయ్యా అని,
కృష్ణా!-కష్టములను తొలగించేవాడ,
మున్సెన్రు-ముందరనే-వారు నిన్ను అర్థించకనే,వారు బాధపడకూడదని,
నీవు వెళ్ళి, వారికి
మున్శెన్రు-ముందర నిలబడతావు-నేనున్నాను,మీకేమి భయములేదని.
వెళ్ళి ఏమిచేస్తావంటే,
వారి,
కప్పం-కంపనము,శత్రుభయముచే వారికి కలిగిన భయముతో కూడిన వణుకును,
తవిర్కుం-పోగొడతావు.పూర్తిగా
అప్పుడా భయము వారి శత్రువును దహించివేస్తుంది.అంతటి ,
శెట్రార్కే-శత్రువులకు
వెప్పముడక్కు- వెరపు/
భయమును కలిగిస్తావు.వారిని నశింపచేస్తావు.
శత్రువులను మట్టుపెట్టే మహాపరాక్రమము నీది కన్నా.!
అట్టినీవు నిదురవీడి,బయటకు రాలేక పోవుటకు కారణము మామీది నిర్లక్ష్యముకాదు.కాసేపు మా సంకీర్తనను వినాలనుకున్నావా స్వామి.
ఇప్పుడు వారు నీలాదేవిని కూడ అర్థముచేసుకున్నారు.అమ్మ మనకు తప్పక స్వామిని మేలుకొనమని చెప్పి దర్శనభాగ్యమును కలిగిస్తుంది.ఆమెను స్తుతించుటయే ఉపాయము అని తల్లిని సంకీర్తిస్తున్నారు.
నప్పిన్నాయ-నంగాయై,
విమలాయై,అమ్మా,నీవు
సెవ్వాయ్-శిరుమరుంగళ్-ఎర్రని పెదవులు-కరుణ వాక్యములు,
సన్నని నడుము కల సాముద్రిక శుభలక్షణములు కల,తిరువే-సౌందర్య/సౌశీల్యవతివి.
నీవు మేలుకొని,స్వామిని మేలుకొలిపి,
స్వామి నోమునకు మాకిస్తానన్న,
ఉక్కముం-తట్టొళియుం-విసనకర్ర-అద్దమును,
(వాటితో పాటు స్వామిని) మాకు,
ఇప్పోదు-ఇప్పుడే,
ఉన్-మణాలునై-నీ నాధునిచే,జగన్నాధునిచే,
స్వామిచే,
తందు-ఇప్పించవమ్మా.
గోపికలు అడిగిన -స్వామి అనుగ్రహిస్తానన్న విసనకర్ర-అద్దము పరమార్థమునందిస్తాయా అనుకుంటే
ఏమిటా విసనకర్ర?
విసనకర్ర .తాను నిశ్చలమైనదైనా చలనముతో అందరికి గాలిని,గాలితో పాటు హాయిని ఇస్తుంది.సుగంధమైన దుర్గంధమైన ఒకటిగానే స్వీకరిస్తుంది.మిత్రులని-శత్రువులని భేదములేకుండా చేయు సహాయతాభావ నిదర్శనమే ఆ విసనకర్ర.శేషత్వ తత్వము-పరతత్వము,తిరుమంత్రము-ద్వయమంత్రము అని కూడా ఈ భావమును గౌరవిస్తారు.
ఏమిటా అద్దము?
తమ తమ స్వస్వరూపమును చూపించకల శక్తి ఆ అద్దముది.
వాటిని స్వీకరించి,నిస్సంగులై ఆ నీలమేఘుని గుణవైభవమను తీర్థములో ఇప్పొదె ఎమ్మె నీరాట్టెలొ
,స్నానముచేసి,నోమునోచుకొనుటకు తహతహలాడుచున్న గోపికలతో పాటునున్న గోదమ్మ చేతిని పట్టుకుని ,మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
.
.
No comments:
Post a Comment