Saturday, January 2, 2021

ELO REMBAVAY-21

ఇరవైఒకటవ పాశురం
   ****************

  

ఇరవైఒకటవ పాశురం
   ****************

  


     ఇరవై ఒకటవ పాశురము
     *********************

   ఏట్రి కలంగళ్ ఎదిర్ప్పొంగి మీదళిప్ప
   మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుపశుక్కళ్

   ఆట్ర పడైత్తాల్ మగనే  అరివురాయ్
   ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్

  తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్
  మాట్రార్ ఉనక్కు వలితురైందు ఉన్ వాశల్ కణ్

  ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే
  పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్.

 

  ఓం నమో ఆశ్రితవత్సలాయ నమః
  ***************************
  
 గోపికలకు తలుపు తెరిచి,నీలాదేవి వారికి స్వామి ప్రస్తుత అవతార రహస్యములను ప్రస్తుతించుట తగిన ఉపాయముగా బోధించి,తానును వారిపక్షమై,స్వామిని మేల్కొలుపుచున్న భావనతో,గోదమ్మ


 ఈ పాశురములో స్వామి నడయాడు గోకుల వైభవమును నాలుగు ఉదాహరణలతో తెలియచేస్తున్నది.

 అవి,
1.గోవుల ఔదార్యము.  ఆ గోవులు ఎటువంటి స్వభావమును కలిగియున్నటువంటివి అంటే,

 మాట్రాదే-ఎంతో దయార్ద్రతను కలిగి
 వల్లాల్-ఔదార్యతను కలిగి,
 వాటి దూడలతో పాటుగా,


 స్వామి ఆరగింపునకు,ఆనందముతో,

ఏట్రా-పితుకుటకు పట్టుకుని యున్న,
కలంగళ్-కడవల,
మీదళిప్ప-మీదినుండి-పైనుండి,
ఎదిర్-పాలను,
పొంగి-పొంగిపోయి,పాల్ శోరియుం-పాలను వర్షిస్తున్నాయి.

 ఆ పాలు గోవుల పొదుగుల నుండి వస్తున్నాయా లేక కడవలు ఆనందముతో,స్వామిపై అర్చన భావముతో తమకు తామే పాలతో పొంగిపోతున్నాయా యన్నట్లు తమ ప్రాభవమును ప్రకటిస్తూ-ప్రకాశిస్తు ఉన్నాయట.


 అంతరార్థమునకు వెళితే వల్లాల్ పెరుం పశుక్కళ్-ఔదార్యముతో/అనుగ్రహముతో జానమును పంచుచున్న ఆచార్యులు

 కింద పట్టుకున్న కడవలు-విధేయతతో వినయముగా అర్థిస్తున్న శిష్యులు.

 పొంగిపొరలుతున్న పాలు వారికి లభించిన ఆచార్యానుగ్రహ జ్ఞానము.

 గోవులు పాలను వర్షిస్తున్నాయి అంటే ఆచార్యులు జ్ఞానమును అందించిన ఆనందముతో ఉన్నారు,

 కడవలు పాలను వర్షిస్తు,పొంగిపోతున్నాయంటే,అందిన జ్ఞానసంపన్నులై శిష్యులు ఆనందిస్తున్నారు.

 గురు-శిష్య సంబంధ ఉదాత్తను చాటుచున్నది వల్లాలై అను పదప్రయోగము.

   

 2 రెండవ ఉదాహరణ.ఉషోదయము.పాలతో నిండి పొంగిపోతు కడవలు ప్రకాశిస్తున్నాయి.అదేవిధముగా చీకటిని పారద్రోలిన వెలుగురేఖలు నిశ్చలముగా నిలబడి స్వామిసేవకై ఎదురుచూస్తున్నాయట.స్వామి,

 పెరియవ-ఆదిపురుషుడు.
  అవ్యాజ అనురాగముతో గోకులములో,
 ఉలగనిల్-ఈ లోకములలో,లీలగా,
 మగనే-నందగోపుని కుమరునిగా కీర్తింపబడుతున్నవాడు.

స్వామి నీ సంతతి యైన,

 మాకు దర్శనభాగ్యమును ప్రసాదించుటకు మేల్కాంచు తండ్రీ.

ఆట్రై పటైందాన్ -నీ అసంఖ్యాకమైన సంతతి నీ దర్శన భాగ్యమునకై ఎదురుచూస్తున్నారు.

  శుడరే-వెలుగు
  నిన్ర-నిలబడి/నిశ్చలమి
  తోట్రుమాయ్-ప్రకాశిస్తున్నై/నిన్ను ప్రస్తుతిస్తున్నది.

   జ్ఞానమయమైన గోకులమును ఆశీర్వదించుటకు మేలుకో స్వామి.

3.ఉట్రం ఉడయాయ్-అరివీర భయంకరుడా,

  మాట్రార్-నీ భక్తులను బాధించుటచే,నీకు శత్రువులుగా మారినవారు,నీ చే యుధ్ధములో ఓడి/గెలువలేక,సామంతులుగా తమను అనుగ్రహించమని,
 నీ ఉళితొళియ-నీ భుజపరాక్రమమును కీర్తిస్తు,
 ఉన్ వాశల్కణ్-నీ గడప దగ్గర వేచియున్నారు.వెలుగురేఖలు వారి పరిస్థితిని మాకు విశదపరుస్తున్నవి.

  అంతేకాదు,వారు శత్రువులుగా నిన్ను చేరినారు.నీ 
 ఉన్ అడిపణియుం-నీ పాదములదగ్గర చో టును కోరుకొనుచున్నారు.వారు జితబాణులు.


  వారే కాదు మేము కూడ,

4.ఉన్ అడి పణియుం.నీ పాదములవద్ద చోటును కోరుకొనుచున్నవారలము.కాని శత్రువులమై కాదు.
 మిత్రత్వ బంధము మిమ్ములను విడిచివెళ్ళుటకు ఇష్టపడుటలేదు.మేము జితగుణులము.నీ సగుణములచే జయించబడినవారలము..

  కనుక,కన్నా!
 స్వచ్చంద మనస్కులమై,
 నీవు క్షేమముగా ఉండాలని,లోకములకు క్షేమంకరుడవని  
 పుగిళిందు-నిన్ను కీర్తించుటకు,నీకు,
 పోట్రియుం పుగళిందు-మంగళహారతులనిచ్చుటకు,

 వందుం-వచ్చియున్నాము.వీడలేక నీ దర్శనమునకై ఎదురుచూచుచున్నామని అంటున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము ఎదురుచూద్దాము.

  ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.







  

 

   
 




  

 

   
 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...