తిరువెంబావాయ్-09
************మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై
పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె
ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో
ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో
అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు
శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం
ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్
ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్
భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి
**************************
తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో భగవంతునికి-భాగవతునికి సారూప్యతను వివరిస్తున్నారు కనుకనే పడుచులు నీవు సనాతనమునకే సనాతనుడవు"మున్నై పరం పొరుక్కు" అంతేకాదు ఈ మాయా జగతిలో దానికి అనుగుణముగా ప్రకటింపబడుతు అనుగ్రహించువాడవు.మేము నీ బానిసలము.
నీ అనుగ్రహము మాకు నీకు నీ భక్తులకు మధ్య అభేదమును అర్థముచేసుకొనునట్లు చేస్తే,మేము సంతోషముతో నీ భక్తులపాదములను వినయముతో నమస్కరిస్తాము.వారితో సఖ్యముగా ఉంటాము.వారి ఆజ్ఞను శిరసావహిస్తాము.మాకు ఐహిక భ్రాంతిని తొలగించి నీ సేవాభాగ్యమును అనుగ్రహించుము అను అర్థించుచున్నారు.
అంబే శివ దివ్య తిరువడిళే శరణం.
No comments:
Post a Comment