తిరువెంబావాయ్-10
*****************పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్
పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే
పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్
వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం
ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్
కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్
ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్
ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.
విశ్వరూపాయ పోట్రి
***************
ఈ పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామి సర్వతర్యామితత్త్వమును నిర్గుణ్ నిరాకార నిరంజనత్వమును ప్రస్తుతిస్తూనే మనలను అనుగ్రహించుటకు మనకై సుందరేశునిగా మన దగ్గరకు వచ్చినాడు.
ఏదవన్ ఊర్?
సర్వాంతర్యామి నీది ఏవూరు అని అడుగలేము
ఏదవన్ పేర్?
నీ పేరిమిటి? అని కూడ అడుగలేము.
ఎందుకంటే స్వామి ఒక్కక్క క్షేత్రములో ఒక్కొక్క పేరుతో వారణాసిలో విశ్వేశ్వరునిగా,శ్రీశైలములో మల్లికార్జునిగా,చిదంబరములో నటరాజుగా కీర్తింపబడుచున్నాడు.మనలను అనుగ్రహించుటకు నానా నామములతో,నానా రూపములతో నానా ప్రదేశములలో మనకు అనుకూలముగా సేవించి అనుభవించుటకు ఆవిర్భవించుచున్నాడు.
పోనీ ఊరును తెలుసుకొందామంటే స్వామి పాదపద్మములు పాతాళములు కంటే కిందకు కిందకు చొచ్చుకొని ప్రకాశిస్తున్నాయి.ముఖారవిందము హరకేశునిగా విస్తరించి పైకి పైకి పాకుతూ ఆకాసమును ఆక్రమించి అధిగమించి సకల రహస్యములను తన జటలలో బంధించుకొని అవసరమైనప్పుడు మాత్రమే కొంచము కొంచము ప్రకటిస్తు, మనలను కరుణించు శివనోమునకు కదిలి వెళదాము.
అంబే శివ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment