తిరువెంబావాయ్-18
******************
అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు
విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్
కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్
తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల
పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్
విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి
కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి
పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్
సర్వాత్మా-సర్వరూపా పోట్రి
*************************
ఏ రూపమునకు నిర్దిష్టము కాని స్వామి(అరూపి) మనకోసము స్త్రీమూర్తిగా/పురుషోత్తమునిగా,పంచభూతములుగా లీలగా ప్రకటింపబడుతు ప్రకాశించుచున్నాడు.స్వామి పాదపద్మముల ప్రకాశము ముందు నమస్కరించుటకు వంగిన దేవతల శిరోభూషణములనందున్న మణులు వెలవెలబోతున్నాయి.అతి ప్రకాసవంతమైన సూర్యకిరనములు సైతము చిన్నబోతున్నవి.మన నయనములనే తుమ్మెదలు విడువలేని మధురమకరందమును కలిగినవి స్వామి పాదపద్మములు.వాతిని సేవించి-తరించుదాము.
ప్రధమ పాశురములో ఆదియును-అంతమును లేని స్వామి బహురూపములతో బహుముఖములుగా ఈ పాశురములో భాసించుచున్నాడు.రండి దర్శించి-ధన్యులమగుదాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment