తిరువెంబావాయ్-17
**************
శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్
ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్
కంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి
ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి
శంగమల పొట్పాదం తందరళుం సేవగనై
అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై
నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్
పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.
అరుణగిరిస్వామియే పోట్రి
**********************
ఓ అరాళ కుంతలా! ఓ సుగంధకేశిని! ఆ ఘతనాఘతనా సమర్థుడు,తన కరుణామృత దృక్కులతో,మధుర మకరంద మమతతో మనము సేవించుటకు తనకు తానే మన నివాసములకు వేంచేసి అనుగ్రహించుచున్నాడు.అ స్వామి మూలమును గుర్తించగలగమను బ్రహ్మ-విష్ణులు తమ అహంకారమునకు అవపోసన పట్టినారుకద.దేవతలు సైతము తమకు తామె పాదములను పట్టుకొందమనుకుని విఫలులైనారు.స్వామి కరుణయే పాదపుందరీకములను పట్టి పూజించుటకు అనుగ్రహించుచున్న సమయమున సాక్షాత్కార సంతోష సరస్సులో స్నామాడి-సంకీర్తనమును చేస్తూ,సంతుష్టులమగుదాము.
అంబే శివే తిరువడిగలే శరణం.
No comments:
Post a Comment