తిరువెంబావాయ్-16
**************
మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్
ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్
మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్
పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం
ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్
తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు
మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే
ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.
శ్యామలా తాయియే పోట్రి
**********************
తిరు మాణిక్యవాచగర్ స్వామి కరుణామృత వర్షమును ఆదర్శముగా తీసుకుని వర్షిమని వానను సంబోధిస్తున్నాడు. ఆ వానకు తల్లి కరుణ సంకేతముగా దాని ప్రతికదలిక తల్లి ఆభరనములను అనుగ్రహము,అవయవ అనుగ్రహముగా కీర్తించుచున్నాడు.
అమ్మ కరుణ వర్షమునకు ఋతువులతో సంబంధములేదు.కనుక సమయమునకు ముందరే అమ్మ కరుణ అనే మేఘము ( మన కష్టములనే) సముద్రజలమట్టమును తగ్గించివేసినది.ఆవిరిగా మారి ఆకాసములో నీలిమేఘముగా కొత్తరూపును సంతరించుకున్నది తల్లి రూపసారూప్యముతో ధన్యమైనది.తల్లి శూన్యమధ్య/సూక్ష్మ మధ్య.సన్నని నడుము కలది.తల్లి నడుమునకు ప్రతీకగా ఆ నీలిమేఘము మెరుపుతీగెలతో ప్రకాశించుచున్నది.అందెల రవళి వలె అతిశయముతో ఉరుముచున్నది.అమ్మ రూపలావణ్యములను ఆరాధనతో అలదుకొన్న మేఘమా! అమ్మ కరుణరసావృష్టిని పోలిన వర్షమును వర్షించుము అని మార్గళి స్నానమునకు మేఘమును వర్షించమని శివనోమును నోచుకుందమని ప్రార్థించుచున్నారు.
అంబే శివ తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment