తిరువెంబావాయ్-15
***************
ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్
శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర
నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్
పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్
పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు
ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం విత్తకర్తాళ్
వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి
ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్
పార్వతీపతయే పోట్రి
************************
చెలులారా!రండి.
వచ్చి,
పూన్ పునల్ పాంగే-జ్ఞాన పుష్పములతో నున్న ముక్తి మడుగులో మునిగి,
వాయారాం-నోరారా,
ఆనాపాడి-ఆనందసంకీర్తనము చేస్తూ.
ఆడేలో-క్రీడిద్దాము.
ఏమని పాడుదామంటే,
పేరరయన్-పెద్ద దేవుడు-మహాదేవుడు.
ఆ స్వామిని గురించి తపము చేయుచున్న తల్లి,
ఓరురుకాల్-కొంచము బహిర్ముఖమగుతు,
మెల్లగ పలవరిస్తుంది.ఏమని అంటే,
ఎం పెరుమాన్-(మనందరి) స్వామి ,
నం పెరుమాన్-మన స్వామి-సర్వ జగద్రక్షకుడు.
అని ఎన్రెన్రె-పలవరిస్తుంది.
తల్లి పలవరిస్తున్న సమయమున తల్లి
శిత్తం కళికూర-చిత్తము/మనసు ఏకాగ్రతతో నిండిన స్వామి చింతనతో నిండియుంటుంది.
స్మరణము-మననం-చింతనము స్వామి మయము.
ఆ స్థితిలో ఎడందరై-హృదయములోని అర్ద్రత అశ్రువులుగా కన్నులు నిండి స్వామికి అభిషేకము చేస్తుంటాయి.
తల్లి తపోవిముఖురాలిగా చేయుటకు విణ్ణోర్-దేవతా సమూహములు,
తాం వందన-తామే వచ్చి,
తాం పడియాన్-ప్రయత్నించినను,
పిత్తోర్వార్-పిచ్చిదానివలె లెక్కచేయలేదు.
తల్లి అమితమైన స్వామిధ్యాసలో మునిగి ఉన్నది కనుక దేవతల ప్రయత్నము తల్లి తపమునకు భంగము కలిగించలేకపోయినవి.ఆ అదిదంపతుల అనుగ్రహమనే మడుగులో మునిగి కేరింతలు కొడుతు పునీతులమగుదాము.
అంబే శివ తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment