Wednesday, March 3, 2021

TIRUVEMBAVAY-16

 తిరువెంబావాయ్-16

 **************

 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్
 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్

 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్
 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం

 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్
 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు

 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే
 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.

 శ్యామలా తాయియే పోట్రి
 ****************

  చెలి ఆకాశము వైపు చూడు.నీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగినది ఒక బాలిక తన చెలిని.చెలి నల్లని మేఘమునా నన్ను చూదమటున్నావు అని తిరిగి ప్రశ్నించినది.

 చెలి అది సామాన్యమైన నల్లని మేఘము కాదు.ఎందుకంటే సామాన్య మేఘము,
 మున్ని-ముందర,
 కడలై-సముద్రములోనికి ప్రవేశించి,నీటిని పూర్తిగా తాగి,దానిని ఆవిరిగా,
 చురుక్కి-సంక్షిప్త పరచి,దాని పరిణామమును తగ్గించి,ఒక చిన్న నల్లని మేఘముగా ఆకాశములో ఉంటుంది.కాని నా స్పురణకు ఇది,
 ఎన్నతిగళందు-నా భావనకు
 ఉడయార్-సాక్షాత్తు జగద్రక్షకి యైన మీనాక్షి అమ్మ.చూడు 
  అదిగో చూడు-మిన్నిపొళంది-మెరుపు తీగలు ఎలా ప్రకాశిస్తున్నయో కాని అవి సామాన్యమైన మెరుపులు అవి సాక్షాత్తు,

 ఎన్ పిరాట్టి తిరువడి-మీనాక్షి తాయి పాదపద్మములు.
  అంతేకాదు-ఆకాసమునుండి వచ్చుచున్న శబ్దములు ఉరుములు కావు.అవి
 పొన్నం శిలంబిర్ శిలంబి-తల్లి ధరించిన శుభ పాదమంజీరముల మంగల స్వరములు.సామాన్య మువ్వల సవ్వడి కాదు సుమీ

  చెలి ఆకాశము వైపు చూడు.నీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగినది ఒక బాలిక తన చెలిని.చెలి నల్లని మేఘమునా నన్ను చూదమటున్నావు అని తిరిగి ప్రశ్నించినది.

 చెలి అది సామాన్యమైన నల్లని మేఘము కాదు.ఎందుకంటే సామాన్య మేఘము,
 మున్ని-ముందర,
 కడలై-సముద్రములోనికి ప్రవేశించి,నీటిని పూర్తిగా తాగి,దానిని ఆవిరిగా,
 చురుక్కి-సంక్షిప్త పరచి,దాని పరిణామమును తగ్గించి,ఒక చిన్న నల్లని మేఘముగా ఆకాశములో ఉంటుంది.కాని నా స్పురణకు ఇది,
 ఎన్నతిగళందు-నా భావనకు
 ఉడయార్-సాక్షాత్తు జగద్రక్షకి యైన మీనాక్షి అమ్మ.చూడు 
  అదిగో చూడు-మిన్నిపొళంది-మెరుపు తీగలు ఎలా ప్రకాశిస్తున్నయో కాని అవి సామాన్యమైన మెరుపులు అవి సాక్షాత్తు,

 ఎన్ పిరాట్టి  తిరువడిమేర్-సన్నని నడుము కాంతులు.-మీనాక్షి తాయిదివ్య మంగళ విగ్రహము. 
  అంతేకాదు-ఆకాసమునుండి వచ్చుచున్న శబ్దములు ఉరుములు కావు.అవి
 పొన్నం శిలంబిర్ శిలంబి-తల్లి ధరించిన శుభ పాదమంజీరముల మంగల స్వరములు.సామాన్య మువ్వల సవ్వడి కాదు సుమీ.

మరితును -ఆ వానవిల్-ఆ ఇంద్రదనుసు,
 తల్లియొక్క,
తిరు-శుభకరమైన,
పురువం-కనుబొమలు.

 తల్లి సౌందర్య లక్షణములను మాత్రమే కాదు సౌభాగ్య లక్షణమైన కరుణను ,
ఇన్ అరుళే-అవ్యాజమైన ఆశీర్వచనమును,
 అనుగ్రహమును వర్షించి,
 ఈ మడుగును మంగళప్రదమొనరించి మా మార్గళి స్నానమును శివనోమును మహదానందమొనరించుము.

 అంబే మీనాక్షి తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...