తిరువెంబావాయ్-007 ******************
అన్నే ఇవయున్ శిలవో పల అమరర్
ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్
శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్
తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్
ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం
శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో
వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్
ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్
శివమహదేవనే పోట్రి
*****************
అన్నే-ఓ సఖి,చూడు-విను,
అమరర్-దేవతలు,
అరియన్-దివ్య పురుషులు
స్వామినికీర్తిస్తున్నారు.
కాని,నీవు,వానిని వినకుండా,కఠినహృదయముతో శిలవలె నిదురించుచున్నావు.
ఆ స్వామి మాకు,
ఎన్నానై-స్నేహితుడు,
ఎన్నరయన్-మాకు ప్రభువు,
అంతేకాదు,
మధురాతిమధుర మరందము.
నీవును,
ఇన్న ముదల్-మునుపటి విషయములను విడిచివేసి,
వాయ్ తిరప్పాయ్-నోరును తెరిచి
సిన్నంగ-మెల్లమెల్లగ
శివనే-శివనే ఎన్రు-శివ శివ అని శివనామమును పలుకు/ఉచ్చరించు,
ఆ నామము ఎంత మహ్మాన్వితమైనదంటే,
పన్నజం పేదయిర్ పోల్-నీ శరీరము లక్కవలె మారి,
శివనామమనే అగ్నికి-మార్దవమును పొందుతు-అర్ద్రతతో కరుగుతుంది.
ఐశ్వర్య ప్రదత్వమును దేవతలు సైతము గుర్తించలేని స్వామి సేవకు రావమ్మా.
అంబే శివే తిరువడిగళే శరణం.
అంబే శివ తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment