Sunday, March 7, 2021

04

 



 



తిరువెంబావాయ్-04


 *****************




 ఒణ్ణిత్తల నగయాం ఇన్నం పులదిండ్రో


 వణ్ణక్కిళి  మొళియార్ ఎల్లోరం వందారో




 ఎన్నికోం ఉళ్ళవా సొల్లుకో అవ్వళున్


 కణ్నై తుయిన్ రవమేకాలత్తై పోక్కాదే




 విణ్ణుక్ ఒరు మరుందై వేదవిదు పొరుళై


 కణ్ణుక్ కినియానై పాడి కసిం ఉళ్ళం



 


 ఉళ్ళెక్రు నిన్రుగ యామాట్టోం నీయే వందు


 ఎన్ని కురైయిల్ తుయిలేలో రెంబావాయ్





   ఓం వేదవేద్యాయ పోట్రి


   ********************




 వేదవేద్యాయ పోట్రి


 ***************




  ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు అంతర్ముఖమును వీడుటకు ఇష్టపడని పడుచు గురించి మనకు సంభాషణలను వివరిస్తు స్వామిని కీర్తిస్తున్నారు.


 ఈమె మందస్మిత వదన.ఈమె

 ఒళి-ప్రకాశవంతమైన,

 నిత్తిల-ముత్యముల వంటి

 నగయ-పలువరుస కలిగినది.మందహాసిని.

 ఒణ్ణిత్తల నగయ-శుధ్ధ సత్వ శోభిని,

 నీవు ఇంకా మేల్కొనలేదా?

 పులందిండ్రో-తెల్లవారలేదా నీకు?

 మేల్కాంచకున్నావు అనగానే వారితో ఆమె కన్నులు మూసుకినియే ఈ విధముగా సంబోధించి అడిగినది ఏమని? అంటే,


 వణ్ణక్కిళి మొళియో మధురభాషణ చాతుర్యము కల చెలియలారా

 

ఎల్లారు  వందారో-అందరు వచ్చినారా?


 ఒకవేల మీరందరు కనుక వచ్చినట్లయితే,


 మీరు ఉళ్ళవుం-మీరు మనసులో,

 ఎణ్ణిక్కుం-లెక్కించుకొని నాకు

సొల్లుకో-చెప్పండి.

 అవ్వలిన్-అప్పటివరకు

 అవమే-నేను

 కణ్ణై తుయిల్-కన్నులు మూసుకొని యుంటాను/అంతర్ముఖినై ఉంటాను. 

 

కాలత్తిన్ పోక్కాదే-అప్పుడు నన్ను లేపండి అనగానే వారు 

 ఆమెను బహిర్ముఖిని చేయుటకు,


 నీవు నిద్రించుట తగదు మనము

 విణ్ణుక్ ఒరు-మహాదేవుని/ఏకాత్మకుని/పరమాత్మను

 కణ్ణుక్కు ఇనియానై-నయన మనోహరుని,మనో రంజనుని,

 కన్నుల పండుగగా దర్శించి,

 కసిం ఉళ్ళం-ఆర్ద్రత నిండిన హృదయముతో,

 వేదవిదు పురుళై-వేద స్వరూపునిగా/వేదసారముగా/దివ్య మనగళ విగ్రహునిగా,

 పాడి-సంకీర్తిస్తు నోమును నోచుకుందాము.


 మా లెక్కలపై నీకు నమ్మకము లేకుంటే,

 మమ్ములను లెక్కించుటకు

 మాతో కలిసి స్వామిని సంకీర్తించుటకు,

 నీయే వందు-నీవే నిద్రను వీడి/బహిర్ముఖివై రావమ్మా.


 నిష్ఠూరములు సైతము ఆమెను బహిర్ముఖము చేయలేక పోతున్నవి.

 అప్పుడు వారు

 నీ లెక్కలు ఏవో మాకు తెలియుటలేదు.వచ్చి మమ్ములను లెక్కించి,లెక్క తగ్గినచో మేము నిన్ని మేల్కొనమని ఇబ్బంది పెట్టము అని,ఇది

 ఎన్ని కురైల్-ఎంత వింత నిదుర సరే నీవు దానిని వీడి బయటకు రాలేక యున్నావు కనుక నీ నిదురనే శివనోముగా భావించి,

 తుయిలేలో-నిదుర యనే ధ్యానములో(సమాధిస్థితి) మునిగిపో అని అంటున్నారు.


   తిరు అన్నామలయై అరుళ ఇది

   అంబే శివే తిరువడిగళే పోట్రి

   నండ్రి.వణక్కం.








 






    


 


 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...