తిరువెంబాయ్-003
***************ముత్తన వెణ్ణకయ్యుం మున్వన్ దెదిర్ ఎళుందిన్
అత్తనానందన్ అముదన్ నెన్ నెళ్ళూరి
తిత్తక్కన్ వేశువాయ్ వందు కడై తిరవాయ్
వత్తుడి ఈర్ ఈశన్ వళవడియర్ పాంగుడయీ
పుత్తడియోం ఉన్మైతీర్థు ఆట్కాండార్ పొల్లాదో
ఎత్తోనిన్ అంబుడైమై ఎల్లోం అరియోమోం
చిత్తం మళకియార్ పాడారో నం శివనే
ఇత్తనయుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.
అరుణగిరి నిలయే పోట్రి.
*************************
మూడవ పాశురములోని పడుచు బుధ్ధిశాలిని.సమయస్పూర్తిగా సరళముగా సాత్వికముగా మాట్లాడు స్వభావము కలది.కనుకనే తిరు మాణిక్య వాచగరు ఆమె సాత్విక సంభాషణాచాతుర్యమును ఆమె తెల్లని ముత్యముల పలువరుస ద్వారా సంకేతిస్తూ,పాశురమును ప్రారంభించారు.
ఓ చెలి,
వెణ్ నగయ-తెల్లని పలువరుసను కలిగినదాన/సాత్విక సంభాషణములను చేయుదానా,
ఆమె పలువరుస ఎంత తెల్లగా ఉన్నదంటే,
ముత్తన-ముత్యముల వలె స్వచ్చముగా ప్రకాశించుచున్న పలువరుస కలిగిన చెలి,
నీవు మా దగ్గరకు,
మున్-నిన్ననే,ముందుగానే వచ్చి,
ఎదురెడియ-పరిహాసముగా,
( అసలు స్వామిని గురించి మాకేమి తెలియనట్లు-అంతా నీకే తెలుసునన్నట్లు)
స్వామి నాకు
అత్తన్-ఆత్మ బంధువు
ఆనందన్-ఆనంద కారకుడు
అముదన్-నా జీవన అమృతము అంటు
తిత్తిక్కన్ పేశవాయ్-బడాయి మాటలను చెప్పావు.
అంతటితో ఆగక,
యార్-నాకు
ఈశన్ వళియడి-స్వామిపాదపద్మములతో
పాంగుడయా-బాగా పరిచయమున్నది.నాకు బాగా తెలుసు వాటి మహిమ గురించి,
అవి
పుదు అడియో-పుత్తడియో-నిత్యనూతనములు
నిరంతర వీక్షణప్రదములు
కనుక,వానిని,
పట్రు-ఉడి-పత్తుడి-పట్టుకొని సేవించుటకు,
ఆట్కొండార్ పొల్లాదో-నేను మిమ్ములనందరిని తీసుకొని వెళతాను అని చెప్పి అదియును.ఉన్మై-నిజముగా అని చెప్పి,
మేము నీదగ్గరికి వచ్చినను మేల్కాంచక ఇంకా నిదురించుచునే ఉన్నావు. వ్వంటనే,
వందు-వచ్చి,
కడై-తలుపుగడియ,
తిరవాయ్-తెరువవమ్మా.
అని వారు తనపై నేరారోపణను చేస్తున్నప్పటికిని,బుధ్ధిశాలిని కనుక,వాదనకు తావీయక,నేను ఊరికినే అన్నాను.కొత్తగా వ్రతమును చేయుచున్న దానిని కదా!నాన్ పుదుసు,మీరు ఎల్లోం అరియోమోం-
స్వామి మహిమలు ఎన్నో తెలిసినవారు.కనుక పెద్దమనసుతో నన్ను కూడ మీతో కలుపుకోండి.ఇంక
ఇత్తనయుం వాండ-ఆలస్యమును చేయకుండా,
వ్రత భాగముగా -
చిత్తం అళకియార్-మన మనసులు పులకించి-పలికించగా,
నం -అందరము-మనమందరము
శివనే-శివ పెరుమాళ్ ని
పాడారో- సంకీర్తనమును చేస్తు,సంతసిద్దాము.
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి.
No comments:
Post a Comment