తిరువెంబావాయ్-19
*****************
ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు
అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్
ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే
ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క
ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క
కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క
ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్
ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్
భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.
**************************
అయ్యర్-ఆర్యా/అయ్యా,
ఉంగ-నీయొక్క,
పిళ్ళై-పిల్లలము/బిడ్డలము.
మా జీవితమంతా/భారమంతా,
అడైక్కలం-నీ అధీనము.
స్వామి-నీవు మమ్ములను,
పాల ముంచినా/నీట ముంచినా,
రక్షించిబా/పట్టించుకోక పోయినా,
అది మాకు సమ్మతమే. కాని మాకు నువ్వే
అచ్చన్/అత్తన్,
తల్లి-తండ్రి-గురువు బంధువు అన్నీ నీవే.
ఉంటావని అప్పళం సొల్-ఆదరముగా చెప్పు.
స్వామి మా-అదృష్టముగా మాకు,
ఎన్ కొంగై-నీ ఆలింగనా సౌభాగ్యమును
ప్రసాదించు.
ఎందుకంటే ,అళ్ళారో తోళ్ సేయర్క-వేరొకరి భుజమును ఆశ్రయించలేదు.
అంతే కాదు,
కయ్యదు-మా చేతులు నిన్ను తప్ప వేరెవరిని సేవించరాదు.
స్వామి ఇంకొక విన్నపము.
ఎం కళ్-మా కన్నులు,
ఎప్పణియుం శేయర్క-నిన్ను దర్శించి,ధన్యతనొందుట తప్ప వేరేమి చేయరాదు.
ఎం కణ్-నిన్ను దర్శించుటలో లీనమై,
నిన్ను మాత్రమే-మట్రుం చూడాలి.
నా కన్నులు-మనసు,
ఇది పగలు-ఇది రాత్రి అని గుర్తించలేని,బాహ్యమును వీడిన అంతర్ముఖములో ఆర్ద్రతతో నుడాలి.
కంగళ్-పగల్ కాణార్క
రేయింబవలును మరిచి ఉండే,
ఎంగల్ -ఎప్పుడు,ఎక్కడనున్న,
ఇప్పరిశె-ఈ వరమును అనుగ్రహింపుము.అన్యమేది మేము నిన్ను అర్థించము.
స్వామి మా దేహేంద్రియములు భాగవతుల ను సేవించే భాగ్యమును పొందనీ.ఇతర చింతనలను దరిచేరనీయకు.స్వామి అంతే కాదు మా నయనము సదా నీ దర్శనముతో,కరములు సదా నీ సేవా సౌభాగ్యముతో,మనము సదా నీ తలపుతో,పలుకులు నీ మధురనామ సంకీర్తనముతో పరవశించే భాగ్యమును ప్రసాదించినచో మాకు అన్యముతో పనిలేదు.ఈ సార రహిత సంసార చక్రములో జనన-మరణములనే ఇరుసులపై తిరుగుతూ ఉండలేము.దానివలన ఏమి ఉపయోగము.కనుక ఉపేక్షించకుందా మమ్ములను అనుగ్రహింపుము .మా కోరిక సఫలమైనచో మాకు బాహ్యముతో ఎటువంటి(సూర్యోదయ-సూర్యాస్తమయములతో) సంబంధములేదు.
అంబే శివే తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment