తిరువెంబావాయ్-007 ******************
అన్నే ఇవయున్ శిలవో పల అమరర్
ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్
శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్
తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్
ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం
శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో
వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్
ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్
శివమహదేవనే పోట్రి
*****************
అన్నే- ఓ చిట్టితల్లి, ఏమిటిది?
ఇవయున్ శిలవో-కదలక-మెదలక శిలవలె నిదురించుచున్నావు,
తెల్లవారుచున్నదమా.మేల్కాంచు.
ఇరుం శీరాన్-మహా తేజోవంతుడు-దయామయుడు-సుందరేశుని సేవించుకుందాము.
స్వామి,
ఉన్నర్కు-నీకు-నాకు మాత్రమే కాదు,
పల అమరర్-చాలామంది దేవతలకు కూడ,
రక్షించు,
ఒరువన్-ఒకే ఒక్కడు/స్వామి తక్క రక్షణకు అన్యము లేదు.
చెలి అసలు నీ స్వభావము ఎంత కోమలము.
శిన్నంగళ్ శివన్-ఎవరైన శివభక్తులు కనబడిన వారిని సాక్షాత్తు శివునిగా భావించి,పూజించు భక్తి నీది.
అంతే కాదు,
తిన్నా యన్నా మున్నం-ఎవరైన మాట్లాడుతు తిన్నా యని మొదలుపెడుతుంటే,
మున్నం-వారికంటే ముందరే,
శివ/హర/సాంబ/సుందర/ అనే మాటలు వినబడతాయని పరవశించేదానివి కదా.
అంత దూరమున స్వామి సంకీర్తనము వినబడగానే,
ఎన్నాన-నా మహదేవుడు,
ఎన్న రయన్-నా మహారాజు,
ఎన్ అముదం-నా అమృతము/ నాజీవన సర్వస్యము అంటు ఆనందించేదానివి.
కాని-ఇప్పుడు,
ఎండ్రెన్నోం-ఎన్నెన్నో విధములుగా/పరిపరి విధములుగా
శొన్నంకేళ్-
స్వామిని కీర్తిస్తుంటే కూడ,
ఇన్నం-ఈ విధముగా,
తుయిలిడియో? నిదురపోవుచున్నావు ఎందుకు?
నివ్వేరాయ్-ఇది-నీ స్వభావమునకు సరియైనది కాదు.
చెలి,
వన్నంజ-చురుకుదనము లేని/బాహ్యమును పట్టించుకోలేని,
పేదయర్ పోల్-నీ శరీర ధర్మమును మందలించు,
నాలా కిడత్తియాల్-ఇలా ఎంతసేపు/ఇ విధముగా
ఎన్నే-నీవు
తుయిలిల్-నిదురిస్తావు?
అంతర్ముఖమునే ఇష్టపదతావు.
ఎం పావాయ్-మన శివనోమునకు,మేల్కాంచి,మాతో రావమ్మా.
తిరు అన్నామలయై అరుళ ఇది.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment