Thursday, March 11, 2021

TIRUVEMBAAVAAY-08


 తిరువెంబావాయ్-08

 ******************
 కోళి శిలంబ చిలంబుం కురుగెంగు
 ఎళిలియంబ ఇయంబు వెణ్ శంగం ఎంగుం

 కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై
 కేళిల్  విళుప్పొరుళ్గళ్ పాడినో కేట్టిలైయో

 వాళి  ఇదెన్న ఉరక్కుమో? వాయ్ తిరవాయ్!
 ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో

 ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై
 ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్.


ప్రళయ సాక్షియే పోట్రి
*****************
 తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో స్వామిని దేవతలకు-మానవులకు సర్వులకు రక్షకుడు తానొక్కడే అని కీర్తించినాడు.

 ఈ పాశురములో స్వామిని ప్రళయ సాక్షిగా ప్రస్తుతించుచున్నాడు.

 ఊళి-ప్రళయ సమయమున జలగర్భముకానిది ఒరువన్-ఒక్కరే,

 అది మన స్వామి.
 ఆ సమయమునందు స్వామి నిరాకార-నిర్గుణ -నిరంజన -నిస్తుల ప్రకాశము.

   అయినప్పటికిని మన కోరకు స్వామి,

 కేళిల్-అసమానమని/దేనితో పోల్చలేని,అధికము లేని,
 పరం జోది-బృహత్ జ్యోతి.దాని కన్నా అధికమైన ప్రకాశము లేదు.ఇది నిస్సందేహము.
 ప్రకాశము మాత్రమే కాదు.ప్రపన్నుల పట్ల శరణుకోరిన వారి యందు ప్రసన్నతయు కలిగినవాడు.
 ఆ ప్రసన్న తో పోల్చదగినదియును లేదు.కనుక,

 కేళి పరం కరుణై

 అట్టి స్వామి మనకొరకు ,
 విళుప్పొరళ్గళ్-పిపీలకు నుండి బ్రహ్మాండము వరకు ఎన్నెన్నో ఉపాధులను స్వీకరించి మనలను అనుగ్రహించుచున్నాడు.

 స్వామికి సుప్రభాత సేవా సమయముగా మనకు ఎన్నో సంకేతములు వినబడుచున్నవి.అవి ఒకటి కాదు-అనేకములు.

1 కోళి శిలంబ-కోడి తెల్లవారినదనుటకు సంకేతముగా కూయుచున్నది.
 యోగులు తమ కుండలినిని జాగృతము చేసుకొనుచున్నారు సహస్రారమును చేరుటకు.
 ఎంగుం-ఒక చోట కాదు.
   అంతటా చైతన్యము వ్యాపించుచున్నది.
 దానిని అనుసరిస్తూ,
ఎంగుం-అన్ని చోట్లా,
కురుగు-పక్షులు,
చిలంబుం-కూయుచున్నవి.
ఇక్కడ పక్షులను మనము జ్ఞానులుగా చెప్పుకుంటే భగవత్ సంకీర్తనమును ప్రారంభించారు.

 యోగులు-జ్ఞానులు స్వామికి సుప్రభాత సేవను అంతట ప్రారంభిస్తున్నారు.

 అంతే కాదు,
 కోవెల లోని రెండు శబ్ద విశేష శబ్దములు నీ కు వినపడుటలేదా?
ఓళి-మొదటిది-స్వామిని మేల్కొలుపుటకు మోగుచున్న నాదస్వరము-మనగళ వాయిద్యములు.
 మంగళములను కలిగించుటకు సాగుతున్న నాదమును అనుసరిస్తూ,
అమంగళములను తొలగించుటకు -
బిగ్గరగా శంఖనాదము వీరతను చాటుచున్నది.
 ఏళిల్ ఇయంబ-ఇయంబు,
 వెణ్ శణ్-తెల్లని శంఖము మోగుచున్నది.

వాళి-ఔరా! 
ఇదెన్నౌరక్కమో?-ఇదేని నిద్దురమ్మా
చాలా వింతగా నున్నది.ఎందుకంతే కోడి-పక్షుల కూటలు నిన్ను మేల్కొలుపలేక పోయినవి.కోవెల మంగళ వాయిద్యములు-శంఖ నాదములు నిన్ను బహిర్ముఖము చేయలేక పోయినవి.
స్వామిని మేము బిగ్గరగా కీర్తించినను నీలో కదలిక లేదు.

వాయ్ తిరవాయ్-పలుకవమ్మా-నేను వస్తున్నానని.అయినను నిదురించుచున్న పడుచు మేల్కాంచలేదు.వీరికి సమాధానమును చెప్పలేదు.
 అప్పుడు వారు,ఆళియిన్ అంబుదమే-

  భక్తి ప్రకటనము బహుముఖములని విన్నాము.
 కాని ఈ విధమైన నిదురయే నిశ్చల భక్తి యని ఇప్పుడే తెలియుచున్నది.


 నీకొక గొప్పవిషయమును చెబుదాము.అది వినియైన నీ అంతర్ముఖమును వీడి మాతో శివనోమునకు కదిలి రామ్మా.

 ప్రళయానంతరము స్వామి మన కొరకు 

 " ఏలై పంగలయే" పురుషరూపమును-స్త్రీ రూపమును మేళవించి మంకు అమ్మా-నాన్నల వలె అనుగ్రహించుటకు ,స్వామి తన ఎడమవైపు అమ్మతో మనము సేవించుటకు వేంచేసినాడు.
 పాదపద్మములను సేవించుకుందాము.

 తిరు అన్నామలయై అరుళయిది
 అంబే శివే తిరువడిగలే పోట్రి.
 నండ్రి.వణక్కం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...