తిరువెంబావాయ్-09
************
మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై
పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె
ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో
ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో
అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు
శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం
ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్
ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్
తిరువారూర్ పూకోవెల స్వామియే పోట్రి
********************************
మొదటి ఎనిమిది పాశురములలో చెలులు నిదురించుచున్నవారిని మేల్కొలుపుచు,వారిని శివసేవా సన్నధ్ధులను చేస్తున్నట్లుగా కీర్తించారు.కాని,
తొమ్మిదవ పాశురములలో చెలులు అందరు సామి సనాతనత్వమును-సహృదయతను చాటుచు,నిత్యనూతనుడైన స్వామి నిరంతర నిష్కలంక సేవా సౌభాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు.
మున్నై పరం పొరుక్కుం-
అన్నిటికన్నా/అందరికన్నా ముందరగా నున్నది దైవము.అది సనాతనము.మూలము.దానికి ఆది-అంతము-కాలపరిమితి లేదు.
మున్నై పరం పొరుళై-
బిందువు విస్తరించి వృత్తముగా మారునట్లు,మూలపదార్థము విస్తరిస్తూ,వ్యాపిస్తూ,ఎన్నో నూతన రూపములుగా ప్రకటింపబడుతున్నప్పటికిని అది సనాతనమే.
సంకోచ-వ్యాకోచములు దాని లీల.
కాని అది పిన్నై పుదుక్కుం-
దానికి ఒక ప్రత్యేకత ఉన్నది.అది ఏమిటంటే అది సనాతనమే అయినప్పటికిని మనము చూస్తున్నప్పుడు ప్రతిసారి కొత్తగానే కనిపిస్తుంది.మనలను ,
ఎప్పట్రియన్-అమితమైన భక్తిలో మునకలు వేయమంటుంది.
అదియే పదార్థమునకు-పరమాత్మకు గల వ్యత్యాసము.
పదార్థము సమయముతో పాతబడిపోతుంది.పరమాత్మ సమయమును అధిగమించి నిత్యనూతనముగా ఉంటాడు.
స్వామి రూప గుణాదులు మనలను-
ఉన్-అడియర్-ఆ దేవతలను
పెట్రవుం-తన్మయత్వముతో పరవశించునట్లు చేస్తాయి.ఏవి?
పెరుమాళ్ శీరడియో-
అడ్యో-పాద పద్మములు ఎటువంటివి?
శీర్-శుభప్రదమైనవి.
శుభప్రదమైన స్వామి పాదపద్మములు ఎన్నిసార్లు చూసినను/భావించినను/స్పృశించినను/మంగళప్రదములై మనలను ,
ఉన్నై పిరారాదె-స్వామికి బానిసలుగా/సేవకులుగా/దాసులుగా
అనుగ్రహిస్తాయి.
యమక్కు-మనకు/మాకు,
ఇంకోణ్-ఇంకేమి వద్దు
ఆ ఒక్కటి తప్ప-ఏమిటా ఆ ఒక్కటి?
అణ్ అవర్-ప్రతిక్షణము నీయొక్క సేవా సౌభాగ్యము మాకు కావాలి.
ఆవార్-అవర్-జన్మజన్మలకు మేము నిన్ను వీడిపోరాదు.
నీ సేవాసక్తత సన్నగిల్లరాదు.
శోన్న పరిసె-దానిని వరముగా మనము స్వామిని అడుగుదాము.
ఎన్నకురయుం-ఈ వింతనిద్రను మాని వ్రతమునకు పోదాము చెలి.
దేవాశ్రయ మండపమును దర్శించుకొనిన తరువాత స్వామి దర్శనమునకు తరలుదాము రావమ్మా.
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment