తిరువెంబావాయ్-14
*************
కాదార్ కుడైయాడ పైపూంకలానాడ
కోదై కురళాడ వండిన్ కుళామాడ
సీద పునలాడి చిట్రం బలం పాడి
వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి
శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి
ఆది తిరంపాడి అందం ఆమా పాడి
పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్
పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్
అరువం-ఉరువం-అరు ఉరువం పోట్రి
*****************************
తిరుమాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో,
అరువం-అవ్యక్తము
ఉరువం-వ్యక్తము
అరు ఉరువం-వ్యక్తావ్యక్తము అను మూడు లీలా విశేషములను,సంకీర్తన సేవా మార్గము ద్వారా వివరిస్తున్నారు.
కనుకనే ఈ పాశురములో పరమభాగ్యవంతులైన కన్యలు స్వామిని నాలుగు విధములుగా సంకీర్తించి,దర్శింప చేసినారు. అవియే,
మొదటిది-అవ్యక్తము.
వేద పొరుళ్ పాడి-స్వామి శబ్ద స్వరూపముగా ప్రకటితమైనాడు.
రెండవది ఆ రూప వ్యాపకత్వము.
వేదము-సత్యము కనుక ఆ వేదస్వరూపము తానంతట తానై సమస్తమును విస్తరించి-వ్యాపించినది.
అప్పొరుళ్ ఆమాం పాడి.
మూడవది-శోది తిరం పాడి.
అరూపము మన మీది అనుగ్రహముతో,
అగ్నిస్తంభ జ్యోతిగా ప్రకటింప బడినది. ఇది వ్యక్తము.కాని మానవ నేత్రములకు పూర్తిగా అర్థము కానిది.కనుక వ్యక్తావ్యక్తము.మహాశివ లింగ రూపము కూడా వ్యక్తమే కాని కొంత అవగాహన మనకు అవసరము.
ఇంకను దయతో స్వామి మనకు అర్థమయ్యేలాగ సుందరరూపముతో-సులభ భక్త పరాధీనతతో వ్యక్తమై మనలకు సాక్షాత్కారమును ప్రసాదించుచున్నాడు.
వ్యక్తము-అవ్యక్తము-వ్యక్తావ్యక్తము అను మూడును పరమాత్మ క్రీడలే కదా చెలి అని వారు పాడుచున్నారు.
ఇప్పటి వరకు చెలులందరు తమకు తోచిన విధముగా తాము దర్శించి-అనుభవించిన స్వామి అనుగ్రహమును బహుముఖములుగా బహిరంగపరిచారు.ఇప్పుడు వారి భావములన్నీ ఏకీకృతమైనవి.అనుగ్రహము అద్భుతమై అమృతత్త్వమును వారికి-మనకు అందించుచున్నది.
కనుకనే వారు ఆది తిరం పాడి-అందం ఆమా పాడి అంటున్నారు.ఆదియును-అంతమును రెండును తానైన స్వామిని,వారు సంకీర్తిస్తున్నప్పుడు వారి,
కాదార్ కుడైయాడ-పైపూంకలాడ-కోదై కుళలాడ-వండిన కుళామాడ అని అంటున్నారు మాణిక్యవాచగరు.కర్ణములు శ్రవణమునకు ఆభరణములైనవి.కేశములు మంత్రమయములైనవి.అనన్య శేషషులై.అనన్య శరణులై వారు,
పేయ్దిత్తు నమ్మాఇ-వారి శరీరములను సార్థకపరచుకొనుచు,స్వామి యొక్క శివశక్తుల స్వరూపమును అవిభాజ్యముగా-అనుగ్రహ పదముగా గుర్తించి,సేవించుచున్నారు.
పేయ్ వలదైన్ -
ఇక్కడ మనకు మహానుభావుడు భ్రంగి వృత్తాంతము గుర్తుకు వస్తుంది.మీకు తెలియనిది కాదు.నా అనందమును పంచుకొనుటకు మరొక్కసారి.
పరమ శివభక్తుడైన భృంగి అమ్మవారికి నమస్కరించేవాడు కాదట.శివుడొక్కడే తన దైవముగా భావించి పూజించేవాడట.తల్లి వానినిపరీక్షించదలచి,అవిభాజ్యమైన అర్థనారీశ్వ రూపములో దర్శనమిచ్చిందట.
అప్పుడు భృంగి తానొక తుమ్మెదగా మారి వారిమధ్యనున్న చిన్న ప్రదేశములో తాను దూరుతు కేవలము శివస్వరూపమునకు మాత్రమే ప్రదక్షిణలను చేసాడట.తల్లి ఆగ్రహించి వానిని శక్తిహీనునిగా శాపమిచ్చి,తిరిగి వానికి మూడవ కాలిని ప్రసాదించి కనువిప్పు కలిగించారట.ఇదంతా మనకు కనువిప్పు కలిగించుటకు ఆదిదంపతుల ఆట.దానికి పావుగా మారిన భృంగి ఎంతటి పుణ్యమును చేసుకొన్నాడో కద.
తిరు అన్నామలయై అరుళ ఇది.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment