తిరువెంబావాయ్-15
***************
ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్
శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర
నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్
పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్
పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు
ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం విత్తకర్తాళ్
వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి
ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్
ఎం పెరుమాన్-నం పెరుమాన్ పోట్రి
*******************************
నామస్మరణం ధన్యోపాయం-నహి నహి దుఃఖం ....... ఈ పాశురములో తిరు మాణిక్యవాచగరు శివనోమును చేసూంటున్న పడుచులకు లభ్యమైన అంతర్ముఖ అనుగ్రహమును మనకు వివరిస్తున్నారు.
వారికి అంతా ఆధ్యాత్మిక ఆనందమయమే.ఆ ఆదిదేవుని ఆశీర్వాదానుభవమే.అన్యము తృణప్రాయమైనది.
వారి అనుభవసారమును నేనేమని వర్ణించగలను.? అంతటి భాగ్యశీలురు వారు. కనుకనే ,
అంతర్ముఖులైనవారు అప్పుడప్పుడు మంద్రముగా, మెల్లగా,
శీరొరుకాల్-శుభప్రదమైన
ఎం పెరుమాన్-మహాదేవుడు,
నం పెరుమాన్-మన సంరక్షకుడు అని పలవరిస్తున్నారు.పూర్తిగా బహిర్ముఖులగుటకు ఇష్టపడుటలేదు.
అదియును/ఆ పలవరింతయును
శిత్తం కళికూర-చిత్త శిధ్ధితో/మనస్పూర్తిగా
వాయ్ ఓవాన్-విసుగు చెందని వాక్కుతో,
నిర్విరామముగా/నిశ్చలముగా నిటలాక్షమయమైనది వారి అంతరంగము.
నింపుతున్నది ఆర్ద్రతను నిర్విరామముగా.
నిస్తుల అనుగ్రహము కన్నులనుండా నిండి-ఆనందాశ్రువులుగా ,
కణ్పణప్పన్-కన్నులనుండి,
ఓవాన్ ఎడుందారై-నిరంతరాయముగా వర్షిస్తూనే ఉన్నాయి.
వారి మనస్సు-వాక్కు-బాహ్యము-అంతరంగము సమస్తము సర్వేశ్వరాధీనమై సన్నుతిస్తున్నవి.
ఎంతటి ధన్యులో ఆ సుందరీమణులు -సుందరేశానుగ్రహ పాత్రులైనారు.
ఆ సమయము అతిపవిత్రము.కనుకనే వారికి అన్యము-అన్యదేవతలు
విణ్ణోరై తాపణియాళ్,
స్పురించుటలేదు.అంతా శివమయమే.శుభప్రదమే.
ఆ ఆనందానుభవములో వారు తమ పాదములను భూమిమీద పెట్తలేక పోతున్నారు.
పారొరుకాల్ వంద-బహిర్ముఖులు కమ్మంటే,
వారిని అనిర్వచనీయానందము నుండి మరళి,తమ కాలును భూమిమీద పెట్టమంటే/ఐహికములను ఆలోచించమంటే వారిమనసు,
నయాళ్-వినుటలేదు.
మందార మకరందమును ఆస్వాదించువారు మరలగలరా మరి ఇతరములకు?
వారికి సాక్షాతు స్వామిగా జ్ఞానమనే పువ్వులతో ప్రకాశిస్తున్న ,
ఏరురవం పూంపునల్ లో పాయింద్-మునిగి,
ఆడేలోరెంబావాయ్-ఆనందానుభూతిలో మునిగితేలుతున్నారు.
తిరు అన్నామలయై అరుళ ఇది
అంబే శివే తిరువడిగళే పోట్రి.
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment