తిరువెంబావాయ్-22
***************
అరుణన్ ఇందిర దిశై అణుగీనన్ ఇరుళ్ పో
అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్
కరుణను శూరియ యళయళ నయన
కడిమలర్ మలరమర తణ్ణనల్ కణ్ణా
తిరనిరై అరుపదం మురల్వన్ ఇవైయో
తిరుపెరున్ తిరైయురై శివపెరుమానే
అరుళిరి తరువరం ఆనందమలయే
అలైకడలే పళ్ళి ఎళుందరుళాయె.
పూసలర్ పూజిత తిరువడిగళే పోట్రి.
************************
తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో పద్మములు ఏ విధముగా స్వామి అనుగ్రహకాంతిని స్వీకరించి సంతోషముతో పరవశిస్తు-వికసిస్తూ-ప్రకాశిస్తున్నాయో సంకీర్తించారు.
ఈ పాశురములో స్వామి తన ముఖకాంతిని సూర్య కిరణములకు ప్రసాదించించి,జగములను చేతనవంతము చేస్తున్నాడో ప్రస్తుతిస్తున్నారు.
శివపెరుమానే-మహాదేవా!
ఇరుళ్-చీకట్లు నిష్క్రమించినవి.
ఎందువలన?
అరుణన్-నీ అనుగ్రహమనే ఎర్రని సూర్యుడు,
చేరుకున్నాడు-ఎక్కడికి?
ఇందిరన్ దిసై-తూరుపు దిక్కునకు.
తత్ఫలితముగా మా హృదయపద్మములు వికసిస్తూ,తమోగుణమనే చీకట్లను తరిమివేస్తున్నాయి.
ఆ అరుణోదయ భానురేఖల భాగ్యమును నేనేమనగలను?అవి ఎంత ధన్యతను పొందినవో-సాక్షాత్తు నీ ముఖ కాంతులను తమతో కూడ తెచ్చుకొని.
ఇప్పుడేకొంచము కొంచము విచ్చుచున్న మొగ్గలు నీతెరిచి-తెరియను,అప్పుడే కొంచము కొంచము విప్పారుచున్న నేత్ర సౌభాగ్యమును పోలి యున్నవి.
నీ నేత్ర దర్శనావిష్కారము మాకు రెండు విధములుగా ఆనందమును ప్రసాదించుచున్నది స్వామి.
మొదటిది-నీ దయాంతరంగమును మా దరిచేర్చుచు ,
అరుళాలై కడలే-ఆశీర్వచనమును తన ఘోషల ద్వారా అందించుటకు ఉవ్విళ్ళూరుచున్నది.
రెండవది మా మనోమందిరములో స్వామి సుఖాసీనుడై,పూసలర్ నాయనారు అనుగ్రహించినట్లు,మమ్ములను ఆశీర్వదించునని ఆనందఘోషను చేయుచున్నది మా మనసనే సముద్రము అలలతో ఎగిసిపడుతు-ఎద నిండ నిన్ను నింపుకుంటు.
మమ్ములను చైతన్యవంతులను చేయుటకు మేలుకొని,మమ్మేలుకోవయ్యా.నీశరణార్థులము.
తిరు పెరుంతురై అరుళ ఇది.
ఆత్మనాధ తిరువడిగళియే పోట్రి.
నండ్రి.వణక్కం.
No comments:
Post a Comment