ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-08
****************************
ఏదో అద్భుతశక్తి ఆలోచనా పరంపరలుగా నన్ను ఆశీర్వదిస్తున్నది.
ప్రతి నిమిషము-ప్రతి విషయము ప్రతిభావంతములుగా గోచరిస్తున్నాయి.
ప్రతి అవనిక (తెర) తన కదలికలతో నా సందేహములతో పాటు నన్నూ ముందుకు నడిపిస్తున్నది. సహకముగానే సామాన్యము విశేషముచే కప్పబడితుందా?
లేక తప్పనిసరియై విస్తరిస్తూ విజ్ఞానములో జ్ఞానముగా జ్వలిస్తున్నదా?
సంకోచ-వ్యాకోచములతో సర్వసాక్షిగా నుండుట దాని సహజ లక్షణమా?
అసలు ఈ పంచభూతాత్మకమైన నేను ఈ బృహత్తు లోని పరమాణువునా? సహజదృష్టి కానేకాదు అంటున్నది కదా!
అదే కనుక నిజమైతే,
నేను సర్వతంత్ర స్వతంత్ర సమర్థుడినన్నమాట.
అదే కనుక నిజమైతే మనము ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చాము? ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాము? మనకు నచ్చిన రూపమును-తెలివితేటలను,కావలిసిన సంపదలను మనతో పాటుగా ఎందుకు తెచ్చుకోలేక పోయాము? జరుగబోయేది మనము ఎందుకు గుర్తించలేక పోతున్నాము?
ఆకలి వేస్తోంది అన్నము తిందామని లేచాను.నన్ను అనుసరించింది నాలోని అనుమానము .
నేను అన్నము తింటున్నాను మంచి ఆధరువులతో.తెల్లని ముత్యముల వంటి అన్నము ఎర్రని పచ్చడి,ఆకుపచ్చని పప్పు చూడ ముచ్చటగా నున్న దానిని నేను తినటము ప్రారంభించాను.
వాటి రూపము అదృశ్యము.వాటి రుచి మరికొంతసేపటికి అదృశ్యమైనది.నామరూప-గుణదోషములు నశించిపోయినవి వాటితో పాటుగా.నిజమునకు అవి జడములు.నాలోని చైతన్యమును కలిసి సమిసిపోయినవి.
అంటే జడము చైతన్యమునకు ఉపకరనముగా మారుతున్నది.చైతన్యము జడమును తనలో లయము చేసుకుంటున్నది.
అంటే
సహజ మానవప్రకృతి సాధనాప్రకృతిగా మారబోతున్నదా?
సమస్యగా కనిపిస్తూనే సమాధానముగా కాబోతున్నదా? ఏమో..
అప్రయత్నముగా నా చూపు చెట్తికింద నున్న గురుశిష్యుల మీద పడింది.
చేతనులైన వారు అచేతనములైన నల్లని అక్షరములను ముద్రించిన కాగితములతో విద్యాభ్యాసమును చేస్తున్నరు.
గురువుగారు ఒక్కొక్క కాగితమును విద్యార్థులకు చూపుతున్నారు.వారు చూసి
పద్యములు,కథలు,పాఠములు,పొడుపు కథలు,సామెతలు,పరీక్షాపత్రములు,అంటూ వర్గీకరించి చెబుతున్నారు.సరియైన సమాధానమైతే ఎగిరి గంతులేస్తున్నారు.గుర్తించలేనివారు బిక్కమొగము వేస్తున్నారు.
నల్లని అక్షరములుకల తెల్లకాగితముదేనా ఆ సామర్థ్యము?
ఆ అక్షరములను వివిధవర్గముల్లుగా అమర్చిన మేధాశక్తి ఎందుకు నిక్షిప్తముగా నున్నది.దాని గొప్పతనమును ఎందుకు చెప్పుకొనుటలేదు?
చూసిన విద్యార్థులకు సైతము వెన్నంటి తానుండి విశ్లేషించగలిగిన శక్తి ఎందుకు గుప్తముగా ఉంది?
కారనము తానై కార్యాచరణమును జరుపుచున్న ఆ చలన శక్తి నన్ను ,మనలను
సన్మార్గమున నడిపించును గాక.
సర్వం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.
కరుణ కొనసాగుతుంది.
No comments:
Post a Comment