ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-09
********************************
ఇప్పుడు నేనేమి చేద్దామనుకుంటున్నాను?దేనిని చూద్దామనుకుంటున్నాను?
అక్కడ శిల్పాలను చెక్కుతున్నారు.అనుకోకుండా నా దృష్టి అటువైపు మరలినది.
సాధనా పంచకమును మనకందించిన శ్రీ శంకర భగవత్ పాదులకు సవినయ నమస్కారములేఓ.
గమనిస్తున్నాను.పెద్దశిలలోని కొన్ని సకలములను తీసివేస్తున్నాడు.అద్భుతముగా శిల్పము ఆవిష్కరింపబడుతున్నది.
అంటే ఆ శిల్పి .. శిలలోని కొన్నిశకలములను పరిత్యజిస్తూ,మిగినదానిని పరిగ్రహిస్తూ పనిచేస్తున్నాడు కాని సృష్టించలేదు.
అంటే..
నేనుకూడ నా చుట్టు ఉన్నవాటిలో నుండి పనికిరాని వాటిని గుర్తించి,తొలగించగలిగితే,మిగిలిన దానిని గమనించుకొనగలిగితే,అద్భుతావిష్కరణమే కదా.
బాహ్యదృష్టి శిలలో దాగియున్న శిల్పమును గుర్తించలేనట్లు,విసేషదృష్టిలో దాగిన సామాన్యమును గుర్తించుట వీలుకాదు కదా.
నేను కూడ ఇప్పటివరకు సోగ కన్నులు,నీలి కన్నులు,లేడి కన్నులు,తేనె కన్నులు,కలువరేకులు అంటు బాహ్యనేత్ర సౌందర్యమును అభివర్ణించానే గానే వాటన్నిటిలో దాగి ప్రకటితమగుతున్న అద్భుతశక్తిని ఆవిష్కరించలేదుకదా!
నేను అన్వేషిస్తున్న ఆత్మస్వరూపమును ,నా చుట్టే ఉన్నప్పటికినిదానిని చుట్టుముట్టియున్న విశేషములచే కప్పబడియుండుటచే గమనించలేకపోతున్నాను.నేను దానిని సృష్టించలేదు కనుక అది లేదని నేనలేను.కాని
అది నాదగ్గరనే ఉన్నది.నన్నేగమనిస్తున్నది.నాలోనే ఉన్నది.నా పనులకు తన శక్తిని అందిస్తున్నప్పటికిని నా చర్యల గుణదోషములను ఎంచక సాక్షి వలె నున్నది.
అయినప్పటికిని అది విశేషములచే కప్పబడి నాది అనిపిస్తు,నేను-నాది అనే ద్వంద్వములుగా గోచరిస్తున్నది.
అంతటా దాగి భాసిస్తున్న ఆభాస అని అర్థమగుచునది.
ఈ ప్రపంచము వాస్తవికము అనే భావము ఆభాస గా మారి నన్నొక మెట్టు ఎక్కించింది..
నేను దానిదగ్గరకు వెళ్ళి ఉందామనుకున్నప్పటికిని ఇంకా నాలో కదులుతున్న మెట్టు ఎక్కించింది.మెట్టు ఎక్కించింది. సంఘర్షణలు నన్ను స్థిరముగా అక్కడే ఉండనివ్వటం లేదు.
ఇప్పుడు నేను ఒక సందర్శకుడిని.వెళుతూ-వస్తున్నాను.విషయవాసనలపై బెంగ తిరిగి వెనుకకు తెప్పిస్తున్నది.
ఆరోగ్యమే నిశ్చలనముపై అనారోగ్యమే పొర కప్పుకుంటూన్నట్లు.
అయితే ఈ అనారోగ్యమునకు ఔషధమేది? దాని శక్తి కేవలము అనారోగ్యపొరను తొలగించుట వరకు మాత్రమే కదా.
ఆభాస తాను పక్కకు జరుగుతూ వైభవమనే దానిని దానికి కర్త యైన విభుని,అనుగ్రహమైన విభూతిని చూపిస్తానంటు నన్ను తీసుకుని వెళ్తున్నది.
సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.
కరుణ కొనసాగుతుంది.
No comments:
Post a Comment