ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-08
****************************** ఉపన్యాసలహరి లో రేపటి అంశము,
నేను-నాది
*********** అని కార్యక్రమమును ముగించారు.
నేను-నాది అంటే రెండా/ఒకటా అనే సందేహము నాలో సందడి చేస్తున్నది.
ఎప్పుడో విన్న ప్రసంగములు ప్రసన్నములైనవో అన్నట్లు కొంచము కొంచము
నన్ను ఆలోచింపచేస్తున్నవి.
జీవుడు కారణము-జగము కార్యము.ఈ కార్య-కారణ సంబంధపు దాగుడుమూతలే రెండుగామన నుండి వేరుగా కనిపించే ద్వైతములు.
ఎవా ద్వైతములు? అభాస-వాస్తవికత గా దోబూచులాడు వింతలు.
ప్రకటిత స్వరూపము-వాస్తవిక స్వరూపము అను రెండు మనలను భ్రమింపచేయు ఏకైక చేతనము.
తనకు ఇష్టమైనప్పుడు వాస్తవిక స్వరూపము తనతో పాటుగా నామరూపములను-గుణత్రయములను కలుపుకొని,తాను మాత్రము గోప్యముగా నుండి తనతో పాటుగా తెచ్చుకొనిన,తాను సృష్టించిన జగతి అనే పరికరము ద్వారా ప్రకాశిస్తుంటుంది.
ఆ అంతటా ప్రకాశించేది ఆభాస.
అంతే ,
అంటే మన ఉపాధి దానిలో దాగిన చిత్శక్తి ద్వారా చేతనవంతమగుచున్న ఒక పరికరమా?
అయినే నేను నా కన్ను-నా ముక్కు-నా చేయి అంటు ఇది నాది అంటు అనుకుంటున్నానుగా.నేను అనే దాని అధీనములో నాది అనుకునే ఈ శరీరావయములున్నాయా? అది సూక్ష్మముగా దాగి శక్తిని అందిస్తు మనము చూసే కదలికలను చేయిస్తున్నదా?
అమ్మో ...
అది సహకరించకపోతే ఇవి చేతకానివేనా?కళ్ళు మూసుకుని....మళ్ళీ తెరిచాను.
మూయుట-తెరుచుట కూడ అదే చేస్తున్నాదా?దర్శన శక్తిని అందిస్తున్నదా.
వారివి చేపకళ్ళు-వీరి కళ్ళు తామర రేకులు-ఆమె భీత హరిణేక్షణ-భ్యపడుచున్న లేడి వంటి కన్నులు క్లది-
సోగ కళ్ళు-చక్రాల వంటి గుండ్రనైన కళ్ళూ-నక్షత్రముల వలె ప్రకాశించు కనులు-నీలి కళ్ళు-తేనె కళ్ళు అంటు రూపములను గుర్తిస్తూ,దర్శనశక్తి అనే క్రియాశీలతను గుర్తించలేకపోవటమునకు కారనము మనము మాయా ప్రభావితులమగుటయె కదా!
ఉన్నది లేనట్లు-లేనిది ఉన్నట్లు మనలను భ్రమింపచేసే చతురతయే కదా మాయ.
నేను అంటే నామ-రూప-స్వభావములతో గోచరించే,స్వయం సమర్థత లేని ఆకారమా?
లేక స్థూలముగా/సూక్ష్మముగా తన పరిమాణమును ఆవరణ-విక్షేపములు చేస్తున్న శాశ్వత నిరాకార-నిరంజన-నిర్గుణ శాశ్వత సత్ చిత్తా?
నా అలోచనలకు ఆలంబనముగా అక్కడ శిల్పి చెక్కుతున్న ఒక అద్భుత శిల్పము శిల నుండి కొంత అనవసర భాగమును వదిలివేస్తూ నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నది.
పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment