ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-09
*****************************
నేను అంతే కేవలము ఉపాధిగా భావింపబదే ఈ శరీరమా? లేల అంతకు మించి ఏమైన ఉన్నదా? అన్న సంసయము నన్ను తొలిచివేస్తున్నది.
ఉపాధిని కారనముగా కనుక మనము అనుకుంటే దానికి కారణమైనది ఏది? ఒకవేళ ఇది స్వయం నిర్మితమనుకుంటే దీనికి మనము ఇన్ని వైల్యములు-దురవస్థలు వృధ్ధాప్యము-మరణము మున్నగు వానికి లోనుకానీయము కదా.
కనుక నిస్సందేహముగా ఇది పరాధీనము.ఏదో మహాశక్తి కనుసన్నలలో తన ప్రతి కదలిక ఆధారపడియున్నది.
అయితే ఈ విషయమును మనము విస్మరిస్తున్నామా? అనుకోకుడా ఎదురింటివైపుకు మళ్ళింది నా దృష్టి...
గుమ్మమునకు కట్టిన పరదా తెర అప్పుడు సరదాగ కదులుతు గాలికి,లోపలి వస్తువులను లీలగా చూపిస్తున్నది.అంతలో కప్పివేస్తున్నది.నేను తెలిసికొనవలసిన సత్యమును చెప్పకనే చెప్పుతున్నదా అనిపించింది.
అంటే మన లోపల ఏముందో మనము గుర్తించలేక పోవుటకు కారనము "ఆవరణము" అని అంతటా ఆవరించి యున్న మాయతెర అన్నమాట.అది లోపలనిన్ను వస్తువులను(విక్షపమును) దాచివేసి దానిని మాత్రమే మనలను దర్శింపచేస్తున్నదన్నమాట.
ఏ విధముగా తెర-దాని వెనుక దాగిన వస్తువు భిన్నముగా ఉన్నాయో,అదేవిధముగా మనలో దాగియున్న విక్షపము-మనలను ఆవరించియున్న ఆవరణము భిన్నములన్నమాట.
అయితే ఇక్కడ ఇంకొక విచిత్రము మనలను గమనించమంటుంది.
లోలదాగియున్నది నిర్వికార-నిర్గుణ-నిరంజన ఏకత్వము.కాని అది దాని ప్రసరణమును వస్తువుపై వేచి-దానితో మిళితమై అనేకత్వముగా మనలను భ్రమింపచేస్తున్నది.
మన చూపు-దర్శనశక్తి వివిధవస్తువులపై బడి-ప్రభావితమై అనేకానేకములుగా విభజింపబడుతోంది.శక్తి ఒక వస్తువుపై బడి దాని గుణముతో మిళితమై ప్రేమ అనే అవస్థగా ప్రకటింపబడుతున్నది.వేరొక దానితో మిళితమై ద్వేషముగా,మరొకదానితో మిళితమై అసూయగా,జాలిగా,ఆశ్చర్యముగా,తృప్తిగా ఇలా ఎన్నో ఎన్నో విధములుగా విభజింపబడుతున్నది.
ఎంతటి పరమాద్భుతమిది.
సత్యముతో కప్పబడిన అబద్ధము మనకు కనబడుతుంటుంది.లేనిదానిని మనము చూస్తున్నప్పుడు ఉన్నది మరుగున ఉంటుంది.
ఉన్నదానినే మనము చూడగలిగిన శక్తివంతులమైనప్పుడు లేనిది తోకముడుచుకుంటుంది.
ఒక్కొక్క విషయము నన్ను దగ్గరకు తీసుకుని తత్త్వదర్శనమును అందించుటకు సహకరిస్తుంటే,
మన తనువులు తత్త్వమును కూడి యున్నామా లేక తత్త్వమునకు విడివడి యున్నామా అనే ధర్మసందేహము పరిష్కారమును అందించుటకు నలుగురు మిత్రులను నాకు తోడుగా అందించుటకు వస్తున్నది.
సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment