Sunday, October 31, 2021
ANAYA NAYANAR
బ్రహ్మ మస్తకావళీ నిబధ్ధతే నమః శివాయ
జిహ్మగేంద్ర కుండల ప్రసిధ్ధతే నమః శివాయ
బ్రహ్మణే ప్రణీత వేద పధ్ధతే నమః శివాయ
జిహ్మకాల దేహదత్త పధ్ధతే నమః శివాయ
నమః శివాయ
ఆదిశేషువే కుండలములైన వానికి దండాలు శివా
ఆ కాలునే కాలదన్నినవానికి దండాలు శివా
వేదములే శిరములైన వానికి దండాలు శివా
వేదార్థములే తానైన వానికి దండాలు శివా.
" ఆ నయ గో సం రక్షక" నాయనారు తిరుమంగళములో గోకులమున జన్మించెను.క్షత్ర వాసన ఏమో వేణుగానముతో పున్నమి వెన్నెల నిండిన బిల్వనంబున సామవేదేశ్వర నాదార్చనముతో సకలజగములలో సుఖశాంతులను నెలకొల్పినాడు.
నామరూప భేదమేకాని నాదార్చనలో లోపములేదు.మనోలయమొనరిచే మహాద్భుత మురళీగానము భక్తుని శబ్దమును భగవంతుని చెవికి చేరుస్తూపరవశిస్తున్నది.భగవత్ప్రసాదమైన ఊపిరిని భగవత్సేవకు కైంకర్యమొనరించుచు,కులవృత్తిని గౌరవించుచు ,
శిశుర్వేత్తి-పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః"
అన్న నానుడిని నిజము చేస్తూ,గోవులు మేతమీద ధ్యాసను మరల్చుటలేదు.దూదలు తల్లిపాలకై పరుగులు తీయుట లేదు.ఉరుములు తమ నిశ్సబ్దములైనవి.వేడి గాలుల జాడ లేదు.
ప్రకృతి సమస్తము ప్రశాంతముగా పరవశిస్తున్నది.పరమాత్మ తత్త్వమును పరిపరి విధములుగా ప్రస్తుతిస్తున్నది.
సహజ వైరమును మరచినవి సాధకుని సాంగత్యములో సమస్త ప్రాణులు.సహనమునకు పెద్దపీట వేసినవి.సంఘీభావమునకు శంఖుస్థాపన చేసినవి.
ఆనయ హోమద్రవ్యములను మనకు అందించు కామధేనువులను కామేశ్వరునిగా పూజిస్తూ,నాదార్చనను నమ్మిన భక్తితో చేస్తూనే ఉన్నాడు.
naadam tanumaniSam Sankaram.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment