Sunday, October 31, 2021
TIRUNEELAKANtHA NAYANAR.
వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ
హేమ మేదినీ ధరేంద్ర చాపతే నమః శివాయ
నామ మాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ
కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ
ఆశాపాశమునకు అందనివానికి దండాలు శివా
ఆకాశము కేశములైన వానికి దండాలు శివా
పర్వతమును విల్లుగ మలచిన వానికి దండాలు శివా
పాపములు దహించు స్మరణనామికి దండాలు శివా
చింతలు తీర్చే చిదంబరమున కుమ్మరి కులములో జన్మించినాడు తిరు నీలకంఠ నాయనారు.సారెతో కుండను మలచిన రీతితో,సాంబశివుని కృపతో తన నిండు జీవితమును సద్భక్తునిగా మలచుకొని సంతుష్టిని పొందుచుండెను.
కాలము మాయాజాలమేమో కాని కామునికాల్చిన కామేశుడు వానిని కనికరించుటకు,వాని భక్తిని లోకవిదితము చేయుటకు వానినే పరికరముగా మలచి పంపాడు.
శివభక్తులకు భిక్షాపాత్రలనొసగి పరవశించుటకు బదులు స్త్రీల కదగంటి చూపు భిక్షకై వేశ్యాగృహములకు తరలినాడు.కాని పనులు చేసినాడు.భార్య ముందు కాదనలేక పోయినాడు.
అంతటితో ఆగలేదు ఆదిదేవుని పరీక్ష.ఆలించే తనను తాకిన నీలకంఠేశుని పై ఆన అని అభ్యంతరమును చెప్పించాడు.
తప్పు తెలిసికొనిన నాయనారు తన భార్యను మాత్రమేకాదు,తక్కిన స్త్రీలను సైతము
మాతృమూర్తులుగా భావిస్తూ,తాను బ్రహ్మములో చరించసాగాడు.
ఆటవిడుపునీయ దలిచాడు ఆ మూడుకన్నులవాడు.ఏ భిక్షాపాత్ర దాన వ్రతమును పాటిస్తున్నాడో ఆ భిక్షాపాత్ర గ్రహీతగా తరలి వచ్చాడు.
విస్మరించిన గృహస్థధర్మమును గుర్తుచేసి,వారు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అందించుటకు శివయోగిగా తిరునీలకంఠను సమీపించాడు.
దర్శనము నందించిన ధన్యత ఎదురేగి ఎనలేని భక్తి సాదరముగా ఎదురేగి స్వామిని సత్కరించింది.భిక్షపాత్రను అందీయ బిడియమును వీడింది.
ఆటను ప్రారంభించాడు నిటలాక్షుడు.స్నాన నియమమును వివరించి,వీలుకానిచో వెళ్ళిపోతానన్నాడు.
భార్యను తాకనను ప్రతిన ఒకవైపు/భక్తునికిచ్చిన మాట ఇంకొక వైపు దేనిని తిరస్కరించాలి?దేనిని పురస్కరించాళి? పెద్ద ధర్మ సంకటము.
అవుననలేడు/కాదనలేడు.
కఠిన పరీక్షకు కాస్త సడలింపునిచ్చాడు కరుణామయుడు సలహారూపములో.
ఆలుమగలు తాకకుండా ఒక కర్రను పట్టుకుని (ఆనను గౌరవిస్తూనే) జంట స్నానాలు చేసి(యతి నియమమును కాదనకుండానే) స్నానముచేసి,స్వామి సాక్షాత్కారమును పొంది సఫలీకృతులైనారు.
ఆ నీలకంఠుని అనుగ్రహించిన నీలకంఠుడు మనలందరిని అనుగ్రహించుగాక.
ఏక బిల్వం శివార్పణం
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment