Thursday, November 11, 2021
AMARANEETI NAYANARU
అమరనీతి నాయనారు
*****************
[03:20, 11/11/2021] విమల: ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ
దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ
సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేంద్ర కేతవే నమః శివాయ
ఋషివందిత ఋషభవాహనునకు దండాలు శివా
ధర్మపు వంతెన సృష్టిరక్షకునకు దండాలు శివా
దుష్టుల శిక్షించు ధూమకేతనునకు దండాలు శివా
ఇష్టవస్తు ప్రదాత అష్టమూర్తికి దండాలు శివా.
అశాశ్వత ఉపాధిని నడిపించుచున్న శాశ్వత /అమర శక్తివి నీవే అని పరమాత్మ తత్త్వమును తెలిసిన సార్థక నామధేయుడు అమరనీతి నాయనారు.
వృత్తి-ప్రవృత్తులు విరుధ్ధములైనప్పటికిని ,వాటిని తన సంస్కారముతో సమర్థవంతములుగా మలచుకొనిన వాడు.పళైయర్ లో వైశ్యకులములో జన్మించిన అమరనీతి ఇహమునకు సంబంధించిన భోగలాలసను పెంపొందించు పట్టు వస్త్రములను.సువర్ణ-నవరత్నములను కులవృత్తిగా విక్రయించుచున్నప్పటికిని,బురద తాకని తామరవలె,వైరాగ్య సంపన్నుడై అత్యంత భక్తి శ్రధ్ధలతో నటరాజ భక్తులైన శివయోగులకు ,వైరాగ్య సంకేతమైన కౌపీనములను దానము చేయు దీక్షాపరుడిగా శివార్చనలను చేయుచుండెడి వాడు.
తన సంపాదనతో శివభక్తుల వసతికై ఎన్నో మఠములను కట్టించాడు.పరవశిస్తూ శివభక్తుల పాదములను (పాద్యముతో) పరమేశులే అంటూ కడిగే వాడు.కాశీ విశ్వేశ్వరులంటూ కౌపీనములను భక్తితో సమర్పించేవాడు.
కళ్యాణ సుందరేశుని కనులారా దర్శించుకుంటు,మనసారా స్మరించుకుంటూ మైమరచి పోతుండేవాడు.
గోచీ సమర్పణ వ్రతుని పేచీతో అనుగ్రహించాలనుకున్నాడు ఆ మూడుకన్నులవాడు వేడుకగా.
అంతే.
దాక్షిణ్యమూర్తి కౌపీనమును ధరించి,తన దండమునకు రెండు కౌపీనములను కట్టి ,సమీపించాడు అమరనీతి నాయనారును.వచ్చినది తనను పరీక్షించుటకని తెలియని భక్తి, భక్తుని చేత సంభ్రమాచర్యములతో పరుగులు తీయించినది.పాదసేవనము చేసినది.పరిపరి విధముల ప్రార్థనలను చేయించినది.
.ప్రణామములిడినది.పరవశిస్తున్నది.అయినా ఏదో వెలితి.
అదను కోసము చూస్తున్నాడు మదనుని కాల్చినవాడు.వానితో తందానా అంటూ మోదముతో నున్నది కథను నడిపించే కౌపీనము.
స్వామి మిమ్ములను సేవించుకొను అవకాశమునిమ్మని అమాయకముగా వేడుకుంటున్నాడు మాయావిని మైమరచి అమరనీతి.
మరీ ఇంత మొహమాటపెడితే కాదనగలనా.కానీయి నీ ఇష్టమే అంటూ , తన దండమునకున్న ఒక పొడి కౌపీనము నిచ్చి
,
,
నేను నదీస్నానము చేసివచ్చేవరకు దీనిని నీ దగ్గర భద్రపరచు.వచ్చి తీసుకుంటాను అన్నాడు మహదేవుడు. .మహాభాగ్యమంటు మురిసిపోయాడు నాయనారు.
అంతలో ... అనుకోకుండా,
కురుస్తున్నది కరుణామృత వర్షమందునా/ కఠిన పరీక్షకు నాంది అనుకోనా /కైవల్య కటాక్షమునకు శిక్షణ యా అది?
ఆదిదేవుడు ఆటను ప్రారంభించాడు.తన శరీరము మీది కౌపీనమును/దండమునకు కట్టిన దానిని తడిసి ముద్దయేటట్లు చేసాడు.మంచుకొండ నివాసమైన వాడిని నేనేమనగలను?
చలికి గడగడ వణుకుతు వచ్చి అమరనీతిముందు నిలబడి, అమరనీతి నా పొడి కౌపీనమును ఇస్తే కట్టుకుంటున్నాను
అన్నాడు అగ్గి కన్నువాడు అమాయకముగా.
తక్షణమే దాచిన కౌపీనమును తిరిగి ఇచ్చివేయుటకు లోనికి వెళ్ళాడు అమరనీతి.
.
దాచిన చోట కౌపీనములేదు.తొందర పెడుతున్నాడు బయటనున్న అతిథి కౌపీనమునకై.
క్షమాపణ నడిగి తన దగ్గరనున్న కౌపీనమును స్వీకరించమన్నాడు భక్తుడు.తానిచ్చిన కౌపీనమే కావాలన్నాడు భగవంతుడు."లాలోచిపడిన కౌపీనము తనపని తాను చేసుకుపోతున్నది భక్తునికి అందకుండా.భగవదాజ్ఞను పాటిస్తూ."
భంగపాటును భరిస్తూనే భక్తి బ్రతిమలాడ సాగినది మరొక్క అవకాశమునకై.కౌపీనమునకు బదులుగా మరేదైనా స్వీకరించుటకై.శివపాదమును విడువకున్నది.
కనికరించాడు కదిలివచ్చినవాడు.భక్తులకు స్తుతుల నందించ దలచి కౌపీనముతో తులాభారమునకు అంగీకరించాడు అష్టమూర్తి.త్రాసులో కౌపీనమునుంచారు ఒకవైపు.
అష్టసిధ్ధులు ఒకవైపు -అష్టైశ్వర్యములు మరొకవైపు ఆడుకుంటున్నాయి.సరితూగుట సాధ్యము కానిది కదా.
మాట తప్పని అమరనీతి తన కుటుంబముతో సహా తక్కెడలో కూర్చున్నాడు తూగుటకు.
జగమంత కుటుంబమైన జంగమ దేవర కనికరించాడు.నిజ దర్శనమునందించాడు.
విషయభోగములను విష సర్పముల బారిన పడకుండా ,విశేష ఫలమును అందించుటకు,కౌపీనమును కారణము
ు చేసిన శరణాగత రక్షకుడు మనలను అనిశమురక్షించును గాక.
ఏక బిల్వం శివార్పణం
.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment