Saturday, November 13, 2021
MAIPORUL NAYANARU
మెయిపొరుల్ నాయనరు
****************
అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు
రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ,
మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు.
ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు,
'అపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ"
అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము.
తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి.
రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు?
పొరుగు రాజైన ముత్తునాథన్ మదిలో అసూయ అను విత్తును నాటాడు.నాయనారు రాజ్యమును ఆక్రమించాలనే ఆశను అధికము చేసాడు.అనవసర ప్రయాస అను ఆలోచనను అణిచివేశాడు.
అంతే హుటాహుటిగా మన్నన్ పై దండెత్తి వచ్చాడు ముత్తునాథ తన సత్తాను గమనించలేక.
గమనము గమ్యము తానైన వాని ఆటకు తానొక ఉపకరణమైనాడు.ఉపక్రమించాడు.
యుధ్ధములో ఒక పక్క అసూయ మరొక పక్క శివ విధేయ.
అరితో పోరును అరిషడ్వర్గము చేసి,చేసి, అలిసిపోయినది.సొలాసి వెనుదిరిగినది
రుద్రుని అండనున్న వాని భద్రతను అపహరించుట సాధ్యమా ఆ ముత్తునాథునకు.చిత్తు చిత్తుగా ఓడి,మడమను తిప్పినాడు.
మధురం శివనామం మదిలో మరువకె ఓ మనసా.
ఇహపర సాధనమే నాణ్యమైన పరీక్షకు నాణెము గిరగిర తిరుగుతు ధర్మాధర్మములను తిప్పుతూ,ముత్తునాథను మనసును చిత్తుచేస్తున్నది.
ధర్మము తాను కాసేపు శివాజ్ఞగా పక్కకు తప్పుకోవాలనుకున్నదేమో,అదేపనిగా అధర్మము ముత్తునాథన్ ఆశను తీర్చుకోమ్మని ఆకర్షిస్తున్నది.
అంతే అనుకున్నదే తడవుగా,
ఆహార్యము శివస్వరూపమైనది.రుద్రాక్షలను ధరించింది.విభూతి పుండ్రములను అలంకరించుకుంది.అంతా శివమే అంతు చిక్కిన తరువాత.అడుగులను అరి ఉన్న రాజ్యము వైపు కదుపుతున్నది.అన్నెము-పున్నెము ఎరుగని శివభక్తులు కదులుచున్న స్వరూపమునకు కైదండలు పెడుతున్నారు.కీర్తిస్తున్నారు.పరవశిస్తున్నారు.
ఆంతర్యములోని జీవుడు అరిమర్దనమునకు ఆలోచనలను చేస్తున్నాడు.అత్యంత వినయమును ప్రదర్శిస్తూ నాయనారు భవనము వైపునకు అడుగులను కదుపుతున్నాడు.
జీవిని అధర్మ ఆలోచనము.దేవునిది ,
అన్నమయ్య అన్నట్లుగా
ఇందులో హీనాధికములసలే లేవు.
అంతయును పరబ్రహ్మ స్వరూప స్వరూపమే.అవసరానుసారము పరమాత్మ వానిని విరుధ్ధములుగా ప్రకటిస్తూ భక్తిని -భక్తుని భాగ్యోపేతులను చేస్తాడు.
మందిరములోనికి ప్రవేశించాలంటే మాయమాటలు చెప్పవలసినదే ముత్తునాథుడు.తానొక మహా శివయోగినని,శివతత్త్వ మర్మమును నాయనారుకు ఉపదేశించుతకు సివాజ్ఞగా వచ్చానని కల్లబొల్లి కబురులు చెప్పాడు ద్వారము దగ్గరనున్న ధాతన్ అను అంగరక్షకునితో.
శివ స్వరూపమును సాదరముగా ఆహ్వానించాడు నాయనారు.సాదర మర్యాదలను నిర్వర్తించాడు.సేవా సౌభాగ్యమును ప్రసాదించమని వేడుకున్నాడు
అందులకు ఆ కపటయోగి తాను వేదవిద్యా రహస్యములను ఏకాంతములో బోధించుటకు వచ్చితినని,ఉన్నతాసనమున కూర్చుండి,సేవాసక్తతతో తన కిందకూర్చుని యున్న నాయనరును కత్తితో పొడిచెను.
ఎంతటి దారుణము.అడ్దగించుటకు రాబోతున్న ధాతన్ ను ఆపి ,పరమేశ్వర సంకల్పానుసారము జరుగుచున్న పని ఇది కనుక దీనిని అడ్దగించరాదు.
అనుచు ధాతన్ ను పిలిచి,ప్రజలు దుఃఖముతో వీరికి కానిపని తలపెట్టుతారేమో.కనుక నీవు వీరిని సురక్షిత ప్రదేశమునకు చేర్చి రమ్మని ఆనతిచ్చెను.
తన భార్యాపుత్రులను పిలిచి తన రాజ్యము శివమయమై శోభిల్లాలని,తాను శివనామస్మరణమును చేస్తూ,శివైక్యమునొందెను.
నాయనారును ఆశీర్వదించిన ఆదిదేవుడు మనలనందరిని అనిశము కాపాడును గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment