Saturday, November 13, 2021

RUDRA PASUPATI NAYANARU

URUTTIRU PASUPATI NAYANAR తిరుతొండర్దొగై సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.త్రికాలములందు తలలోతు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి రుద్రపారాయణను అదే నమ్మినవాని అర్చనగా నమకచమక పారాయణమును చేసేవాడు.భవ పాశములను తొలగించే పతి ని కొలిచేవాడు శివుడుగా -- నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది. ఇక్కడ మనము కొంచము పరిశీలితే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభిచాలంటే దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ సక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది. మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే , పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మరనం-పునరపి జనననీ కఠరే సయనం" అని శంకర భగవత్పాదులు సెలవిచ్చినట్లు ఉపాధి అను పాశముతో భగవతత్త్వమునకు-జీవనకృత్యమునకు ముడివేయబడి జన్మరాహిత్యమును పొందుటకు దయాంతరంగుడైన "పతి" చే మరొక్క అవకాశమును పొందుచున్నాడు. జీవన పరమార్థమును ఆకళింపు చేసికొనిన నాయనారు నమక-చమక పారాయనమును సంసారపు సాగరమును దాటించు నావగా భావించిన వాడు. ఆంతర్యమును అభివ్యక్తీకరించుటలో కూడా తన అనుష్టాన భంగిమను ఒక అద్భుత సందేశముగా చూపుతు మనలను అనుగ్రహిస్తున్నాడు పశుపతి రుద్రనాయనారు. ప్రతిజీవి సంసారమనే ప్రవాహమును ఈదలేక తలమునకలవుతుంటాడు.ఆ సాగరము చిక్కటి బురదతో పెక్కు మొసల్లతో కాలు తీసి,పైకివేసి,కదిలి వద్దామన్న విడిచిపెట్తక మనలను ఒడిసి పట్టుకుని ఉంటుంది. అటువంటి బురదతో నిండిన చెరువులో ఉన్నప్పటికిని పద్మము ఏ విధముగా దినపతి అయిన సూర్యకిరణముల సహాయముతో,తన పుట్టినిల్లైన బురదను ఏ మాత్రము అంటనీయక స్వచ్చముగా ఉంటుందో,సుగంధభరితమవుతుందో,అదే విధముగా తాను పుట్టిన /తనకు పుట్టినిల్లైన సంసార బంధములను పశుపతి కరుణ అనెడి కిరనముల ద్వార తన ఉపాధిని సంస్కార భరిత సుగంధ మయము చేసుకోవాలని తానొక నిదర్శనమై,నీలకంఠుని నిస్తుల కరుణను పొందెను.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...