Friday, November 19, 2021

TIRU NAVUKKU ARASAR APPAAR NAAYANAAR

తిరునవుక్కు అరసర్ నాయనారు/అప్పార్ నాయనార్ **************************** "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే" వైదిక ధర్మమునకు గ్లాని సంభవించుచున్నవేళ దానిని పునరుధ్ధరించుట్కు పరమాత్మ ప్రత్యేక నామరూపములతో ప్రకటితమవుతాడు అని తెలియచేస్తునది శ్రీమద్భగవద్గీత. నాయనారుకుగల మరో పేరు అప్పర్/తండ్రి. జ్ఞానసరస్వతీదేవి నాయనారును కాళిదాసును శ్యామలాదేవి అనుగ్రహించినట్లు బీజాక్షరములతో అనుగ్రహించినది కనుక, తిరు పవిత్రమైన నవుక్కు-మాటలకు అరసర్-అధిపతి. నామములకు అధిపతి కనుక నవుక్కు అరసర్ అనియు,నామములు పవిత్రమైనవి కనుక తిరు నవుక్కు అరసర్ గా నాయనారు కీర్తింపబడుతున్నాడు. కొన్నివర్గముల వారి అభిప్రాయము ప్రకారము రావణాసుర రుద్రవీణాగానమునకు సహాయము చేసిన వాగీశ్వర్ అను మునియే శాపవశమున నవుక్కు అరసర్ గా జన్మించాడని నమ్ముతారు. అప్పర్ని-అతని అక్కయైన తిలకవతిని వేదాధ్యన సంపన్నులను చేశారు వారి తండ్రి అప్పటి మతవిద్వేషములు చేయుచున్న మారణకాండలను దృష్టిలో నుంచుకొని.వేదధ్యయనందు తన పిల్లలకు ఆసక్తిని కలిగించారు.ఆకర్షితులను చేసారు.కాని, ఒక మహాకవి నుడివినట్లు, "కోరిక ఒకతి జనించు తీరక దను దహించు కోరనిదేదో వచ్చు శాంతి సుఖాలను తెచ్చు అని తెలియచేసేది జీవితము. అప్పర్ అక్క తిలకవతికి సైన్యాధిపతితో వివాహమును నిశ్చయింపచేసాడు సేనాపతి తండ్రియైన సాంబశివుడు. మానవుడు తానొకటి తలిస్తే దైవము మరొకటి నిశ్చయిస్తుంది అన్న మాటను నిజముచేస్తూ,ఆ సమయములో జరుగుచున్న యుధ్ధములో తిలకవతికి కాబోయే భర్త వీరస్వర్గమును పొందాడు. సుగుణసంపన్నమైన తిలకవతి తనువుచాలించుట కు నిర్ణయించుకొనినది.జరిగిన ఘోరమును తట్టులోకోలేని వారి తండ్రి చనిపోతూ,అప్పర్ బాగోగులను చూసుకొనే బాధ్యతను తిలకవతికి అప్పగించి కన్నుమూసాడు.కర్తవ్యమును కాదనలేని తిలకవతి సన్యాసినియై సదాశివుని పూజిస్తూ ,తమ్ముని మిక్కిలి అనురాగముతో చూసుకోసాగినది. పరమేశుని ప్రణాళిక ప్రకారము అప్పర్ పరమత ప్రలోభములకు దాసుడై సనాతనమును నిందించటము ప్రారంభించాడు.అక్క చెప్పే సుద్దులను చెవికి చేరనీయకుండా చేస్తున్నాడు చంద్రశేఖరుడు.ఒక్కమాటైన చెవికెక్కటములేదు. తాను నమ్మిన శివుడే తన తమ్ముని ధోరణిని మార్చగలవాడని నమ్మిన తిలకవతి తాను మాత్రము నిష్కళంక భక్తితో నీలకంఠుని సేవిస్తున్నది. కాలముతో పాటుగా చెరొకపక్కన ధర్మము-అధర్మము సమాంతర ప్రయాణమును చేస్తున్నవి అడ్డనామాల వాని ఆనకై ఎదురుచూస్తూఆసక్తిగా. శివ ప్రసక్తిలేకుండా తమ్ముడు అప్పర్-శివ ప్రశస్తి తక్క అన్యము లేకుండా అక్క తిలకవతి నిమగ్నులై ఉన్నారు.. కడుపునొప్పిని ఒడుపుగా వదిలాడు అప్పర్ మీదకు తప్పక తన మార్గమునకు తెప్పించుకోవాలని.శివుడు. ఆహార సిధ్ధి-ఆసన సిధ్ధి ఆసన సిధ్ధి-ఆరాధ్య సిధ్ధి ఆరాధ్య సిధ్ధి-అనుగ్రహ సిధ్ధి కి సోపానములు అంటారు.మన శరీరారోగ్యము మనకు సహకరిస్తేనే కాని ధ్యానము -ధన్యత సిధ్ధించదు . సన్నగిల్లుచున్న సనాతనమును పునరుధ్ధరించుటకు అన్నట్లు పుణ్యతిథులను జరుపుతున్నాడు దీక్షాస్వీకారమునకై దాక్షాయణిపతి. తన తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో-ఎప్పుడు వస్తాడో తెలుసుకోలేని పరిస్థితి తిలకవతిది.తమ్ముడు సనాతన ధర్మమునకు వ్యతిరేకియై,అది ఆశపెడుతున్న పదవికి దాసుడై,దైన్యమునాశ్రయిస్తాడేమోనని దిగులుతో సదాశివుని తమ్ముని సంస్కరించమని వేడుకుంటుంన్నది. . సమయమునకై ఎదురుచూస్తున్న సదాశివుడు కడగండ్లను తొలగించుటకు అప్పర్కు కడుపునొప్పిని పంపించాడు. పాషణ్డ మతస్థుల పాలనలో పదవిని పొందాలంటే అప్పర్ కడుపునొప్పిని తగ్గించుకోవాలి.కాని అది శరీరపు గడపదాటనంటూ,గడబిడ చేస్తున్నది. తడబడక తనకు ఈయబడిన పనిని,అప్పర అక్క ఇంటి గడప తొక్కేవరకు పక్కకు తప్పుకోకుండా ఉంది. అక్క తప్ప తనను చక్కదిద్దువారెవరు లేరనుకున్న అప్పర్ అక్క ఇంటిముందర నిస్సహాయముగా నిలబడినాడు.శివానుగ్రహమైన విభూతిని అప్పర్ శరీరమంతా పూసి పునీతుని చేసినది తిలకవతి. స్వామియే కాదు స్వామి ధరించే విబూది సైతము మహిమాన్వితమై అప్పర్ను మార్చగలిగినది. హర శంకర శివ శివ సంకర శివ శివ సంకర జయ జయ శంకర. మక్కువతో భక్తులను చక్కదిద్దు ముక్కంటి అక్కచే అప్పర్కు శివదీక్షను అనుగ్రహింపచేసాడు.అంతే ఐహికమును మరచి ఆరు సంవత్సరములు అం తర్ముఖుడై బ్రహ్మజ్ఞానమును పొందాడు. మన తెలుగు కవిత్రయము వలె తమిళములో అప్పర్-తిరుజ్ఞాన సంబంధర్-సుందరర్ శివజ్ఞాన సంబంధ ప్రచారమును గ్రంధరూపమున నిక్షిప్త పరచి,చరితార్థులైనారు. "తిరుమురై "గ్రంధములోని 7 ప్రకరణ ములను అప్పర్ మనకు అందించినారు.అంతే కాదు అద్భుత తేవారములను ప్రసాదించినారు. తేవ-ఆరం-అనగా శివునకు/పరమాత్మకు అర్పించు హారము అని ఒక అర్థమును తీసుకుంటే, తే వరం భవంతుని యందు అనురాగము అని మరొక అర్థమును కూడా పెద్దలు స్వీకరిస్తారు. భగవంతునికి భక్తితో సమర్పించే భావన తేవారము అని మనము అనుకోవచ్చును. యక్షరాజ సేవకుని (కుబేరుని) దీవెన ఎన్నో మహిమలను ప్రక్షిప్తముచేయుటకు అప్పర్ లో యాత్రా కుతూహలమును కలిగించింది.శివనామ స్మరణముతో ఎన్నో స్థలములు పునీతములగుచున్నవి.ఎందరో భక్తులు శివుని మహిమలు శివభక్తుడైన అప్పరు (వాక్రూపములో) ద్వారా ప్రత్యక్షముగా దర్శించి,ధన్యులవుతున్నారు.చనిపోయినవారు పునర్జీవితులవుతున్నారు.మూగబోయిన వేదములు నాదమయములై మోదమందుచున్నవి. క్రమక్రమముగా కానికాలము కరిగిపోతూ,సనాతనపు వేకువకు దారిని చూపిస్తున్నది.కాని సామాన్య జనములకు కావలిసినది నిదర్శనము. ఓం నమః శివాయ-శంభో శంకర అప్పర్ ద్వారా శివమహిమలు అందరికి ఆ నందమునిస్తుంటే,సనాతనధర్మమును వ్యతిరేకించు రాజును కలవరపరచినవి. "దండనం దశగుణం భవేత్ "అనుకున్నాడేమో సనాతనధ్ర్మ విద్వేషి యైన రాజు అప్పర్ ను అనేకానేక చిత్రహింసలకు గురిచేసాడు. "సత్యమేవ జయతే "అను వాక్యమును నిజము చేస్తూ,అప్పర్ ను ఆ శిక్షలు ఏమీచేయలేక పోయినవి. సాంబశివుడు రాజును అనుగ్రహించి సుందరమైన శుభకరమైన శివతత్త్వమును ప్రసాదించాడు. అప్పర్ అదిదేవుని ఆనతి ప్రకారము అంత్యమున సోమస్కందమునకు వెళ్ళి శివైక్యమునందినాడు. కొండంత దేవునికి కొండంత పత్రిపూజను చేయలేని నేను అప్పర్ అణువంత మాత్రమే స్మరియించగలిగాను..అనుగ్రహిస్తే మరింత వివరములతో మీ ముందుకు వచ్చే ప్రయత్నమును చేస్తాను.క్షంతవ్యురాలను. అప్పర్ను అనుగ్రహించిన సదాశివుడు మనలనందరిని అనిశము రక్షించునుగాక. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...