Friday, December 24, 2021
PAASURAM-09
తిరుచిట్రంబలం-పాశురం-09
***************************
తిరువెంబావాయ్-09
************
మున్నై పళం పొరుక్కుం మున్నై పళం పొరుళై
పిన్నై పుదుమైక్కుం పేత్తుం ప్పెట్రియెనె
ఉన్నై పిరానాగ పెట్రవుం శీరడియో
ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపాంగావో
అణ్ణవరె ఎణకణవర్ ఆవార్ అవర ఉగందు
శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం
ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్
ఎన్న కురయుం ఇలో మేలోరెంబావాయ్
ఉన్నడియార్ తొళుంబాయ్ పోట్రి
*************************
భాగవత సేవా ప్రీత్యాయా పోట్రి
తిరుమాణిక్యవాచగర్ భగవదనుగ్రహమును పొందుటకు సులభమార్గమును ప్రస్తుత పాశురములో మనకు అనుగ్రహించుచున్నారు .
ఎనిమిదవ పాశురము వరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపుతున్నట్లుగా బాహ్యమునకు /చేతనవంతులుగా మార్చుటకు ఆంతర్యములో జరిగిన ప్రయత్నమును వివరించినారు.
ప్రస్తుత పాశురములో శివనోమునకు సిధ్ధపడుచున్న చెలులు తమోనిద్రను వీ డి జాగరూకులుగా నున్నవారే. భగవదనుగ్రహమును భక్తితో పొందగోరుచున్నవారే. దానికి కావలిసిన /చేయవలసిన కార్యాచరణమును అన్వేషించుచున్నవారే..
" శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం "
అను తొమ్మింటిని భగవదనుగ్రహ ప్రాప్తికి సోపానములైన నవవిధభక్తి మార్గములుగా పెద్దలు చెబుతారు .
అదేవిధముగా భక్తి-జ్ఞాన-కర్మ యోగములను భగవంతుని అనుగ్రహ ప్రాప్తికి అనుసరించవలసిన మార్గములుగాను వివరిస్తారు.
సామాన్య ఉపాధి భగవదనుగ్రహ ప్రాప్తికి స్వయసమర్థముకాదు కనుక అది ,దానిని అందించగల ఉపకరణములపై ఆధారపడుట సహజము.
కాని నిశితముగా పరిశీలిస్తే భక్తి ఒక్కటే భగవంతుని దరిచేర్చగలదను జ్ఞానమును పొండుట ,జ్ఞానము నిర్దేశించిన నియమములను/సత్కర్మలను ఆచరించుట ఒకే ఒక విధానముయొక్క వివిధ దశలు.
అదే విధముగా నవవిధభక్తులును నన్వోన్మేషమైన పరమాత్మ తత్త్వమును అర్థము చేసుకొనుటకు మనము ఎక్కవలసిన నిచ్చెన్ యొక్క తొమ్మిది మెట్లు.
ఏ పదార్థము యొక్క గొప్పదనమును తెలుసుకోవాలంటే దాని వైశాల్యము/పరిమ అణముతో తో పాటు అది చెక్కుచెదరక అలాగే ఉన్నదా లేక మార్పుచెందుతున్నదా అనేది మనము గమనిస్తాము.
అటువంటిది పరమాత్మ తత్త్వమును అర్థము చేసుకోవాలంటే మనకు సాధ్యమేనా ?
అందులోను,
మున్నై పళం పొరుక్కు-
సనాతనమునకెల్ల సనాతనము స్వభావములోనే కాదు,
మున్నై పరం పొరుళై- స్వరూపములోను పురాతనమునకెల్ల పురాతనము.
అంతే కాదు
ఎప్పెట్రియ్ అనె-మా పరిపాలకా /ప్రభువా
నీ లీలా విశేషములను తెలిసికొనవలెనన్న ,
శీరడియార్-పరమ భక్తాగ్రేసరుల అడుగుజాడలలో నడిచే ,వారిని సేవించే సద్బుధ్ధిని ప్రసాదించు.
నృసిమ్హకవి కృష్ణసతకములో చెప్పినట్లు,
నీ పాద కమలసేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును కనుక
మాకు నీవు అనుగ్రహించితే,
వారిని,పోతనామాత్యులు చెప్పునట్లు,
" తను హృద్భాషల సఖ్యమున్,శ్రవనమున్,దాసత్వమున్,వందనార్చనముల్ ,సేవయున్,అత్మలో ఎరుకయున్ మొదలగు విధానముల ద్వారా అనుసరించి,వారు నడిచిన మార్గములో/వారి అడుగుజాడలలో నడుచుటకు ప్రయత్నించెదము.
వారిని ఆశ్రయన భక్తితో,
అణ్ అవరె- నా తండ్రి
అణ్-కణవర్-నా భర్త
అన్ అవర్-నా పాలకా
అవర్-నీవర్ ఉగందు-అన్నీ అంటూ
శరణాగతితో వారిని,
శొన్న పరిశె-మార్గదర్శకులుగా మన్ననతో మార్గదర్శకులుగా గౌరవిస్తూ,
ఉన్నడియార్ తొళుంబాయ్-నీ పాద దాసులకు,పాద దాసులమవుతాము.
ఎందుకంటే,
మున్నైపళళ్-మున్నై పరం సనాతనము-అధునాతనము మాత్రమే నీ స్వరూప-స్వభావములు కావు.వాటి మధ్యలో వచ్చి చేరుచున్న ,
పిన్నై పుదు మైక్కం -అప్పటికి కొత్తవిగా అనిపిస్తూ,తిరుగుతున్న కాలముతో పాటుగా పాతవైపోతున్న సకల స్వరూప-స్వభావములు నీవే కనుక,మేము నిన్ను,నీ మహత్వమును అర్థము చేసికొనుటకు,
యం కింకోణ్-మా ప్రభువా,నీవు మాకు
నల్గుదియేల్-ఒక వరమును ప్రసాదించు.
అది ఏమిటంటే, మాకు
ఉన్నడియార్-నీ పాదభక్తులు కనుక
తాల్పణివో-తారసపడితే,వారిని గుర్తించి
వారి పాదములను/పాద ముద్రలను ,
గురుతులను గురువులుగా భావించి,
అంగ అవర్కు-వారిని మాకు
పాంగావో-స్నేహితులుగా,మా సంరక్షకులుగా చేయి.
వారిని గుర్తించి-సేవించుతకు మా అజ్ఞానమును అడ్డురానీయక తొలగించు.
మీ నీకృపాకటాక్షమునకు నిదర్శనముగా నీ నిజభక్తుల పాదసేనమును పొందకలిగా మంటే ,
ఇంక మాకు,
ఎన్న కురియుం ఇలో-ఇంకేమి కోరికలు లేవు నిన్ను అదుగుటకు.
ఎందుకంతే మహాత్ముల దర్శనము/సేవనము మహాదైశ్వర్యప్రదము అని మున్ను ఎందరి చరితలో వినియున్నాము.
సాక్షాత్తు నందకము తానై జనించిన అన్నమయ్య -నరసింగభూపతికి సన్మార్గమును అందించలేదా!
గోపన్న తానీషాకు రామలక్షణ సందర్శనా భాగ్యమును కలుగచేయలేదా.devaaSraya manDapamuloe A Anavaayitee ippaTiki konasaagutowmdi kadaa.
ఆదిశంకరులు భజగోవింద శ్లోకములో
చెబుతున్నట్లు
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః.
అన్న సత్యమును గ్రహించి శివనోము నోచుటకు కదులుచున్నారు.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment