aitvamu-ta vattu
************
manamu achchu hallutoe kalisi aksharamugaa maarunapuDu tana roopamunu snuguNamugaa maarchukonunani telisikonnaamu.adae vidhamugaa hallukooDaa varokahallupakkana laedaa adae hallupakkana vachhu samayamuna tana roopamunu chaalaavaraku maarchukoni ottugaa piluvabaDuchu padanirmaaNamunaku sahaayapaDunu.
amduloe anni hallulu okae niyamamunu paaTimchavu.
konnimoDivi.roopamunu maarchuTaku asalu ishTapaDavu kaani sahaayamunu kaadanavu.
marikonni madhyaemaargamugaa paina talakaTtuni teesiyaeyaDaaniki uppukunTaayi.
mooDoerakamu hallu tyaagamoortulu.tama unikini kaapaaDukunToo roopamunu poortigaa maarchukunTaayi.
ta aksharamu moodava rakamunaku chemdinadi.kanuka tana ottu roopamunu poortigaa maarchukundi.kaani ikkaDa manaku oka samasya vachchimdi .yathaalaapamugaa choostae aitvamu vale kanapaDutumdi.kaani aitvamupraarambhamuloe vampu tirigi umTumdi.ta vattu chivaraloe vampu tirigi umTumdi.kanuka manaku jaagarookata chaalaa avasaramu.
ఐత్వము-త వత్తు
************
మనము అచ్చు హల్లుతో కలిసి అక్షరముగా మారునపుడు తన రూపమును స్నుగుణముగా మార్చుకొనునని తెలిసికొన్నాము.అదే విధముగా హల్లుకూడా వరొకహల్లుపక్కన లేదా అదే హల్లుపక్కన వచ్హు సమయమున తన రూపమును చాలావరకు మార్చుకొని ఒత్తుగా పిలువబడుచు పదనిర్మాణమునకు సహాయపడును.
అందులో అన్ని హల్లులు ఒకే నియమమును పాటించవు.
కొన్నిమొడివి.రూపమును మార్చుటకు అసలు ఇష్టపడవు కాని సహాయమును కాదనవు.
మరికొన్ని మధ్యేమార్గముగా పైన తలకట్తుని తీసియేయడానికి ఒప్పుకుంటాయి.
మూడోరకము హల్లు త్యాగమూర్తులు.తమ ఉనికిని కాపాడుకుంటూ రూపమును పూర్తిగా మార్చుకుంటాయి.
త అక్షరము మూదవ రకమునకు చెందినది.కనుక తన ఒత్తు రూపమును పూర్తిగా మార్చుకుంది.కాని ఇక్కడ మనకు ఒక సమస్య వచ్చింది .యథాలాపముగా చూస్తే ఐత్వము వలె కనపడుతుంది.కాని ఐత్వముప్రారంభములో వంపు తిరిగి ఉంటుంది.త వత్తు చివరలో వంపు తిరిగి ఉంటుంది.కనుక మనకు జాగరూకత చాలా అవసరము.
No comments:
Post a Comment