Friday, May 6, 2022

అమ్మ స్వగతం


 


  అమ్మ స్వగతం

  **********

 ముద్దుగుమ్మ కాదు అమ్మ (నేడు)

 మొద్దుబారిన రాతి బొమ్మ

 విరిగిన తన రెక్కచూసి

 ఎగురలేని తనము తెలిసి


 ఎవరికి చెబుతుంది అమ్మ

 ఏమని చెబుతుందమ్మా?


 నిట్టూర్పుతో సాగింది నిశితో

 తన పయనము

 నిశివెనుక వెలుగే వస్తుందని

 వేకువమ్మ చెప్పింది తాకుతూ

 ఆ అమ్మను.

 పట్టుదలతో సాగింది నెట్టూతూ

 తన పయనము

 శిశిరములో ఉన్నావు వసంతమేవస్తుందని

 చెట్టుతల్లిచెప్పింది గట్టిగా 

 ఆ అమ్మకు

 ఎండమావితో సాగింది మొండిగా

 తన పయనము

 ఎండవెనుక తప్పక వెన్నెలమ్మ వస్తుందని

 జాబిలమ్మ చెప్పింది జాలిగా

 ఆ అమ్మకు

 కలికాలముతో సాగింది కన్నీళ్ళతో

 తనపయనము

 వాన వెనుక తప్పక హరివిల్లే వస్తుందని

 అంబుదమే చెప్పింది వంధువుగా

 ఆ అమ్మకు

 నిత్యమైన ప్రకృతి సత్యమైన పలుకులు విని,

  అదరదు శోకాగమనమునకు

 అమ్మ ఆపదు తనగమనాన్ని.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...