ముక్కోటి దేవతలు మెచ్చిన నిచ్చెనరా
"కొనగలవా అమ్మను" కోట్లను వెచ్చించి
ఆశ్చర్యమున మనము అమ్మనే తలుస్తాము
" అమ్మ బాబోయ్" అంటూ ఉద్వేగం తోడుగా
ఆనతి కాదనలేక అమ్మనే తలుస్తాము
"అమ్మమ్మ ఎంతమాట" అంటూనే ఉంటాము
ఆటపాటలలోను అమ్మనే తలుస్తాము
"అమ్మదొంగ" అంటు అల్లారు ముద్దుగా
ఆటవిడుపు సమయములో అమ్మనే తలుస్తాము
"అమ్మయ్య "అంటూ మనకమ్మని పలుకులతో
ఆక్రందనలోను అమ్మనే తలుస్తాము
"అమ్మా "అని అంటూ అప్రయత్నం గానే
అనవసరపు మాటలలో అమ్మనే తలుస్తాము
"అమ్మలక్క" కబురులు బహు కమ్మగ ఉంటాయంటు
ఆకలిలోను మనము అమ్మనే తలుస్తాము
అడగనిదే" అమ్మైనా" పెట్టదని అంటూ
అన్నిభావాలలో అపరంజిగ దాగినది
సప్తస్వర శోభిత "తప్తకాంచనముర అమ్మ"
తళతళలతో కళలెన్నడు తరగని జాబిల్లి
"అమ్మ కానిదేది లేదు" ఇది కమ్మని నిజము
అమ్మ "అమ్మకానికే లేదు" ఇది త్రిభువన విజయము.
" మా అమ్మ సీతమ్మ పావన పాద పద్మములకు ప్రణామములతో-సుబ్బలక్ష్మి.
No comments:
Post a Comment