నిత్యామండలము
*************
ఉత్పత్తి-నాశనములేని లేని శక్తి నిత్య.స్థిరమైన/శాశ్వతమైన శక్తి.అటువంటి శక్తి తాను మాత్రము స్థిరముగా ఉంటూనే,తననుండి పదిహేను శక్తులను ప్రకటింపచేసి,వానిని చలింపచేస్తూ/సూర్యుని నుండి చంద్రుని దగ్గరకు,చంద్రుని నుండి సూర్యుని దగ్గరకు చేరుస్తూ,రోజులను,పక్షములను,మాసములను,సంవత్సరములను ఏర్పాటుచేస్తుంది.
ఈ పదిహేను శక్తులు బిందువు చుట్టు ఉన్న ఊహాత్రికోణములో,ఒక్కొక్క కోనమునకు ఐదు శక్తులు చొప్పున ఉంటాయి.అష్టమి శక్తి అయిన తవరితే మకుటముగా పైన ఉన్న అడ్దకోణము మధ్యలో ఉంటుంది.
కామేశ్వరి-భగమాలిని-నిత్యక్లిన్నే-భేరుండే-వహ్నివాసిని,మహావజ్రేశ్వరి,,శివదూతి,త్వరితే,కులసుందరేన్ నిత్యే,నీలపతాకే,విజయే,సర్వమంగళే,జ్వాలామాలిని,చిత్రే అను పదిహేను శక్తులు మూలశక్తి ఆజ్ఞానుసారముగా,పగటివేళ ప్రకాశముగా,రాత్రులందు విమర్శలుగా ,రాత్రులందు మధువును గ్రహిస్తూ,పగటివేళ మనందరిమీద ప్రసరిస్తూంటాయి.
మిక్కిలి వాత్సల్యముతో ఈ శక్తులు సూర్యచంద్రుల సమసప్తక స్థితికి,(పౌర్ణమి) సూర్యచంద్రుల సమాగమనమునకు (అమావాస్య)కు కారణమగుచున్నాయి.
ఈ పదహారుశక్తుల అనుగ్రహమే అక్షరములుగా అమ్మ మాతృకావర్ణరూపిణిగా స్తుతింపబడుతోంది.
తత్త్వపరముగా పరిశీలిస్తే,సాధకుని సంకల్పము కామేశ్వర శక్తిగా,ప్రారంభమయి,భగమాలిని ఆ సంకల్పమునకు ఊతమునిస్తుంటే,నిత్యక్లిన్నే సాధకుని సంకల్పముతో నిమగ్నుని చేస్తున్నది.భేరుండే శక్తి అడ్డంకులనే విషమును తొలగించివేస్తుంది.అనుగుణముగా అదననుకొని వహ్నివాసిని సాధకుని సంకల్పమును తేజోవంతము చేస్తుముంది.చీకట్లను పారదోలుతుంటుంది.వజ్ఞివాసిని చిగురింపచేసిన ఆశారేఖయను జ్యోతిని ప్రజ్వరింపచేయుటకు వజ్రేశ్వరి సాధనలోని తీవ్రతను ఇనుమడింపచేస్తుంది.
శివదూతి సాధకుని సాధనను సాధ్యము దిశగా మళ్ళిస్తుంటుంది.
మకుటాయమానమైఅ త్వరితే శక్తి సాధనను సుగమము చేస్తుంటుంది.తత్ఫలితముగా కులసుందరి సుష్మ్న నాదీ ద్వారా కుండలిని ప్రయాణమునకు సహకరిస్తూ,నిత్య శక్తిని పరిచయముచేస్తే,నిత్యశక్తి చీకట్లను విడనాడే శక్తినిచ్చే నీలపతాకే అనుగ్రహమునకు సాధకుని చేరుస్తుంది.
అంతర్యాగము ప్రారంభమై,విజయదిశగా పరుగులుతీయిస్తుంది సక్షాత్తు విజయ నిత్య.దాని మజిలియే కదా సర్వమంగళ సందర్శనము.సర్వశుభంకరము.లీలామాత్రపు వెలుగురేఖ శక్తిని పుంజుకుని జ్వాలామాలిని అయిన చిద్రూపిణిని దర్శింపచేస్తుంది.అమ్మదర్శనము-అనుగ్రహము ముళితమైన వేళ చిద్రూపమే చిద్విలాసముగా చిత్తము నిండినవేళ చిత్రే నీకు వందనము.
అమ్మ నాలోని చిత్తవృత్తుల ప్రవృత్తులు తొలగి శాంతము మూర్తీభవించిన శుభవేళ శతకోటి నమస్కారములు.
No comments:
Post a Comment