"శివ ఏవ గురుః సాక్షాత్ గురుః ఏవ శివః స్వయం."
బిందువు,బిందువు చుట్టు ఊహాత్రికోనములో నిత్యాశక్తులు,ఆ త్రికోనముచుట్టునున్న ఊహా వృత్తమును గురుమండలముగా భావించి శాక్త్యేలు ఆరాధిస్తారు.
కొందరి అభిప్రాయము ప్రకారము గురుమండలము దక్షిణామూర్తితో ప్రారంభింపబడి నారాయణుడు,బ్రహ్మ,సాకాదులు,శంకరాచార్యులు శిష్యులతో అలరారుతుంది.
గురుప్రియ గురుమూర్తి రెండుతానై గురుమండలరూపిణిగా విరాజిల్లుతున్న సర్వశక్తియే దక్షిణ అవ్యక్త-మూర్తిగా వ్యక్త మూర్తిగా ఆరాధింపబడుతున్నది.
ఒకవిధముగా చెప్పాలంటే గురుసంప్రదాయమే గురుమండలము.గురుమూర్తి యొక్క ఇచ్చాశక్తియే గురుప్రియగా ప్రకటింపబడుతున్నది.
గురుమండలము దివౌఘ,సిధ్ధౌఘ,మానవైఘులుగా విభజింపబడి విరాజిల్లుచున్నది.
శాక్తేయ సంప్రదాయము ప్రకారము త్రిమూర్తులను దివౌఘులుగా,
"గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అని సన్నుతిసున్నాము.
సనకాది మునులను సదా విరాజిల్లే గురువులుగా కీర్తిస్తున్నాము
పీఠాధిపతులైన గురువులను మానవౌఘ గురువులుగా దర్శించి సన్నుతిస్తున్నాము.
పైన వివరించిన మూడు వర్గముల గురువులు మార్గదర్శకులే.సాధకుని అర్హత ఔభవము అధ్యనము వారి తత్త్వమును అర్థముచేసుకునేలా చేస్తుంది.
మరికొందరి అభిప్రాయము ప్రకారము వీరందరు సౌరశక్తి సంపన్న శక్తి సంకేతములు.
No comments:
Post a Comment