స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్చతురః
కథం రాజ్నాం ప్రీతి ర్భవతి మయి కో2హం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో
సర్వస్య శరణాగతిని సూచిస్తున్నారు ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో.
చతుషష్ట్యుపచారాఢ్యా-చతుషష్టి కళామయి
అని అమ్మవారిని సంకీర్తిస్తున్నది లలితాసహస్రనామము.
షోడశ కళానిధికి షోడశోపచారములు అని సంకీర్తించి తరించాడు అన్నమయ్య.
నాల్గవ శ్లోకములో ఆదిశంకరులు విబుధా క్షుద్రఫలదా న మనయె-అని సాకారులైన విబుధులు/దేవతలు అనంతముగా నున్నప్పటికిని,నేను కలలోనైన వారిని సేవించి,వారనుగ్రహమునకై పాకులాడను అన్నారు.
ఆ విషయమును సమర్థిస్తూ దానికి కారణము తన పశుత్వమే అంటున్నారు.
ఓ సర్జ-సమస్తము నీవైన శంభో
నను-పశుం మ
' పశ్యతీతి పశుః' చూడగలుగునది పశువు.కాని చూసినదాని మర్మమును మనసులో ముద్రించుకొనలేనిది.చూసినదృశ్యమును అర్థము చేసుకొనలేని అసమర్థ ను రక్షించగలిగినది కేవలము పశుపతి మాత్రమే.
ఎందుకంటే స్వస్వరూపమును అర్థముచేసుకొనలేని,సకల్శాస్త్ర పరిజ్ఞానముతో వాటిని అనగా శృతి-స్మృతి-పురాణ-సకల కళల సారమును సమన్వయ పరచుకోలేని,నీ సర్వజ్ఞత్వమును సంస్తుతించలేని,సదా అరిషడ్వర్గముల ప్రలోభమునకు వశుడనై మానవత్వమును గుర్తించలేని నన్ను ఏ రాజులు ఆదరిస్తారు.ఒకవేళ నేను ఆశ్రయించినా వారిని సంతుషుష్టపరచగల నిస్సారమైన పాండిత్యము ,
పణతౌ-ప్రశంసాపూర్వకముగా మాట్లాడుట
వారికి పలురంగములలో కల ప్రావీణ్యమును పొగడలేని నా ప్రవర్తన
కథం-ఏ విధముగా
రాజ్ఞాం-రాజులకు
మయిం- నామీద
ప్రీతిః భవతి-ఇష్టము ఏర్పడుతుంది?
మనము కనుక నిశితముగా గమనిస్తే ఆదిశంకరులు ఇప్పటికే అనేకానేక అమృతగుళికలను అందించియున్నారు.కనుక బాహ్యార్థము రాజుల ఆశ్రయధిక్కారమును సూచిస్తున్నప్పటికిని,నన్ను నేను,నాలో ఉన్న నిన్ను తెలుపగలవారు పశుపతే నీవు తప్ప వేరెవరు గలరు?
స్వస్వరూప దర్శనమును అనుగ్రహించమని దానికి కావలిసిన అర్హత కవలము సర్వస్య శరణాగతి మాత్రమే నని విన్నవించుకుంటున్నారు.మనలను సైతము విన్నవించుకోమంటున్నారు.
సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment