సహస్రం వర్తంతే జగతి విబుధాః క్శుద్ర-ఫలదా
న మన్యే స్వప్నే వా తద్-అనుసరణం తత్-కృత-ఫలంహరి-బ్రహ్మాదీనాం-అపి నికట-భాజాం-అసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ-భజనం
మూడవ శ్లోకములో వేదములను పరతత్త్వమును తెలుసుకొనుటకు సాధకములుగా చూపించిన శ్రీ శంకరులు ప్రస్తుత శ్లోకములో జీవి వస్థలయొక్క ప్రభావమును,మనము కోరుకోవలసిన/చేరుకొవలసిన తురీయమును గురించి,న మన్యే స్వప్నేవా అంటూ స్వప్నావస్థలో సైతము కోరుకోను/కలలోనైనా ఊహించను ప్రభో అని మనలను చైతన్యవంతులను చేస్తున్నారు.
ఎందుకంటే మనకు కావలిసినది అతి దగ్గరగా ఉండి సేవిస్తున్న హరి,బ్రహ్మ,ఇంద్రాదులకు సైతము సులభము కానిది.
వారికి లభ్యము కాని తురీయస్థితి కేవలము నీచే మాత్రమే పొందగలిగిన దానిని అనుగ్రహించగలవారెవరు కలరు?
ఒకవేళ బుధులు అనుగ్రహించదలచినను అవి శాశ్వతానందమునీయగల సామర్థ్యమును కలిగియుండలేవు.
కనుక విభో నేను కోరుకునేది నీ పాదపద్మ నిత్య సంసేవనము.దానికి నన్ను నేనెట్లు మలచుకోవలెనో తెలియచేయుము కరుణతో అని ప్రార్థిస్తున్నారు.
స్వప్నావస్థలోనైనా కోరుకోను వారిని(విబుధులను/దేవతలను) అదియును అనేకానేకములుగా నున్న వారిని అన్నది ఒక్క విషయము.
సాధకుడు అవి కాదని దేనిని కోరుకుంటున్నాడు అంటే సదా తవ పదసేవనం.దానికి కావలిసినది తురీయావస్థ.
జాగ్రత్ స్వప్న సుషుప్తులలో రెండవస్థి స్వప్నస్థితి.
ఇందులో నిజమునకు మూసి ఉన్న కన్ను సకలమును చూస్తుంటుంది.నూతనమైన వాటిని కూడా వెక్షించి అనుభవిస్తుంటుంది.మూసి ఉన్న పెదవులు తెరచుకొని మాట్లాడుతుంటాయి.ఎన్నో సువాసనలను ముక్కు ఆఘ్రాణిస్తుంటుంది.
నిద్రాణమై యున్న ఇంద్రియములు జాగృతమై యున్న మనసు సాయముతో ఒక వింత అనుభూతికి లోనవుతుంటాయి.మెలకువ వస్తే అంతా హుళక్కియే.స్వప్నము ఎంత అసత్యమో అనేకానేక రూపములతో నున్న ఒకే శక్తి తత్త్వమును గ్రహించలేని మనము చేయు వారికై చేయు తపములు,అందులకు మెచ్చి వారిచ్చు వరములు సైతము హుళక్కియే.
వానిని కోరుకుని ఏమిప్రయోజనము?
మీ పాదసంసేవనా భాగ్యమును ఆశించు నా మది ఆ మూడు అవస్థలను దాటి తురీయస్థితికి చేరినప్పుదే అది సాధ్యము.
నిజమునకు స్వప్నావస్థ పెద్దలు గాఢనిద్రలో నున్నప్పుడు,మెలకువతో నున్న పిల్లలు చేయు అల్లరికదా.
సమస్తము సత్వమయమై నిశ్చస్థితికి చేరుకున్న చైతన్యము మాత్రమే నిన్ను గుర్తించి,సేవించగలదు కనుక
హే శంభో-ఓ శుభకరుడా
హే శివా-శాశ్వతానమును ప్రసాదించుస్వామి,
విబుధా వర్తతే సహస్రః-అనేకానే విబుధులు/దేవతలు ఉన్నప్పటికిని,
వారిని సేవించి,వారిచ్చు వరములను కోరక
నా మనస్సు స్థిరముగా
తవ పాదాంభోజ భజనం
మీ పాదపద్మములను సేవించుటకై
చిరం యాచే- ఎదురుచూచుచున్నది.
No comments:
Post a Comment