Sunday, October 2, 2022

PAAHIMAAM PARAMESVARI-PRANATOSMI SADAAMAHAM.


 పాహిమాం పరమానుగ్రదాయిని పరమేశ్వరి
 ******************************
 " ధ్యాయేత్ కాళీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం
   చతుర్భుజాం లలజ్జిహ్వం పూర్ణచంద్రనిభాననాం
   నీలోత్పలదళ శ్యామాం శత్రుసంఘవిదారిణీం
   నరముందం తథాఖడ్గం కమలంచ వరంతథా."

 అంటు సుమేథ మహర్షి సూరథ-సమాథులకు ఈ విధముగా చెప్పసాగెను.
 " ఏభిఃహతైజగదుపైతి సుఖం తథైతే
   కుర్వంతునామ నరకాయ చిరాయ పాపం
   సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు
   మత్వేతి సూనమహితాన్ వినిహంసి దేవి"

   అసురులందరు పాపములను చేయుచు ఫలితముగా నరకమునకు పోవలసిన వారలే అయినను తల్లి వారిని తన కరుణతో పుణ్యలోకప్రాప్తిని కలిగించుటకా యన్నట్లు,
 ఆ రణభూమిలో
 బ్రహ్మాణి తన కమందలములోని జలమును చున్నది.రాక్షబలమును/రాక్షస గణములను/గుణములను తగ్గించుచున్నది.మాహేశ్వరి త్రిశూలముతోను,వైష్ణవి చక్రముతోను,కౌమారి శక్తితోను,ఐంద్రి వజ్రాయుధముతోను,తమ విధులను నిర్వర్తించుచుండగా,
 ప్రక్షిప్తము-నిక్షిప్తము తన కనుసన్నలైన అంబిక 
 రక్తబీజుని వెటకారమునకు సమాధానముగా సప్తమాతృకలను నిక్షిప్తము చేసుకొనినది.
 అనేకానేక రక్తబీజులను యుద్ధరంగమున గమనించిన దేవతలు ఖిన్నులైనారు.వారిని చూసి చండిక,
; ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు"
 కాళి నీ ముఖమును విస్తరింపచేసి నాలుకను చాపి ఈ అసురుని శరీరమునుండి నేలజారు రక్తమును గ్రహింపుము.వీనిని నిర్వీర్యుని చేయుము అని కాళిని ఆజ్ఞాపించినది.
 యోగశాస్త్ర ప్రకారము మన అనాహతచక్రస్థానము ఈ రక్తబీజుడు.దానిని శుద్ధిపరచే చైతన్యమే కాళిక.
  రక్తము అను పదమునకు అనురక్తి అను అర్థమునుకూడా పెద్దలు అన్వయిస్తారు.
 అమ్మవారిది అనురక్తి సంగరమునకు ఒకవైపు.
 రక్తబీజుని అణగని అసురత్వము మరొకవైపు.
  రక్తహీనమును కావలెన్న రక్తపానము దక్క మరొకదారిలేదు.

 కలుషిత రక్తము హానికరము కనుక నిర్మూలనము అవశ్యము.
  చండిక కాళితో నీవు రణరంగమున తిరుగుచు,నా శస్త్రపుదెబ్బలతో పుట్టుచున్న రక్తమును త్రాగుచు,వారిని నమిలివేయుము.వారు తిరిగి పుట్టలేరు.అనగానే కాళి అమలుచేస్తున్నది చండిక.
అంటే వారిని పునరావృత్త రహితులని చేస్తున్నది కాళి కరుణ.
"జఘాన రక్తబీజం తం చాముండా పీతశోణితం"
  పాపములను రక్తమును అమ్మ దయచే పరిహరించుకొనిన రక్తబీజుడు,నిర్వీర్యుడై,పెక్కుశస్త్రములచే బాధింపపడి నేలకొరిగెను.
 చెవివాని చెవిని శంఖనాదము చేరలదన్న విధమున శంభుని శ్రేయస్కర మాటలు శుంభ/నిశుంభులకు మరింత యుద్ధానురక్తిని కలిగించినవి.
" అజగామ మహావీర్యః శుంభోపి స్వబలైవృతః
  నిహంతుం చండికాం కోపాత్కృత్వా యుద్ధంతు మాతృభిః"
   శుంభుడు తన సేనలన్నింటిని కూడదీసుకుని,చండికతోను,మాతలతోను యుద్ధమొనరించి వధించుటకు బయలుదేరినాడు.
    దేవికిని-శుంభనిశుంభులకును పొరులొర్ మేఘములు వర్షించుచున్నట్లు బానములు వర్షించుచుండెను.
 నిశుంభుడు దేవిపై,కత్తిని,గదను,డాలును,విసరగా దేవి వాటిని తుత్తునియలుచేసి,వాడిని మూర్ఛిల్ల చేసినది.
  అది చూసిన శుంభుడు,
సరస్థస్తధాత్యుచ్చైః గృహీత పరమాయుధైః
భుజైః అష్టాభిః అతులైః వ్యాప్యాశేషం బభౌ నభః"
   శుంభుడు రథముపైనెక్కి,పొడగాటిఎనిమిది భుజములతో ఉత్తమాయుధములను ధరించి,ఆకాసమంతటను వ్యాపించి వెలెగెను.
  ఇక్కడ రథమును ఊతగా తీసుకుని శుంభుడు పైకెగిరి ఆకసమంతయు వ్యాపించుచున్నాడు.ఒక విధముగా వాడి ఉపాధియే వాడి రథము.దానికి తోడుగా ఎనిమిది దిక్కులా వ్యాపించియున్న ఎనిమిది భుజముల తమోగుణము.అమ్మ వాని అజ్ఞానమును నరికివేసికొనుటకు బుద్ధి విచక్షన మొదలగు ఆయుధములను వాడి చేతియందుంచినది.కనుగొనలేని అసురభావన భాసురముమీద వానిని ప్రయోగించవలెన్నని తహతహలాడుచున్నది.
   తమసోమ జ్యోతిర్గమయ చీకట్లను పారద్రోలవలెన్న వెలుతురు వేగమును పెంచవలసినదే అన్నట్లుగా
 దేవి,
 "తతః కాళీ సముత్పత్య గగనం క్ష్మామతాదయత్
  కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహితాః"
    అంతట కాళి రివ్వుమని( ఏ సహాయము లేకుండా) ఆకాసమునకెగిరి,తన చేతులతో భూమిపై గట్టిగా తట్టెను.అంతకు ముందున్న శబ్దముల సద్దుమణిగెను.

  నిరాధారమునకు-సర్వాధారమునకు జరుగుచున్న యుద్ధములో తరువాత ఏమిజరుగనుందో వచ్చేభాగములో తెలుసుకుందాము తల్లికరుణతో.
 సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు
.
 
 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...