Tuesday, December 20, 2022

AALO REMBAAVAAY-06

 



 ఆరవ పాశురం.


*************

 ఆండాళ్ తల్లికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, అనుగ్రహించినంత మేరకు మేల్కొలుపుల ప్రారంభ పాశురమైన ఆరవ పాశురమును అనుసంధానము చేసే ప్రయత్నమును చేసుకుందాము.



పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్


వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?


పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు


కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి


వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై


ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం


మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం


ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.


 వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై

 ***********************



  పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా.

 


   


   మూలవిరాట్టు  దర్శనమునకు ముందు ఆలయ ప్రాకార ప్రదక్షిణము వలె భాగవత గృహ ప్రదక్షిణమును మనతో గోదమ్మ  చేయిస్తున్నది.

  ఇంద్రియములు ప్రకృతిని అనుసంధానముచేసుకుంటే ప్రపంచము.అవే ఇంద్రియములు పరాత్పరుని అనుసంధానము చేసుకోగలిగితే పారమార్థికము.

 ఆ విషయమును మనము సులభముగా గ్రహించుతకై గోదమ్మ "పుళ్ళుం"శబ్దమును ప్రయోగించినది.

 పుళ్ళుం అంటే తెలుగుభాషలో పక్షులు.అనగా పక్షములు/ఱెక్కలు కలవి.

  ఈ పక్షులు చెట్టుమీదగాని/గూటిలోన కాని ఉన్నప్పుడు తమ ఱెక్కలను ముడుచుకొనే ఉంటాయి.అప్పుడు వాటి ఇంద్రియములు తమ జంట-తమ సంతతి,వాటి పోషణము,తమ ఉపాధిని అనుసరించియుంటాయి.అప్పుడు వాటి ఆలోచనా పరిధి పరిమితము.

 కాని విచిత్రము-అవే పక్షులు

 ఆ పక్షులే చెట్టుమీదనుండి ఆహారమునకై ఎగురుట ప్రారంభించగనే వాటి రెండు ఱెక్కలను విస్తరింపచేస్తాయి.వాటితో పాటుగా మరెన్నింటినో కలుపుకొని జట్టుగా 

ఎగురుతుంటాయి.అరుస్తుంటాయి.మురుస్తుంటాయి.

  ఆ సమయములో వాటి ఇంద్రియములు పరమాత్మను అనుసంధానము చేసుకుంటుంటాయి.పదిమందిని కలుపుకుంటుంటాయి.పరస్పర్పము తమ అనుష్టానమును ప్రతిచర్యతో అనుసంధానము చేసుకుంటుంటాయి.అప్పుడు వాటి పరిధి అపరిమితము.

 నిజమునకు రెండుమూడు గింజలను ముక్కున కరచుకొను గ్రక్కున వెనుదిరుగ వచ్చును.కాని దానికి విరుద్ధముగా/విశేషముగా" అవి చెట్టుమీద ఉన్నప్పడు ఉపాధిధర్మముతో-చెట్టుదాటి ఎగురుతున్నప్పుడు ఉపాయ ధర్మములో" స్థిరచిత్తముతో పరమాత్మను 

 సేవించుకుంటాయి.స్వధర్మమును-స్వామి సంసేవనమును నిర్వహించుకుంటాయి.

 ఓ పిళ్ళాయ్-ఓ బాలా!

 పుళ్ళుం శిలంబినకాణ్-తెల్లవారినది పక్షులు కూస్తున్నాయి .లేచి,నోమునకు మాతో రావమ్మా అని పిలుస్తున్నారు.




  లోపలి గోపిక భగవత్ ప్రాశస్త్యమునకు వెలుపలి గోపికలు భాగవత ప్రాశస్త్యమునకు సంకేతములుగా శోభిల్లుచున్నారు.


 ఇంద్రియపరముగా అన్వయించుకుంటే ప్రస్తుత పాశురము శబ్దమును సంగ్రహించలేని,సంకేతించలేని కర్ణేంద్రియమా మేలుకో.స్వామి సంకీర్తనమును ప్రారంభించు అంటున్నారు.ఎటువంటి సమాధానము లభించలేదు వారికి.పైగా మీరు ఉత్సాహముతో చేయుచున్న హరినామసంకీర్తనమునకు పక్షులు నిదురపోలేక లేచినట్లున్నవని లోపలి గోపిక భావించినదేమో అనుకొని వారు మరొక సంకేతమును చెప్పదలిచారు.

 పిళ్ళాయ్-ఓ చిన్నపిల్లా

 పుళ్-అరయన్-పక్షిరాజు స్వామిసేవకై తరలుచున్నాడు.

 అంతే కాదు

 విళిసంగన్ పేరరవం కేట్టిలియో-తెల్లనైన శంఖము చేయున్న ప్రణవనాదము /పేరరవం/ఓంకారమును నీవు వినుటలేదా 

 తెల్లవారుచున్నదనుటకు ఇంతకు మించి నీకు కావలిసిన నిదర్శనమేముంది?

   అయినను  వారికిసమాధానము లభించలేదు.

 మూడవ సంకేతముగా మునివర్గగళుం-యోగిగళుం అంటూ

 మౌనముగా మనము చేయుటయే కాదు-స్వామి కైంకర్యములను సైతము సమర్పించుటకు సిద్ధమగుచున్నారు అన్నారు.ఆ సంకేతము సైతము లోపలనున్న గోపిక అంతర్ముఖత్వమును వీడుటకు సహకరించలేదు.

    పరిస్థితిని గ్రహించిన గోదమ్మ,గోదమ్మతో పాటునున్న గోపికలు స్వామి అద్భుతలీలా విశేషములుగా పూతన సంహారము-శకటాసుర భంజనములను కీర్తించసాగినారు.



     స్వామి పేయ్ములై నంజుండు-అహంకార-మమకారములను స్తనములనుండి స్రవించుచున్న విషయవాసనలను పాలను పూర్తిగా తొలగించి,పూతనను అనుగ్రహించినాడు.అంతే కాదు

 కళ్ళచ్చగడం కాలోచ్చి-

  సంసారమనే చక్రములో నిరంతరము పరిభ్రమించు శకటాసురుని,కాలోచ్చి-కాలితో తన్నివేసి కనికరించినాడు.

 స్వామి గుణవైభవమును-రూప వైశిష్ట్యమును వినినంతనే తాను మెల్లగలేచివచ్చి వారితో పాటుగా మరొక గోపికను మేల్కొలుపుటకు కదులుచున్నది. 

బాల అంటే గ్రహణ-ధారణ-పోషక శక్తివంతురాలు.

 ఆళ్వారుల అన్వయములో వ్రతమునకు తమను తీసుకొనివెళ్ళి,నిర్వర్తింపచేయు మార్గదర్శకులిగా వారు,


అంతర్ముఖములోని నిశ్శబ్దము-బహిర్ముఖములో శబ్దము రెండును స్వామి వైభవముగా అన్వయించుకుంటూ కదులుతున్నారు.



ఇప్పుడు అంతా అద్భుతమే-అమృతత్వమే.

 గోపిక చేతితో పాటుగా మన చేతిని సైతము విడువక పట్టుకుని రెండవగోపికను మేల్కొలుపటకు వెళ్ళుచున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.






No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...