Wednesday, December 21, 2022

AALO REMBAAVAAY-07

 


   పాశురము-07

   **********

 గోదమ్మకు అనేకానేక దాసోహములను  సమర్పించుకుంటు.అనుగ్రహించినంత మేరకు అనుసంధానమును చేసుకుందాము. 


కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు

పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే

కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు

వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్

ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో?

నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి

కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో

దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.

 నారాయామంత్రం-శ్రీమన్నారాయణ భజనం.

 ******************************

    ఓ కర్ణేంద్రియమా జాగృతము అయ్యి శ్రవణభక్తిని ఆచరించి ఆస్వాదించు పరమాత్మ ప్రసన్నతను అంటూ ఆరవ పాశురములో చెప్పినట్టుగానే,

 కేట్టిలియో?-వినలేదా అని లోపలనున్న గోపికను ప్రశ్నించుచున్నది.

 ప్రస్తుత పాశురములో నాసికను సైతము జాగృతముకమ్మని 

 ఆయిచ్చ్నర్ వాసనరుం కుళల్

  గొల్లపడుచుల సుగంధకేశపాశముల పరిమళములను ఆస్వాదించుము అని మరొక ఇంద్రియ ప్రస్తావన తెచ్చినది.

 నారాయణమూర్తి కేసవనై-పాదవుం

 అంటూ వాక్కును సైతము హెచ్చరించినది.


 నిదురించుచున్న వారికి నిద్రాభంగము చేయుట సంప్రదాయమేనా అన్న సందేహము మనలో కలుగవచ్చును.కాని గోదమ్మ మేల్కొలుచున్న గోపికలు,

 తమోనిద్రను వీడి తాదాత్మ్యములో నున్నవారు కొందరు,తన మదిలోని స్వామిని సేవించువారు మరికొందరు,తన్మయములో నున్న కొందరు,తలపు మార్చుకొనుటకు ఇష్టపడనివారు కొందరు,తలుపుతీయుటకు ఇష్టపడని వారు ఇంకొందరు,తనవాడేనని తనతోనే ఉండాలనే వారు కొందరు,తనివితీరని తాదాత్మ్యముతో పరిసరములను పట్టించుకోని వారు ఇలా వివిధ భావములతో,భంగిమలతో,అనుభవములతో .....

  

వీరిలో ఎవరు ఎక్కవభక్తికలవారో-ఎంతటి భాగ్యశాలురో చెప్పుట సాధ్యము కానిది.


నిద్రిస్తున్న వారిది పారవశ్యము.

మేల్కొలుపు వారిది ప్రాప్తి  త్వరిత్వము.


వారందరును భగవదనుగ్రహమును పొందినవారే.


 ప్రస్తుత పాశురములో గోదమ్మ గోపికను 

 పేయ్ పిణ్ణే అని సంబోధించినది.ఈమె పిళ్ళాయ్ కాదు.సామాన్య ఉపమానములను సమన్వయించుకోదు.అంతే కాదు

 నాయగన్ పెంపెణ్ణే నాయకత్వ లక్షనములు గల పరమభక్తురాలు.

 కనుకనే గోదమ్మ భారద్వాజ పక్షుల పేరరవమును ఉదహరించింది.

 ఏమిటా పేరరవము?

 ఓం నమో భగవతే వాశుదేవాయ/పెద్ద పేరు.

" అధ్యయనము ఎంత ముఖ్యమో దానిని ఆచరించుట అంతకన్నా ముఖ్యము" అన్న విషయమును నిగూఢముగా భారద్వాజపక్షుల ఉపమానముతో చెప్పినది.

 ఒక చిన్ని ఉదాహరణమును పెద్దలు చెబుతారు.ఒకసారి భారద్వాజ మహాముని బ్రహ్మవరముగా తన ఆయుర్దాయమును పొడిగించుకుంటూ వేదాధ్యయనమును కొనసాగించాడట.తనకు ప్రాప్తించిన శక్తులతో శ్రీరామ రాజోలగమును సృష్టించి భరతుని వచ్చి ఆసీనుని కమ్మన్నాడట.ఏమాత్రము చలించక భరతుడు వచ్చి మంత్రికి ఏర్పరచిన సింహానముపై కూర్చున్నాదట.తాను చేయవలసిన కర్తవ్యమును గ్రహించి ఆచరణ వైభవమును చాటాదట భరద్వాజ మహాముని.అదియే పేరరవం.

 లోపలి గోపిక అంతర్ముఖమును వీడక మీరుచేయుచున్న కృష్ణ కృష్ణ అను శబ్దము మీకు కీశు కీశుగా వినిపిస్తున్నదంతే అని బదులిచ్చినది.

 గోపికను బహిర్ముఖిని చేయుటకై గోదమ్మ "మత్తినాల్ తైరరవం" అంటూ పెరుగుచిలుకు గొల్లెతల కవ్వముతో పెరుగుచిలుకు చప్పుడును సంకేతించినది.ఇది తనదగ్గర-తన ఇంట్లో -తన నిత్యానుష్ఠానముగా జరుగుచున్న ప్రక్రియ.

రేపల్లె లోని గోపికలకు చల్లచిలుకుట నిత్యానుష్ఠానము.


వారికి కడవ-కడవ లోని పెరుగు-దానిని చిలుకుటకు పట్తుకున్న కవ్వము-కవ్వమునకు కట్టిన తాడు-దానిని పట్టుకుని చిలుకుతున్న వారి చేతులు,అప్పుడు వారు చేయు కీర్తనలు/జానపదములు అంతా హరిరూపమే/హరి నామమే/హరిమయమే.త్రికరనములలో హరినిండి,వారి కంకణములద్వారా కాయకముగా-కాసుల గులుసుద్వారా మానసికముగాను-పెదవులద్వారా మానసికముగా నర్తిస్తున్నాదట.అంతే కాదు 

 గోదమ్మ కాసుం పిరప్పు అని హారములను గుంద్రముగా నుండి తిరుగుచున్నవి అని ప్రత్యేకించి చెప్పినది.అనగా హరినామస్మరనముతో తనివితీరక గోపికలు పదేపదే పరవశిస్తూ చేస్తున్నారు.

 ఇది వాచ్యార్థము.

 కావాలంటే కన్నులు తెరిచి చూడు.


వారు కృష్ణతత్త్వమనే పెరుగును వారి హృదయములనే కడవలలో నింపుకున్నారు.సాక్షాత్ పరమాత్మనే కవ్వముగా పట్టుకున్నారు.వారి భక్తియనే తాడును దానికి కట్టారు.అది వారికి స్వామి నర్తనము.

 కవ్వము తానైన కన్నడు తన చేతులను చాచి రండి బృందావనమునకు రాసలీలలో మునుగుదాము అనికవ్విస్తున్నాడట.వారి మనసు మురిసి ఆనందమును దాచుకోలేక ఎదపైకెగిసి,అక్కడ అలంకరింపబడియున్న మంగళ సూత్రములు,కాసుల పేరులు కృష్ణా కృష్ణా అను


సంకీర్తనముతో చేస్తున్నాయట.మనో పూజ.

కవ్వమై కవ్వించిన కొంటె కృష్ణుడు


ఎక్కడ మాయచేసి మాయమగుతాడో కనుక గట్టిగా పట్టుకోవాలని


,వారు పెరుగుకుండను గట్టిగా పట్టుకొన్నప్పుడు వారి చేతుల కంకణములు కృష్ణా-కృష్ణా అంటు తమ వంతు సేవగా కీర్తిస్తున్నయట-కాయక పూజ.


వాచక పూజ సరే సరి.వారి పెదవులను వీడలేనిది.


మనో-వాక్కాయ-కర్మల తననారాధించు చున్న గోపవనితలతో కలిసి ఓయ్ నేనిక్కడనే ఉన్నాను అని అంటున్నటుందిట గోపాలుని       సమాధానముగా  ఆ కవ్వపు సడి.

 మేల్కాంచిన గోపికను తమతో కలుపుకొని, కేశవనై-అశ్వరూపములో వచ్చిన కేశి అను అసురుని సంహరించి,కేశవునిగా కీర్తింపబడిన స్వామిని సేవించుటకు మనచేతిని పట్టుకుని నడిపించుచున్న ,


ఆండాళ్  దివ్య  తిరువడిగళే శరణం.




.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...