Tuesday, January 10, 2023

AALO REMBAAVAAY-27

       పాశురము-27

      ************


  "సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము


  సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము." 






  మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం  ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను 

   ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు,

"అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమును అర్థము చేసుకునే ప్రయత్నముగా ఒక్కసారి పాశురమును చూద్దాము.

ఇరవై ఏడవ పాశురం

****************

కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై

ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం

నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ

శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే

పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం

ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పాల్శోరు 

మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార

కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!



     


 వ్రతప్రారంభములో వారు చెప్పిన పాలుం నోం-నెయ్యిన్నోం-అన్న ఆహార నియమములకును,మయ్యెత్తు న ఎళుదుం-మలరిట్టు న ముడిదం అన్న నియమములకు అతీతముగా స్వామి నీ మా వ్రతఫలము నీ అనుగ్రహముతో ముందే ప్రాప్తించుచున్నది.

 వానలతో గోకులము సస్యశ్యామలమైనది.గోవులు సమృద్ధిగా పాలను వర్షిస్తున్నాయి.నెయ్యి సైతము పుష్కలముగా నీ ప్రసాదమైన క్షీరాన్నములో తేలియాడుటకు త్వరపడుచున్నది.మా పెద్దలు సైతము నీ నామమును కీర్తించుటకు,నీ దరి చేరుటకు మమ్ములను సమ్మతించినారు.

 వారు ఏ విధముగా సమ్మతినిచ్చినారో అదేరీతిగా మేము నీనుండి పెరు సన్మానమును కోరుకుంటున్నాము.బహుమతులను మా అలంకరణకై అర్థిస్తున్నాము.నీవు వాటిని అనుగ్రహించు అంటున్నారు గోపికలు/గోదమ్మ స్వామితో.


  అంటే గోపికల నోము పూర్తి అయినట్లుగా భావిస్తున్నారా? అందిన ఫలముతో తృప్తి పడినారా?అలంకారములెందుకు కోరుతున్నారు.రంగురంగు వస్త్రములను ధరించి,స్వామి అదనముగా  ఇచ్చిన ఎన్రనైయ పల్కలనుం యా  ఆభరణములను అలంకరించుకొని స్వామి దగ్గరకు వస్తారట.

 అప్పుడు స్వామి తన చేతిని చాపి వారిని దగ్గరకు తీసుకుంటాడట.చెవిలో గుసగుసలాడతాడట.

 వీరి నుండి వచ్చే చెవిపూవుల  వాసనను సేవిస్తూ మరింత మైమరచి బిగికౌగిలి ఇస్తాడట.అప్పుడు వారి భుజకీర్తులను చూసి మురిసిపోతాడట.వారు ధరించిన  రంగురంగు పీతాంబరముల స్పర్శతో  పులకించిపోతాడట.పాదములకున్న మంజీరములను చూస్తూ నేను మీ పాదాక్రాంతుడినే ఎప్పుడు అంటాడట.

 అది వారు స్వామిని కలిసి పొందవలసిన అనుభవమట.అంతకు మించి అన్యము వారి భావనలో సైతము ఏదీ రాలేదట.

  స్వామి నీవు మాకు చేయుచున్న సన్మానము ఎంత ప్రసిద్ధము కావాలంటే 

పరిశినాల్ నండ్రిక నాడుం పగళం- అంటున్నారు

 గోకులమంతా పులకించిపోవాలి కాదుకాదు

 జగములెల్లా పరవశించిపోవాలి అంటున్నారు.


 స్వామికి వారు కోరుకొను ఆభరణములను  చెబుతున్నారు.

1.శూడగమే-కంకణములు-అవియును సాధారణ మైనవి కాదు.వృత్తాకారములో ప్రణవమును నిరంతరము  నినదించు అష్టాక్షరి మంత్రం.

2.తోడే-సెవిపూవే 

 రెండుచెవులకు తమ్మెకు పెట్టుకునే దిద్దులు,పైభాగమున అలంకరించుకునే పుష్పాలు

  ద్వయ మంత్రము.

 అంటే స్వామి వారితో కరచాలనము చేసి,దగ్గరకు తీసుకుని అష్టాక్షరీ మంత్రమును,ద్వయి మంత్రమును చెవిలో ఉపదేశించాలట.

  ఎంతటి చాతుర్యము వీరి అభ్యర్థన ఐహికమును తలపిస్తూ-ఆముష్మికమును అందించునది.

3.తోళ్ వళియే-భుజకీర్తులు-శంఖ-చక్రములు.

  స్వామి నీవు మా చెవిలో అష్టాక్షరిని-ద్వయి మంత్రమును ఉపదేశించినపుడు మా చెవిపూల పరిమళమును ఆఘ్రాణిస్తూ మరింత ప్రేమతో మమ్ములను ఆలింగనము చేసుకొనునప్పుడు మా భుజములపై నీ వనుగ్రహించిన శంఖు-చక్రములను భుజ కీర్తులు మమ్ములను ముక్తపురుషులుగా,  నీ సామీప్య-సారూప్యమును-సాలోక్యమును కోరువారిగా గుర్తుచేయాలి.

  మాకొరకై చిటికెనవేలిపై గోవర్ధనగిరినెత్తి,ఇంద్రునిచే పట్టాభిషిక్తుడవై 'గోవింద" అను బిరుదుతో ప్రకాశించుస్వామి నీ చూపు మా పాద మంజీరములపై వ్రాలుట అనగా మేము నీ పాదసేవానురక్తులము .కాదనకయ్యా అని విన్నవించుకొను విన్నపములు.

 సమాశ్రయణమును అనగా సంపూర్తిగా-సమ్యక్-ఆశ్రయణమును పొందించిన నీ అనుగ్రహము మేము  ఎంతని పొగడగలము.

  నీవు -శీర్ గోవిందా-శుభములను అనుగ్రహించువాడా,


   


 స్వామి నీవు కూడని వారిని (అభిముఖులను-ప్రణయకుపితులను-తటస్థులను-విముఖులను-ఉదాసీనులను సైతము) నీ శౌర్యముతో-సౌకుమార్యముతో-సౌందర్యముతో-సౌలభ్యత్వముతో అనుగ్రహించి చేరదీస్తావు అని మాకు ఇప్పుడే తెలిసినది.

 మనమందరము కలిసి పాల్ శోరుం-పాలలో ఉడికించిన బియ్యముతో(వడ్ల  లోని ఊకపోగా మిగిలిన ధాన్యము తో-అంటే ఐహికమనే ఊహలను తోసివేసిన ఉపాధులలో నున్న మేము-నీ క్షిప్రప్రసాదగుణములను మధురమును కలిపి శుద్ధసత్వమనే తెల్లని పాలలో నుడికించిన కూడార ప్రసాదమును, పద్మము లా నిన్ను మా మధ్యన కూర్చుందపెట్టుకుని, విచ్చుతున్న రేకుల్లా,మేము నీ చుట్టూ కూర్చుని, అదియును స్వామి మాకును-నీకును మధ్యన సమానమైన దూరములో-సమానమైన దగ్గరలో, సంపూర్ణమైన భావనతో,



  నిన్నే అంటుకుని యుండే-మరలలేని నెయ్యి అనే వాత్సల్యము మా మోచేతిదాకా కారుచుందగా నిన్ను ముక్తపురుషులుగా చేరుతూ,నీ కళ్యాణగుణ వైభవమును  తనివితీరా గ్రోలనిమ్ము అని

 అంటున్న (చాలా చాలా చెప్పాలని ఉంది కాని  ...)

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 

  



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...