Wednesday, January 11, 2023

AALO REMBAAVAAY-28

 


   పాశురము-28

   ************

" కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి

  కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"


   "స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.

 నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు.

"కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి
భాగ్యశాలియో
రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."

 ఇరువది ఎనిమిదవ పాశురం

*********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్బోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పెరుందనై  పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఓళియాదు !!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.
   

 అలా హాయిగానున్న వారిని మనకొరకు బహిర్ముఖులను చేసినది స్వామి అనుగ్రహము.మీరడిగినవి ఇస్తే నోమునకు తరలివెళతామన్నారుకదా ఇంకను ఇక్కడే ఉన్నారేమిటి? అని ప్రశ్నించాడు స్వామి.
 స్వామిని కనులారా చూస్తూ,
 ఓ అంబినాల్-ఓ ప్రేమమూర్తి,


 
 

 శీరి అరుళాలే-కినుక వహించకయ్యా
   అది నీ స్వభావమునకు సరిపడదు అని బుజ్జగించారు.
  చిరునవ్వుతో స్వామి అయితే మీరింకా ఇక్కడే వేచియుండుటకు కారణము నేనేనా? అని అడిగాడు చమత్కారముగా.
  అదే స్వామి మీరు మాకిస్తానన్న "పఱను" అనుగ్రహిస్తే నోముస్థలికి వెళ్ళిపోతాము,అన్నారు అదే వాక్చమత్కారముతో.
 ప్రసన్నుడైన స్వామి మరింత వారిని పరీక్షిస్తూ,
 పఱను మీకు ఇవ్వాలంటే మీరెవరో,ఏమిచేస్తుంటారో,తీసుకునే అర్హులో-కాదో నేను తెలుసుకోవాలి కదా.కనుక మీ- పాండిత్యమును-మీ నేర్పరితనమును- ప్రత్యేకతలు వివరించండి అన్నాడట. 
  దానికి వారు మేము,
" అరియాద పిళ్ళైగళుం" -అజ్ఞానపు గొల్లపడుచులము
    మేము ఏ జ్ఞానమును  సముపార్జించలేదు .చదువులేదు.
 ప్రతిరోజు,
 కరవైగళ్ పిన్నెన్రుం-పశువుల వెనుక,గోవులవెనుక
 కానం శేరిందు-అడవులకు/వనములకు వెళతాము.
 గోవులే మా గురువులు.కనుక మేము వాటివెనుక నడుస్తు అనుసరిస్తాము.అలా అడవులలోనికి వెళ్ళి,అక్కడ మేత మేస్తున్నప్పుడు,మేమును మా చద్దిమూటను విప్పి ఉణ్పోం-తింటాము.అంతే కాని స్నానజపతపములు అనుష్ఠానములు మాకు తెలియవు.అన్నారు.
   కాని వారు స్వామికి అందించిన సందేశము వేరు.
 ఇది బాహ్యార్థము.కొంచము పరిశీలితే గోవులు-వేదములు వానిని అనుసరించుట , అలా అనుసరిస్తూ అరణ్యమును చేరుట వేదాంతసారమును-ఉపనిషత్తులను తెలిసికొనుట.అక్కడ చద్దితినుట అనే "ఉణ్పోం" వాటి సారగ్రహణమును చేయుట.
  అనగానే అయితే మీరు గోధూళి స్నానమును చేసి,వేద-వేదాంత సార గోష్ఠులను సలుపుతారన్న మాట అన్నాడు స్వామి ఒప్పుకోక తప్పదు అంటూ.ఆశ్రిత పక్షపాతము కదా.అన్నీ  మంచిలక్షణములు గనే భావించుకుంటుంది.
 

 వారి భక్తిని మరింత లోకవిదితము చేద్దామనుకున్నాడేమో స్వామి,అదిసరే కాని,
మీరు అడవికి ఆవులను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమైన దేవాలయములను-ముని ఆశ్రమములను దర్శించి, సేవించారా అని అడుగుతావేమో? లేదా ఏదైనా మంత్రమును జపించారా? అని అడుగుతావేమో? లేదా యంత్రములను స్థాపించారా? అని అడుగుతావేమో.అవన్నీ సాధ్యోపాయములు.అవి కొందరికే సాధ్యములు.మేము కేవలము మా కులవృత్తిగా ఆవులను మేపుట పాలుపితుకుట మా జీవనమునకు చేస్తాము కాని ఇంకేమి శాస్త్రములు-స్తోత్రములు మాకు రావు.
  మరి నేనిలా మీకివ్వగలను పఱను కుదరదే అన్నాడట వారి సమాధానమునకై ఎదురుచూస్తూ.
 మాకు తెలుసులే పరమాత్మవైన నిన్ను మేము,
అరమిల్లై,అరైవొన్రుమిల్లై,అరైవొ న్రుం  ఇల్లై,
 కర్మజ్ఞానములేదు-భక్తిజ్ఞానములేదు- వైరాగ్యజ్ఞానములేదు.
 చిన్న చిన్న పేర్లతో పిలిచాము అని నీకు మామీద మంచి అభిప్రాయము  లేదు     .మాచే ఆ విధముగా నిన్ను పిలిపించినది,
మా అజ్ఞానమో .నీవనుగ్రహించిన చనువో "గోవింద "  అని పిలిపించినది.

ఓ ఇరవా-ఓ ఇహపరదాయకా 
కురైవొన్రు ఇల్లాద-మాకొచ్చిన కొరత ఏమీలేదు లేదు.అన్న వారిని చూచి
 నేనును మీ వలెనే గోకులములో జన్మించినాను కదా.గోవులను మేపుచున్నానుకద.మీతో ఆడి-పాడుచున్నానుకదా.నన్ను గోవింద అని పిలుచుట తప్పేమి కాదులే అన్నాడట.

 పుణ్యమేదైనా అర్హతగా పొందియున్నారా మీరు పఱను పొందుటకు అని అడిగాడట స్వామి.
 అవకాశమును అందిపుచ్చుకుని,
 మేము చేసుకున్న పుణ్యమేగా నిన్ను గోకులములో జన్మింపచేసినది.
"ఉందన్నై పిరవి" నీ వు గోకులములో మాతో పాటుగా జన్మించుటచే  మాకును-నీకును విడదీయరాని (జన్మభూమి)అను
ఇంగుం ఒళిక్కిఒళియదు-అవినాభావ సంబంధమను జనన సంబంధమును ముడివేసి,మమ్ము సిద్ధ పుణ్వశీలురుగా మార్చినది.అదియే నిన్ను సేవించుకొనుటకు,నీ అనుగ్రహమును పొందుటకు మాకు ప్రాప్తించిన అర్హత అని  విన్నవించుకున్నారు..
 మేము ఏమీ చేయలేదు అని అమాయకముగా చెప్పుతున్నప్పటికి బాహ్యమునకు,మేము కర్తృత్వ భావనతో చేయుటలేదు అను తత్త్వ రహస్యమును తెలియచేస్తున్న గోపికల వెంటనున్న,
 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.  


  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...