ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||
ప్రస్తుత శ్లోకములో సాధకుడు తం భజే నిన్ను భజించవలెన్న ఆకాకంక్షను స్వామికి నివేదించుకుంటున్నాడు.
కథాపరముగా అన్వయించుకుంతే జలమయమయిన ప్రపంచము నల్లనికాంతులీనుతున్నది.దానినే "ప్రపంచకాలిమప్రభా" అని స్తుతిస్తున్నాడు.సర్వం అగోచరము.రంగులు లేఉ.గుణములు లేవు.రేయి-పగలు లేదు.త్రిగునములు లేవు.జీవులు లేరు.అంతా ఒకేఒక నల్లనైన ముద్ద.
కాని ఆ నల్లని ముద్దలోని స్వామి అనుగ్రహమనే చైతన్యము ప్రసరించగానే నల్లకలువగా పూర్తిగా విచ్చుకుంటూ దానిలో దాగియున్న ద్వంద్వములను వేరువేరు చేసి చూపిస్తున్నది.అదియే చీకటిని దాటిన ప్రకాశము.మంచిచెడులను గుర్తించగల వివేకము.మనము సున్నను శూన్యము అని భావిస్తాము-పూర్ణము అని కూడా అంగీకరిస్తాము.అదే జరుగుతున్నది ఇక్కడ గుప్తముగా నున్న స్థితి నుండి ప్రకటనము జరుగుచున్నవేళ,ఎన్నో నామములతో-ఎన్నెన్నో స్వభావములతో ఉత్పన్నమైన శక్తులను ఛేదించి-విడదీసి అమనకు చూపించుచున్నది స్వామి కరుణ.అవియే,
1.స్మరత్-మన్మథుడు
2.పురత్-త్రిపురాసురులు
3.భవ-జన్మము
4.మఖము-దక్షుడు
5.గజాసురుడు
6.అంధకాసురుడు
7.యముడు
స్వామి మన్మథుని తన మూడవకంటితో దహించివేశాడు.త్రిపురములను మట్టుపెట్టాడు.పుట్టుకకు చావు అను ముగింపును చూపాడు.దక్షయజ్ఞమును ధ్వంసము చేయించాడు.గజాసురుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు.అంధకాసురుని సంహరించాడు.యముని జయించి మార్కండేయునికి చిరంజీవిగా దీవించాడు.ఇది వాచ్యార్థము.కాని ఇది సర్వజీవులలోని చైతన్యమునకు సంకేతము.
ఉపాధిలో నున్న జీవులు ఈ ద్వంద్వభావములలో సతమతమవుతుంటారు.
1.స్మరత్-ధ్యానము-పరమాత్మను ధ్యానించవలెనన్న ఏకాగ్రత చాలా అవసరము.కాని దానిని దగ్గరికి రానీయనిది మన మనసులో తిరుగుచున్న ఆలోచనలు.వాటిని దూరముగా ఉంచితే కాని స్మరణము కొనసాగదు.ధ్యానము వేరు-కమ్ముకొనుచున్న ఆలోచనలు దానికి ఆటంకములు అని గుర్తించుట యే
స్మరఛ్చిదం.
పురములు అనగా మన శరీరములు.అవి స్థూల-సూక్ష్మ-కారణములని మూడు విధములు.స్వప్న-జాగ్రత్-సుషుప్తి అను మూడు అవస్థలు.వాటిని దాటితే కాని తురీయ నిశ్చల స్థితి చేరలేము అని గమనించుట పురఛ్చిదం.
భవ అనగా పుట్టుక.ఉపాధి నిత్యమను భ్రమలోనుండుట మాయ.దానిని వెన్నంటి మరణము కూడ ఉన్నదన్న సత్యమును తెలిసికొనుట భవఛ్చిద.
బాహ్యపూజలు అంతరంగశుద్ధిలేని యెడల నిష్ప్రయోజనములుగా బాహ్యమును-భావమును గమనించుకోగలుగుట మఖఛ్చిదం.మఖమనగా యజ్ఞము.ప్రయత్నము.
గజము-యుక్తాయుక్తవిచక్షణా రాహిత్యము.ఏది కోరుకోవలెనో-ఏది జగములకు,జగములో నున్న తనకు రక్షనమో గమనించుకోలేక పోవటము.దానిని తెలియచేయుటయే గజఛ్చిదం
అజ్ఞానమే-అంధకము-అంతరాత్మను-ఆత్మ చైతన్యమును గ్రహించలేకపోవుటయే అంధకము.దానిని తొలగించుకోవలెనన్న వెలుతురు ప్రసరింపవలెను.చీకటి తనంతట తానే జరిగిపోతుంది.చీకటిని తరుమగల వెలుతురు ఉనికిని గుర్తించుటయే అంధకఛ్చిదం.
అంతకఛ్చిదం-అంటములేనిది ఆత్మ.అది దాని పాప-పుణ్య కర్మలను అనుభవించుతకు కొత్తరూపును ధరించి-వదిలివేస్తుంటుంది.ఉపాధి అశాశ్వతము-ఆత్మ శాశ్వతము అని తెలిసికొనుటయే అంతకఛ్చిదం
ఇప్పుడు సాధకుడు తనలో దాగిన చైతన్యముతో అనుష్ఠ్హనమును- అవరోధములను వేరుచేసి గమనించగలుగుతున్నాడు.వానిని తొలగించుకొనుటకు స్వామి భజనమే ఏకైక సాధనముగా గుర్తించాడు.
ప్రపంచమునావరించియున్న నల్లని అయోమయము నుండి వికసించుచున్న నల్లకలువను చూడగలుగుతున్నాడు.
No comments:
Post a Comment