Tuesday, February 28, 2023

SIVATANDAVASTOTRAMU( TAAMDAVA SIVAM KAROTI)--11

 జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-

-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

 

  ప్రస్తుత శ్లోకములో సర్వ చరాచరముల పరిణామములను సంకేతించుచు,విష్ణువు మృదంగధ్వని క్రమముగా స్వామి నర్తనము జరుగుచున్నదని వివరిస్తున్నారు.అదే విధముగా సర్పముల శ్వాసప్రక్రియ యొక్క రాక-పోకల లయము/లీనత్వమును వివరిస్తూ,లలాట నేత్రము ఏ విధముగా కీలలతో జ్వలితమగుచున్నదో వర్ణించబడినది.

విత్తు స్థితి నుండి మొలక స్థితికి జరిగే పరిణాములో/మార్పులో పూర్వస్థితి-తదుపరి స్థిలో కలిసిపోతుంది.ఆ మొలక మొక్కగా మారువేళ రెండు స్థితులు అవే బీజస్థి-మొలకస్థితి-మొక్క స్థితిని పొంది,తదుపరి వృక్షస్థితికి చేరునపుడు నాలుగు స్థితులను ఒక స్థితిలో ముందటి స్థితిని లీనము చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అదే విధముగా స్వామి తాండవము సైతము ఒక స్థితి నుండి మరొకస్థితి తన పూర్వస్థితిని తనలో లీనము చేసుకొని తదుపరి స్థితిని పొందుటకు ముందుకు సాగుతుంటుంది.



 మొదటి శ్లోకములో డమడమ డమ అంటూ డమరుక శబ్దముతో ప్రారంభించిన తాండవమును ధిమి ధిమి ధిమి అను మ్ర్దంగ ధ్వనికి అనుగుణముగా నర్తించుచున్న "ప్రచండ తాండవము"గా ముగించుచున్నాడు.నాదముతో ప్రారంభమైన తాండవము నాదముతో ఒక ఆవృత్తమును ముగించుకొనుచున్నది.చ కార చండ తాండవముగా అనగా జరిగిపోయిన తాండవముతో ప్రారంభించి-ముగియుచున్న తాండవముతో సాధకుడు కదా అంటూ ఎప్పుడో తనకు స్వామి పంచకృతయ నృత్యమును తెలుసుకొనగలుగుట అన్న ఎదురుచూపుతో ముగించుచున్నాడు.
 అసలు తాండవముగా చెప్పబడుతున్నది కేవలము ప్రదోష సమయములో సాకారరూపముగా భాసించుచున్న శివస్వరూపము యొక్క నర్తనమా/లేక అమ్మవారిగా ప్రకటింపబడిన పార్వతీదేవిని కూడి లాస్యముగాను మిళితమై ప్రదర్శింపబడునదా?
 అదియే కనుక నిజమైతే సాధకుని మనో వీచికలో ఎన్నో భవాములను ఉద్భవింపచేసినదెవరు?
 ఇంతకు సాధకుడు ఇంతవరకు తాను గమనించి మనకు వివరించినది స్థూలముగా జరుగుచున్న తాండవమా లేక తన అంతరంగములో నర్తించుచున్న చైతన్య పరివర్తనామా? అన్న సందేహములు జనించక మానవు.

  ఒక్కొక్క శ్లోకములో స్వామి లలాట నేత్రము ఒక్కొక్క విధముగా భావింపబడి భాసించినది.
 ప్రస్తుత శ్లోకములో అదే లలాటనేత్రము స్వామి తాందవమునకు హారతులనిస్తున్నది.తేజోమయమైనది.దానికి స్వామి గళమున అలంకరింపబడిన భుజంగముల అస్వసత్-ఉఛ్చ్వాసములు పైకి పాకి స్వామి అగ్నినేత్రమును ప్రకాశింపచేస్తున్నది.దానికి తోడుగా భుజంగముల నిశ్వాసములు తుంగ-అనుపమాన మంగధ్వానములగుచు,ధిమి-ధిమి-ధిమి అను మృదంగ నాదముగా అదియును క్రమముననుసరించి ప్రవర్తించుచుండగా దానికి అనుగుణముగా స్వామి తాండవమును సలుపుచున్నాడట.
 అట్టి అసమాన క్రమానుసారముగా చేయు తాండవమునకు సాధకుడు భుజంగముతో పాటుగా తానును మంగళాశాసనమును చేయుచున్నాడు.
 " అఖండ మండలాకారం-వ్యప్తమ్యేన చరాచరం" అన్నది ఆర్యోక్తి.పరమాత్మ ఒక బిందువు.తన స్థిరమైన శక్తితో అనేకానేక నిడివిగల వృత్తములను గీయుచున్నాడు.అందులో కొన్ని చిన్ని చుట్టుకొలతను కలిగియున్నవి.మరికొన్ని విస్తారముగా వ్యాపించియున్నవి.
 వృత్తము చిన్నదైనను-పెద్దదైనన్ను అది ఆధారపడియున్న కేంద్రబిందువు మాత్రము ఒక్కటే.అది కదలక-మెదలక స్థిరముగా అదే పరిణామముతో నున్నది.
 వృత్తములను గీయుటయే దాని లీల/క్రీడ.ఆ కదలికలే తాండవము.కొన్ని వృత్తములు సృష్టి కార్యముగాను-మరికొన్ని స్థితి కార్యములగను.కొన్ని లయముగను,కొన్ని తిరోధానముగను,కొన్ని అనుగ్రహముగను పునరావృత్తమవుతూనే ఉంటాయి.
  మనము మొదటి శ్లోకము గమనిస్తే గలేవలంబి -గళహారముగా అలంకరింపబడిన సర్పము ప్రస్త్రుత శ్లోకములో తన వేగమైన కదలికలతో బుసలు కొట్టుచు ఫాలనేత్రములోని అగ్ని మరింత ప్రజ్జ్వలించినది.
  సాధకుడు నర్తనములో వివిధ శ్లోకములలో సంకేతపరచిన 
ప్రఫుల్ల నీల పంకజా-సృస్థికి సంకేతముగా
కుచాగ్ర చిత్ర పత్రికా-స్థితి కార్య సంకేయ్తముగా
ప్రతి శ్లోకములోని అగ్ని సోమాత్మకతతో పాటుగా అర్థనారీశ్వరమును అర్థము చేసుకుంటూ,క్రమక్రమముగా స్వామి కంఠము యొక్క ప్రపంచకాలిమ అంటూ తిరోధానమును/స్వామి తనలో జగములను నిక్షిప్తపరుచుట-తిరిగి అనుగ్రహించుట చెప్పకనే చెప్పినాడు.
 అది ఒక నిరతర నిత్య-సత్య నృత్యము.తాడనము అదే-తాండవము అదే.
 అందుకే అది ప్రచండము.ప్రకృష్టమైన చైతన్య స్రవంతి.నిక్షిప్తనము-ప్రకటనము దానికి సహజము.
 అట్టి తాందవము నా ఉపాధిలో సైతము దాగి(సూక్ష్మముగా) నా ఇంద్రియములను నర్తింపచేయుచున్నది.నా దోషములను తొలగించుఒనుటకు నన్ను చైతన్య పరచుచున్నది.
 ప్రపంచతాండవము స్థూలమైతే-నాలోని ప్రాణ శక్తి యొక్క తాండవమే నన్ను నేను/నాలో దాగిన నిన్ను గమనించుకోగలుగుట.
 అట్టి శుద్ధ చైతన్య తాండవము నన్ను ద్వంద్వములనుండి మరలించును గాక.
  ఏక బిల్వం శివార్పణం 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...