తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥ ప్రస్తుత శ్లోకము కిరణ ప్రాశస్త్యముతో స్వామి విభవమును మరింత స్పష్టపరుస్తున్నది. ఇప్పటివరకు అగస్త్యునిచే చెప్పబడిన ఆదిత్యహ్ర్దయ శ్లోకములలో కరోతి ఇతి కిరణ అన్న సూక్తి ప్రకారము స్వామి దినకరుడు-దివాకరుడు-ప్రభాకరుడు-భాస్కరుడు-అహస్కరుడు-అను కారక శబ్దముచే కీర్తింపబడినాడు.
అంతే కాదు గభస్తిమాన్-అంశుమాన్-తేస్వన్-రశ్మిమాన్-సముద్యమాన్-వివస్వాన్-తిమిర ఉన్మథనాన్,జ్యోతిషాన్ అంటూ స్వామి యొక్క ప్రకాశము ప్రస్తుతింపబడినది.
అదే విధముగా తప శబ్దము కూడా
శిశిర తపనో,ఆతపీమండలీ,భాస్వర సర్వతాపనఃపాయత్యేషి-తపయేషి అంటూ తాపమును కలింగునది-తొలగించినదియును తానే అయిన పరమాత్మను గుర్తించి-గౌరవించినది.
పెద్దలు తప అన్న శబ్దమునకు ఐశ్వర్య సంకేతముగా కూడా అన్వయిస్తారు.దాని సంకేతమేమో వహ్నయే శబ్ద ప్రాముఖ్యము.
స్వామి తప్త-కాల్చబడిన-పరిశుద్ధము చేయబడిన
చామీకరములు కలవాడు.
చామీకరము అనగా బంగారు కిరణములు కలవాడు.అనగా ఆ హిరణ్యగర్భుడు-సువర్ణతేజశుడు అగ్నిలో పుటమువేశిన రుచులతో/కాంతులతో నున్న కిరణములతో అగ్నిస్వరూపుడై/సర్వభక్షకుడై పంచకృత్యములనే విశ్వకర్మను లోకసాక్షిగా నుండి జరిపిస్తున్నాడు.అప్పుడు ఎటువంటి చీకటి ప్రవేశించలేని నిర్వికారస్థితి.ఇది బాహ్యము పరిస్థితి.
కర్మసాక్షి-లోకసాక్షి,స అక్షి కన్నులతో లోక-ఆలోక చూడగలుగువాడు/చూచుచున్నవాడు అయిన హిరణ్యగర్భుడు తమమను అజ్ఞానమును హృదయమునందు అభినిఘ్నాయా-ప్రవేశింప వీలుకానిదిగా చేయుచున్నాడు.దీనినే ఆదిత్యమండల స్తోత్రము,
"యన్మండలం దీప్తికరం విశాలం
రత్మప్రభం తీవ్రమనాది రూపం" అనియును
సమస్త తేజోమయరూపముగాను ప్రస్రుతిస్తూ
తత్-సత్-వితుర్-వరేణ్య -పునాతుమానన్ను సైతము పునీతుని చేయి అని ప్రార్థించుచున్నది.
ఇక్కడ ఒకసారి మనము హిరణ్యగర్భ మూలమంత్రమును గుర్తుచేసుకుందాము.
ఏక ఏవహి లోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః.
తం సూర్యం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment