తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ప్రస్తుత శ్లోకములో అమేయాత్మనే స్వామి నిరాకార-నిరంజనత్వమును ప్రస్తుతించుచు విష్ణుసహస్రనామములో చెప్పినట్లుగా " అవ్యయః-పురుషః-సాక్షి" అని పరతత్త్వము యొక్క పరమార్థమే సూర్యనారాయణమూర్తిగా ప్రత్యక్షమగుచున్నట్లు చెప్పకనే చెప్పుచున్నారు.
అంతే కాదు స్వామిని "దేవాయ" అను మరొక విశేష పదముతోను ప్రస్తుతిస్తునారు అగస్త్యమహర్షి.
ఇదే విషయమును లలితా రహస్య సహస్రనామము"చిదేకరసరూపిణి" అని కీర్తిస్తున్నది.
ఒకేఒక ప్రకాసముగా ప్రకటింపబడుతున్న శక్తి.
ఓజస్తేజో ద్యుతిధర అని సంకీర్తించుచున్నది.
అదే విషయమును దేవాయ-జ్యోతిషాం పతయే నీకు నమస్కారము అంటున్నది ప్రస్తుత శ్లోకము.
ఇదే అర్థమును ఇంతకు ముందు హిరణ్యగర్భ-సువర్ణరేతా గా ప్రస్తుతింపబడినది.
తేజాసమపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుస్తే అని కూడా గుర్తించారు వేదవిదులు.వారిని సైతము జ్యోతులుగా/ముక్తపురుషులుగా భావిస్తే వారిని అనుగ్రహించిన/పాలించిన పరమాత్మ జ్యోతిషాంపతి.
జ్యోతి అను పదములని కిరణసముదాయముగా సమన్వయించుకుంటే "హరికేశ" కిరణముల సమూహము నక్షత్రములకు-గ్రహములకు-తారలకు అవసరమైన శక్తిని ప్రసాదించి-ప్రకాశింపచేస్తున్నాడు.కనుకనే మనము నక్షత్రములను స్వయం ప్రకాశములు గానే కాకుండా గ్రహములకు-ఉపగ్రహములకు సైతము శక్తిని అందించుచున్నవను వైజ్ఞానిక వాదమునకు సైతము బలపరచుచున్నది.
మనుము ముందు చర్చించునట్లు వెలుతురుతో పాటుగా వేడిని సైతము అందించే వాడు జ్యోతిషాంపతి.
ఇక్కడ మనకు కావలిసినది తమోగ్నాయ-చీకట్లను నశింపచేయు వెలుగు-హిమగ్నాయ-మంచును తొలగింపచేయు వేడిని అపరిమితముగా ప్రసాదించు పరమాత్మ.ఇది భౌగోళికము.
మనలోపల చీకటితో పాటుగా-చైతన్యమును కప్పువేయు జడత్వమను -కృతఘ్నత అను వాని దోషమునకు శత్రువుగా మారి వానిని తొలగించు దివ్యగుణమునకు నమస్కారములు.
పగటికి అధిపతి కనుక జ్యోతిషాంపతి.జ్ఞానప్రతీక.చైతన్యస్పూర్తి అయిన పరమాత్మ తన దివ్యత్వముతో నా చుట్టు ఉన్న బాహ్య శత్రువులను-నాలోదాగిన అంతః శత్రువులను
ఘ్న-నాశనము-ఘ్నాయ-నశింపచేయును గాక.
No comments:
Post a Comment