బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥ ఒకే పరమాత్మ అనేక విధములుగా పాలనను నిర్వహిస్తూ అనేకానేక గౌణనామములో ప్రస్తుతింపబడుతున్నాడు.
బృహతి-బృమ్హణతి విశృతమైనది -చైతన్యవంతమైనది యైన పరబ్రహ్మము తనను తాను సృష్టి-స్థితి-లయ అను మూడు ప్రధాన లక్షణములను చేయుచు బ్రహ్మ-ఈశాన-అచ్యుత నామములతో ప్రకాశిస్రున్నది.దీనినే లక్షంఇ అష్టోత్తరము,
బ్రహ్మ-విష్ణు-శివాత్మికగా ప్రస్తుతించింది.
మండలాకారములో నున్న పరమాత్మయే సూర్యునిగా కూడా కీర్తిస్తున్నాడు.
సురతి-ప్రేరయతి సూర్యః అన్నది ఆర్యోక్తి.
సు-రయతి-జనములను/జగములను కర్మలయందు ప్రేరేపించువాడు సూర్యుడు.
సుష్టు-ఇరయతి సూర్యః అనునది మరొక సమర్థనము.
సకలమును వ్యాపించి-పాలించువాడు సూర్యుడు.
అంతరో యమయతి సూర్యః-అంతర్యామిగా దాగి అన్ని నామరూపములలో చైతన్య ప్రసరణమును చేయువాడు సూర్యుడు.
అంతరాత్మయే సూర్యునిగా భావిస్తారు.భాసిస్తాడని అంటారు.
భావనలో సైతము భాసించబడుటయే వపు-శరీరముగా/రూపముగా/ఉపాధిగా భావనలోను-బాహ్యములోను ప్రకాశించు లక్షణమే వర్చస్సు.
ఒక సూర్యుండు సమస్తజీవులకు తానొక్కక్కదై తోచు అన్న విధముగా పరమాత్మ పంచకృత్యములను నిర్వర్తించు ప్రధాన శక్తిగా నిర్వచిస్తున్నది ఈ శ్లోకము.
మొదటి భాగములో సూర్య పరమాత్మయే సృష్టి-స్థితి-లయ అను మూడు కార్యములను నిర్వహిస్తాడని చెప్పుతున్నది.
తేజసామపై తేజస్వి-జ్యోతిషా పతి యైన సూర్యుడు బ్రహ్మ అను నామముతో-ఈశానుడు అను నామముతో-అచ్యుతుడు అను నామముతో,పర రూపముగా నున్న పరమాత్మ-ఈశవ్రునిగా వైభవ రూపమును ధరించి-సూర్యునిగా అర్చామూర్తిగాను దర్శమిస్తున్నాడు.
అంతేకాదు అదే పరమాత్మ తాను ప్రళస్వరూపముగా అంతటను తిరోధానపరచి-సర్వ భక్షకుడిగాను మారి భాసించుచున్నాడు.
ఇదే విషయమును లలితా సహస్రనామము మహాగ్రాసా-మహా అసనా అని స్తుతిస్తున్నది.బ్రహ్మాందము సైతము పరమాత్మకు(మృత్యువుతో సహా) పరమాత్మకు ఆహారముగా మారి భక్షింపబడుతుంది.బ్రహ్మాండముతో పాటుగా బ్రహ్మ సైతము పరబ్రహ్మములో కలిసిపోతాడు.
సర్భ భక్షకుడైన పరమాత్మ జలమయమైన /అంధకారమైన ప్రళయములో సైతము సర్వ భక్షకుడై యుండియు భాసిస్తుంటాడు.
సర్వ రోదనములను హరించివేసి రౌద్ర శరీరుడై ప్రకాశిస్రుంటాడు.కనుకనే "ఆదిత్యానాం -మహావిష్ణుః అని స్తుతిస్తారు.
రుజాన్ ద్రావయతి ఇతి రుద్రః.దుఃఖమును-దుఃఖ కారణమును నిర్మూలించువాడు రుద్రుడు.ఆదిత్యుని వర్చస్సు సర్వభక్యాయ అన్న సంకేతముతో అగ్నిహోత్రునిగాను ప్రస్తుతింపబడుతున్నది.ఆ పరంజ్యోతియే"అర్కం జ్యోతి అహం శివః' అన్న సూక్తి ప్రకారము బ్రహ్మమే బ్రహ్మగా-శివునిగా-విష్ణువుగా అగ్నిగా-అత్తి-భాతి స్వభావముగా కలవాడుగా,ఆదాన-ప్రదానునిగా ,విష్ణుసహస్రనామములో చెప్పినట్లు
"అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మ" ఇది రూపము-ఇది స్వభావము అని చెప్పలేని విధముగా ఆత్మ స్వరూపముగా నున్న
No comments:
Post a Comment