Wednesday, December 20, 2023

TIRUPPAAVAI-05



 



 తిరుప్పావై-పాశురము05

 *****************

" మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం

 విశ్వోపజీవ్యమమృతంవచసా దుహానాం

 తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

 సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."



  పూర్వ పాశుర ప్రస్తావనము

  *************************

 పర అవతారమైన నారాయణుని చేరుట అత్యంత దుర్లభము కనుక స్వామి పాలకడలిపై తన వ్యూహరూపమును ప్రకటించినాడు.పాలకడలిచేరుటయును పరమదుర్లభము కనుక స్వామి లీలావతారముగా"వామనమూర్తిని" ప్రస్తుతించినప్పటికిని అవతార సమయము చాలా స్వల్పము.చేసిన కార్యము ఘనమే అయినను ఒక్కటియే.అట్టి లీలావతారమునుప్రత్యక్షముగా కొలుచుట  చేతనులకు అసంభవము..నాల్గవ పాశురములో పరమాత్మ వరుణదేవుని రూపమున అంతర్యామియై ఆశీర్వదించినాడు.అంతర్యామిని పట్టుకొనుట అత్యంత దుర్లభము సామాన్యులకు.కనుక స్వామి తన అర్చారూపమును ప్రకటించుచు అందరికి సులభసాధ్యుడగుచున్నాడు.

 అర్చా రూప విశేషము కదా తాను తల్లితన ఉదరమునకు కట్టినదామమునకు కట్టుబడి యుండుట.

  బందీగా ఉన్న పరమాత్మ నలకూబరుల బంధవిమోచనమును కావించుట మరింత విశేషము.ఒక పక్క అవతార ధర్మపాలన చేస్తూనే-ఆశ్రిత రక్షణా పాలనమునుచేస్తున్నాడు పరమాత్మ.

 అదే విధముగా రేపల్లెలో చిన్ని బాలునిగా ప్రకటితమగుతూనే-కాత్యాయనీ వ్రతనిర్వహణమునకు పూనుకున్నాడు.
 అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.


 పాశురము-05
 ***********
 మాయనై వడ మధురై మైందనై
 తుయి పెరునీర్ యమునై యరైవరై
 ఆయర్కులత్తినిల్ విళక్కం శెయద దామోదరనై
 "తూయోమాయ్ వందుం" నాం తుమలర్ తూవిత్తుళిదు
 వాయినాల్పాడి మనత్తినాల్ శిందిక్క
 పోయ పిళ్లైయుం పుగుదరువా నిన్రనవుం
 "తీయనిల్ తూశాగుం" శెప్పు ఏలో రెంబావాయ్.

 అర్చామూర్తి యైన నందబాలుడు ఉత్తర మథురలో  (తనను రేపల్లె చేర్చుటకు వసుదేవునకు సహకరించిన)               యమునానదితీరములలో ఆడుచుంటాడు.వాడు మన యశోద గర్భతేజము. గొల్లకులదీపకుడు.తల్లి తన ఉదరమునకు కట్టిన తాడునకు బందీ గా నుండి,  యమళార్జునభంజనమును కావించి లీలను ప్రకటించినాడు.అంతేకాదు,తాను మన్ను తిన్నానన్నభావనను తోటి బాలకులకు కల్పించి,యశోదకు తన నోటిలో పదునాలుగు భువనభాందములను దర్శింపచేసి,
 "కలయో-వైష్ణవ మాయయో, అనిపించినస్వామి మనలను తప్పక అనుగ్రహిస్తాడు.
   మనకు వినికిడి జ్ఞానము తప్ప విశదజ్ఞానము లేదని భావించక,దోషరహితమైన మన మనసనే పుష్పములను సమర్పిద్దాము.అదియును పద్ధతిగా పూజించలేనివారమయినప్పటికిని,పరమకరుణాంతరంగుడు మనకు వెన్నుదన్నుగా ఉంటాడు.మన రేపల్లెను/విల్లిపుత్తూరును మథురగా మారుస్తాడు.



  మథుర అంటే కేవలముఒకప్రదేశమా/లేక ఒకమానసిక స్థితికి సంకేతమా అని ఆలోచిస్తే,బాహ్యమునకు  అది పరమాత్మ కరుణ ఘనీభవించిన క్షేత్రము.ఆ పెరునీరు/ ఆ పెద్దనీరు స్వామి దయ ద్రవీకరించిన సంకేతము.నిజమునకు అరిషడ్వర్గములను 
 జయించిన ప్రతిమనసును మథురయే.మాధవ మాథుర్య నివాసమే.మథుమాసమే.ఆ మాధవహృదయ వనములో పూచినవే తుమలర్-పవిత్రపుష్పాలు.వానినే పెద్దలు
 "అహింసాప్రథమపుష్పం,పుష్పమింద్రియనిగ్రహః
  సర్వభూత దయాపుష్పం,క్షమా పుష్పంవిశేషతః
  శాంతిపుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తదైవచ
  సత్యమష్ట విధంపుష్పం విష్ణోప్రీతికరం భవేత్." అనిచెప్పారు.

 పరిశుద్ధమనసుతో పరమాత్మను  సంకీర్తించి,మన దశేంద్రియములనే "తుమలర్" పవిత్ర పుష్పములను సమర్పించి,పొయపిళ్లై-గతజన్మములలో చేసిన  మన దోషములను.
తూక్-తునియల్-ఎండుగడ్డిని అగ్ని కాల్చివేసినట్లు, తీసివేస్తానని స్వామిచే వాగ్దానమును తీసుకుందాము అనిగోపికలతో చెప్పి,సామూహిక నోమునకై, ఇతర గోపికలను మేలుకొలుపుటకు గోదమ్మ చేతిని పట్టుకుని,మన అడుగులనుకదుపుదాము.
 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 
 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...